ETV Bharat / politics

ప్రజాక్షేత్రంలోకి జగన్ - మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర - YS Jagan Bus Tour Across the State

YS Jagan "Memantha Siddham" Bus Tour Across the State సిద్ధం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా భారీ ప్లెక్సీలతో ప్రతిపక్షాలకు సవాల్ విసిరిన జగన్, ఈ సారి 'మేమంతా సిద్ధం' మంటున్నాడు. ఎన్డీఏ కూటమిని ఎదుర్కొనే ప్రణాళికలపై పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలతో సీఎం జగన్ భేటీ అయ్యాడు. ఎన్నికలకు చాలా రోజులు గడువు ఉండటంతో పార్టీ శ్రేణులను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు.

ysrcp_campaign
ysrcp_campaign
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 18, 2024, 9:26 PM IST

Updated : Mar 18, 2024, 9:57 PM IST

YS Jagan "Memantha Siddham" Bus Tour Across the State: ఎన్నికలకు దాదాపు రెండు నెలల సమయం ఉండటంతో పార్టీ శ్రేణులను నిత్యం ప్రజల్లో ఉండేలా సీఎం జగన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సిద్ధం పేరుతో భారీ ప్లెక్సీలతో పెద్ద ఎత్తు ప్రచార సభలను నిర్వహించిన ఆయన, తాజాగా 'మేమంతా సిద్ధం' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రలతో ప్రచారం చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇందుకోసం పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలతో సీఎం జగన్‌ భేటీ (CM Jagan met with regional coordinators) అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో (Tadepalli CM Camp Office) వారితో సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమిని ఎదుర్కొనే ప్రణాళికలపై నాయకులతో చర్చలు జరిపారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతిరోజు ఒక జిల్లాలో బస్సు యాత్ర, బహిరంగ సభ ద్వారా నెల రోజులు ప్రచారం నిర్వహించనున్నట్లు నాయకులకు తెలిపారు. జిల్లాలవారీగా పార్టీ పరిస్థితులపై చర్చించి నేతలకు దిశానిర్దేశం చేశారు. మేనిఫెస్టో అంశాలు, సీఎం పర్యటనల వివరాలు రేపు ప్రకటించనున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి.

ఎన్నికల సంఘం ఆదేశాలు బేఖాతరు-వాలంటీర్లే కర్త,కర్మ,క్రియ గా వైసీపీ ప్రచారం

ఎన్నికల సమరానికి సన్నద్ధం: " మేమంతా సిద్ధం" పేరిట రాష్ట్రవ్యాప్తంగా జగన్ చేపట్టే బస్సుయాత్రపై ఇప్పటికే రూట్ మ్యాప్ ఖరాలు చేసినట్లు తెలిసింది. దీనిపై పూర్తి వివరాలను మంగళవారం విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 26 లేదా 27వ తేదీన సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభమవుతుందని, ఈ లోగ పార్టీ శ్రేణులను ఎన్నికల సమరానికి సన్నద్ధంచేసే సూచనలు జారీ చేసేందుకు పార్టీ నేతలు శ్రమిస్తున్నారు.

'ఓటర్లకు ప్రలోభాలు'- ఎంపీ ఎంవీవీ ఇంట్లో ఎన్నికల బృందాల తనిఖీ

మేము సిధ్దం మా బూత్ సిధ్దం: రాష్ట్రంలో ప్రాంతాల వారీగా నాలుగు జిల్లాల్లో సిధ్దం పేరిట బహిరంగసభలను వైసీపీ నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ పార్టీ కార్యకర్తలను, నాయత్వాన్ని సమాయత్తం చేయడానికి "మేము సిధ్దం మా బూత్ సిధ్దం " పేరిట కార్యక్రమాలు జరుగుతున్నాయి. “మేము సిద్ధం మా బూత్ సిద్ధం – ఎన్నికల సమరానికి “ మేమంతా సిద్ధం’’ లక్ష్యంతో బస్సుయాత్ర (Memantha Siddham Bus Tour) కొనసాగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ బస్సు యాత్ర ప్రతిరోజూ వివిధ నియోజకవర్గాల్లో జరుగుతుంది.

ఎన్నికల కోడ్​ను పట్టించుకోని వైసీపీ నేతలు- ఏలూరులో దర్శనమిస్తున్న ఫ్లెక్సీలు

జగన్ ఇకపై పూర్తిగా జనంలోనే: ఉదయం పూట పార్టీ నేతలతో సీఎం భేటీ అవుతారు. ప్రభుత్వం పనితీరును మెరుగుపరిచేందుకు సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. సాయంత్రం ఆ జిల్లా లేదా పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. బస్సుయాత్ర ప్రారంభం అయిన తర్వాత, యాత్ర పూర్తయ్యేంత వరకూ సీఎం జగన్ పూర్తిగా జనంలోనే ఉండనున్నారు.

Last Updated : Mar 18, 2024, 9:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.