ETV Bharat / politics

'ఒక వైపు వైఎస్సార్ బిడ్డ - మరో వైపు వివేకా హత్య నిందితుడు - ఏవరికి ఓటు వేస్తారు?' - YS SHARMILA ELECTION speech - YS SHARMILA ELECTION SPEECH

YS Sharmila Election Campaign In Pulivendula: ఎంపీగా అవినాష్ రెడ్డి కడప స్టీల్‌ ప్లాంట్ కోసం ఏనాడైనా పోరాడారా అని కడప పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి షర్మిల ప్రశ్నించారు. కేసుల మాఫీ కోసం దిల్లీ వెళ్తున్నారే తప్ప ప్రజాప్రయోజనాలపై ఏనాడూ గొంతెత్తలేదని మండిపడ్డారు. పులివెందుల నియోజకవర్గంలో షర్మిల ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆమెకు మద్దతుగా వివేకా కుమార్తె సునీత కూడా పాల్గొన్నారు. వివేకాను హత్య చేసిన వారివైపు ఉంటారో న్యాయం కోసం పోరాడుతున్న షర్మిలపై ఉంటారో ప్రజలే తేల్చుకోవాలన్నారు.

YS Sharmila Election Campaign In Pulivendula
YS Sharmila Election Campaign In Pulivendula (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 9, 2024, 1:31 PM IST

YS Sharmila Election Campaign In Pulivendula : రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుతోంది. ఈ నెల 11న సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. మిగిలిన తక్కువ సమయంలో ముఖ్యనేతలను రప్పించి పట్టణాలు, మండల కేంద్రాల్లో రోడ్‌షోలు, సమావేశాలు నిర్వహించేలా అన్ని పార్టీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటివరకు పర్యటించని ప్రాంతాల్లో నియోజకవర్గ, జిల్లా నేతలతో ప్రచారం చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇదే సమయంలో వైఎస్సార్ జిల్లాలో షర్మిల, సునిత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించి న్యాయానికి ప్రాణం పోయాలని కడప ప్రజలకు వారు పిలుపునిచ్చారు. ఒక వైపు వైఎస్సార్ బిడ్డ మరో వైపు వివేకా హత్య నిందితుడు అవినాష్ రెడ్డి ఉన్నాడని, ఎవరికి ఓటు వేయాలో పులివెందుల ప్రజలు తెలుసుకోవాలని షర్మిల విజ్ఞప్తి చేశారు.

సొంత ఇలాకాలో జగన్​కు ఊహించని కలవరం - వైఎస్ భారతికి నిరసనలపర్వం - Protest To YS Bharathi

YS Sharmila Road Show : ఎన్నికలకు కేవలం మరో మూడు రోజులు మాత్రమే ఉండటంతో కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్‌ షర్మిలారెడ్డి వైఎస్సార్‌ జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వైఎస్ సునీత పాల్గొన్నారు. షర్మిల మాట్లాడుతూ వివేకాకి కొడుకులు లేరని, అందుకే జగన్​ను కొడుకులా చూశారని షర్మిలారెడ్డి గుర్తు చేశారు. అలాంటి బాబాయిని చంపితే హంతకులను కొడుకే కాపాడుతున్నారని ఆరోపించారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చూస్తే కర్నూల్​ హాస్పిటల్లో కాపాడారని ఆరోపించారు. ఇది అన్యాయం కాదా?, జగన్​కి అధికారం ఇచ్చింది అవినాష్ రెడ్డిని కాపాడటానికేనా అని ప్రశ్నించారు.

వివేకా హత్య కేసులో సాక్ష్యాలు తుడిచేస్తుంటే అవినాష్‌ ఎందుకు మౌనంగా ఉన్నారు: వైఎస్‌ షర్మిలారెడ్డి - YS Sharmila Election Campaign

వివేకా హత్య నిందితుడు వైస్ అవినాష్ రెడ్డి 10 ఏళ్లు ఎంపీగా ఉన్నారని ఒక్కసారి కూడా కడప స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదని గుర్తు షర్మిలారెడ్డి చేశారు. కడప స్టీల్ ప్లాంట్ వైఎస్సార్ కల అని, ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క ఉద్యమం కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎలాగే రాయలసీమకి కడప స్టీల్ ప్లాంట్​కు కూడా అంతా ప్రాధాన్యత ఉందని గుర్తు చేశారు. హత్యలు చేయడానికి అధికారం వాడుకుంటున్నారని, దిల్లీకి కేసులు నుంచి తప్పించుకోవడానికి పోతున్నాడరని, కడప ప్రజల కోసం ఒక్క రోజు కూడా దిల్లీ పోలేదని తెలిపారు.

న్యాయానికి, నేరానికి జరుగుతున్న పోరాటం - కడపలో గెలిచేది నేనే: షర్మిల - YS Sharmila Interview

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.