ETV Bharat / politics

వైసీపీకి షాక్​ ఇచ్చిన మరో ఎమ్మెల్యే- షర్మిల సమక్షంలో కాంగ్రెస్ గూటికి - YCP MLA Eliza joined Congress - YCP MLA ELIZA JOINED CONGRESS

YCP MLA Vunnamatla Eliza Joined Congress: రాష్ట్రంలో ఎన్నికలు రాబోయే తరుణంలో వైసీపీకి ఎదురుదెబ్బలు గట్టిగానే తగులుతోన్నాయి. ఇవాళ ఉదయం గూడూరు ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. తాజాగ మధ్యహ్నం చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా వైసీపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరడం చర్చాంశనీయంగా మారింది.

eliza_joined_congress
eliza_joined_congress
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 24, 2024, 6:32 PM IST

YCP MLA Vunnamatla Eliza Joined Congress: ఎన్నికల ముందు వైసీపీకి షాక్​లు మీద షాక్​లు తగులుతున్నాయి. ఒక్కొక్కరిగా ఆ పార్టీని వీడుతూనే ఉన్నారు. అధిష్టానంలో ఉన్న పెద్దల ఒత్తిడి తట్టుకోలేక అలానే వారికి తగిన గౌరవం ఇవ్వట్లేదనే ఆవేదనతో వైసీపీని వీడుతూనే ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నా తమకు సరైన గౌరవం ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెత్తందారుల చర్యల వల్లే వైసీపీ నుంచి బయటకు వచ్చినట్లు నేతలు స్పష్టం చేస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే ఎలీజా వైసీపీని వీడి కాంగ్రెస్​లో చేరారు.

సీ-విజిల్​​లో ఫిర్యాదు - వ్యక్తిపై వైసీపీ నేత దాడి - YCP Attack C Vigil Complaint Person

చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా (Chintalapudi MLA Vunnamatla Eliza) వైసీపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. హైదరాబాద్​లోని లోటస్ పాండ్ నివాసంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (PCC President YS Sharmila) సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎలీజాకు కండువా కప్పిన షర్మిల ఆయన్ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్ కూడా వైసీపీ నుంచి కాంగ్రెస్​లోకి చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన వైసీపీ శాసనసభ్యుల సంఖ్య రెండుకు చేరింది. ఇవాళ ఉదయం నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన తిరుపతి ఎంపీగా బీజేపీ తరపున పోటీకి దిగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మరికొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. గతంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సైతం పార్టీలో చేరేందుకు సిద్ధమై బుజ్జగింపులతో మళ్లీ వెనక్కు తగ్గిన విషయం తెలిసిందే.

విశాఖ డ్రగ్స్‌ వ్యవహారంలో కూనం కోటయ్య కుటుంబం - వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు - Vizag Drugs Case YSRCP Relation

MLA Eliza Comments: కాంగ్రెస్ లో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఎలీజా తన రా రాజీనామా లేఖను వైసీపీ కార్యాలయానికి పంపించి వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్​లో (YCP MLA Eliza joined Congress) చేరినట్లు తెలిపారు. చింతలపూడి నియోజకవర్గంలో స్థానిక రాజకీయాలు, కుట్రలు తట్టుకోలేకపోయానని తెలిపారు. నన్ను ఎన్నోరకాలుగా ఇబ్బందులకు గురిచేశారనీ అనేక సార్లు అవమాన పరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా నాకు తెలియకుండా వైసీపీ నాయకులు అనేక కార్యక్రమాలు చేశారని అన్నారు. శిలా ఫలకాల మీద తన పేరు కూడా తొలగించినట్లు తెలిపారు. వీటి గురించి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ఉపయోగం లేదని అన్నారు.

పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ శ్రేణులు - జనసేన నాయకులపై దాడి - YSRCP Leaders attack on Janasena

సొంత పార్టీ అనుకొని పని చేస్తే జగన్ తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ చాలా అవసరమని అందుకే ఈ పార్టీలో చేరినట్లు తెలిపారు. కాంగ్రెస్ నిజమైన సెక్యులర్ పార్టీ అని ఏ మతానికి, ఏ కులానికి సొంతం కాదని తెలిపారు. కాంగ్రెస్​లో గెలుపు కోసం కష్టపడతానని అన్నారు. రాష్ట్రంలో కచ్చితంగా కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని అన్నారు. వైసీపీలో చాలా మంది అసమ్మతి నేతలు ఉన్నారని వారంతా కాంగ్రెస్​లో చేరే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. అలానే నన్ను బయటకు పంపిన వైసీపీ నేతలు ఎవరో అందరికీ తెలుసుని ఎలీజా అన్నారు.

వైసీపీకి షాక్​ ఇచ్చిన మరో ఎమ్మెల్యే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.