ETV Bharat / politics

అనకాపల్లిలో ఉద్రిక్తత - టీడీపీ శ్రేణులపై వైసీపీ నాయకుల కవ్వింపు చర్యలు - NDA Alliance Candidates Nomination

Tension in Vangalapudi Anita and CM Ramesh Nomination: అనకాపల్లి జిల్లా నక్కలపల్లిలో కూటమి అభ్యర్థులైన వంగలపూడి అనిత, సీఎం రమేశ్ నామినేషన్ దాఖలు చేశారు. ఆర్వో కేంద్రం వద్దకు రాగానే టీడీపీ, వైసీపీ నాయకులు ఒకేసారి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇందులో భాగంగా టీడీపీ శ్రేణులపై వైసీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో ఇరు వర్గాల నాయకుల మధ్య తోపులాట చోటుచేసకుంది.

tension_in_nominations
tension_in_nominations
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 22, 2024, 6:52 PM IST

Tension in Vangalapudi Anita and CM Ramesh Nomination: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఓటమి అభ్యర్థి తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షులు వంగలపూడి అనిత నామినేషన్ కార్యక్రమం నక్కపల్లిలో సోమవారం అట్టహాసంగా సాగింది. ఉదయం నామపత్రాలకు వెంకన్న ఆలయంలో పూజలు చేయించారు. అనంతరం తన నివాసం నుంచి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, తదితరులతో కలిసి నక్కపల్లి ఆర్ఓ కార్యాలయానికి వాహనంపై ర్యాలీగా బయలుదేరారు. భారీగా కూటమి శ్రేణులు ఇక్కడికి చేరుకోగా పోలీసులు ట్రాఫిక్ నియంత్రణలో వైఫల్యం చెందారు. దీంతో వీరు ర్యాలీ నిర్వహించే అవకాశం లేకపోవడంతో అనిత, రమేష్ సహా అంత కాలినడకనే నక్కపల్లి కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఇక్కడ నామ పత్రాలు దాఖలు చేశారు.

సీఎం జగన్ దళిత ద్రోహి - సమసమాజ స్థాపనకు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైంది: బాలకృష్ణ - Balakrishna Election Campaign

కార్యక్రమానికి మద్దతుగా నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి వేలాదిగా కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు నక్కపల్లికి తరలి రావడంతో ఈ ప్రాంతం పసుపుమయంగా మారింది. మరో వైపున వైసీపీ అభ్యర్థి కంభాల జోగులు సైతం తన మద్దతు దారులతో ఇక్కడికి చేరుకోవడంతో జాతీయ రహదారిపై విశాఖ విజయవాడ మార్గంలో కిలోమీటర్ల మేర వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు దీన్ని నియంత్రించడానికి నానా అవస్థలు పడ్డారు. సమీప సర్కిళ్ల పరిధిలోని పోలీసులు ఇక్కడికి వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు.

ఉద్యోగులకు ఒకటో తారీఖున వేతనాలు - ఆ అధికారులపై న్యాయవిచారణ : లోకేశ్ - Nara Lokesh Election Campaign

టీడీపీ కూటమి అభ్యర్థి వంగలపూడి అనిత, వైసీపీ అభ్యర్థి కంబాల జోగులు ఒకే సమయంలో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆర్వో కేంద్రం వద్దకు టీడీపీ, వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఒకేసారి ఎదురు కావడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇందులో భాగంగా వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. టీడీపీ నాయకులను, కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా అల్లరిమూక చెలరేగిపోయింది. దీంతో ఒకానొక దశలో ఇరు వర్గాల మధ్య తోపులాట చాలా రేగింది. నామినేషన్ వేసేందుకు వచ్చినా టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వైసీపీ తరుపున వచ్చిన వారి కొంతమంది వైసీపీ జెండాలు ఎగరవేస్తూ రెచ్చగొట్టే అల్లరి సృష్టించేందుకు ప్రయత్నం చేశారు.

మైలవరం టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం - చేతులు కలిపిన ఆ ఇద్దరు నేతలు - vasanta met devineni

నామినేషన్ వేసే కేంద్రం వద్ద కొంతసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు తెరుకుని స్వల్ప లాఠీచార్జి చేసి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. వైసీపీ నాయకులు టీడీపీ కుటమికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే కబ్బెబ్బ చర్ల పాల్పడి అల్లర్ల సృష్టించేందుకు ప్రయత్నించారని కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత ఆరోపించారు. ముందుగా అనుమతి తీసుకున్న సరే పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించాలని ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పేర్కొన్నారు.

నక్కలపల్లిలో నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ శ్రేణులపై వైసీపీ నాయకుల కవ్వింపు చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.