ETV Bharat / politics

అధిష్టానాన్ని కంగారు పెడుతున్న కర్నూలు వైసీపీ నేతల వర్గపోరు - చేసేది లేక పార్టీకి వీడ్కోలు - CLASS WAR IN YCP - CLASS WAR IN YCP

YCP Leaders Class War in Kurnool Assembly Constituency: ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వైసీపీలో వర్గపోరు రోజు రోజుకీ ముదురుతోంది. తాజాగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని నేతల్లో వర్గపోరు ముదిరింది. ఓకరికొకరు సఖ్యత లేకుండా నడుచుకోవడంతో పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.

clas_war_in_ycp
clas_war_in_ycp
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 7, 2024, 8:12 PM IST

Updated : Apr 7, 2024, 8:41 PM IST

YCP Leaders Class War in Kurnool Assembly Constituency: కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీలో ముసలం ముదిరింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఎవరికి వారు అయ్యేసరికి కొత్తగా వచ్చిన అభ్యర్థి ఇంతియాజ్‌ ఒంటరయ్యారు. జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా సత్యనారాయణమ్మ నియామకం ద్వారా వైసీపీ అధిష్ఠానమే ఈ చిచ్చు రాజేసినట్లయింది.

అవినీతి, అక్రమాల్లో ఆ వైఎస్సార్సీపీ నేత "రాజా ది గ్రేట్‌"! - YSRCP Leader family Irregularities

ఉదయం స్వచ్ఛంద పదవీ విరమణ చేసి మధ్యాహ్నానికి ప్రభుత్వ ఆమోదం పొంది మర్నాడే సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరి కర్నూలు అసెంబ్లీ టికెట్ సాధించిన మాజీ ఐఏఎస్​ ఇంతియాజ్‌కు ఇప్పుడు పార్టీలో ఎవరూ తోడు లేకుండా పోయారు. టికెట్‌ దక్కకపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, (MLA Hafiz Khan) ఆయన వర్గం మొదటి నుంచీ ఇంతియాజ్‌కు దూరంగా ఉన్నారు. హఫీజ్‌ఖాన్​ను వ్యతిరేకిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి కర్నూలు టికెట్ తన కుటుంబానికి ఇవ్వాలని విశ్వప్రయత్నాలు చేశారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా ముస్లిం అయిన ఇంతియాజ్‌కు సీటిస్తున్నామని జిల్లా పార్టీ బాధ్యతలు మీకు అప్పగిస్తున్నానంటూ జగన్‌ హామీ ఇవ్వడంతో ఎస్వీ మోహన్‌రెడ్డి కాస్త మెత్తపడ్డారు.

చెప్పింది చేయాల్సిందే - సచివాలయ ఉద్యోగులపై వైఎస్సార్సీపీ నాయకుల దౌర్జన్యం - village ward secretariats

ప్రశ్నార్థకంగా మారిన మద్దతు: జగన్‌ హామీలను నమ్మి ఇంతియాజ్‌కు మద్దతుగా ఎస్వీ మోహన్‌రెడ్డి, ఆయన వర్గం ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. కానీ పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని ఎస్వీ మోహన్‌రెడ్డికి (Former MLA SV Mohan Reddy) కాకుండా సత్యనారాయణమ్మకు ఇచ్చారు. అటు టికెట్ ఇవ్వక, ఇటు పార్టీ పదవికీ దూరం పెట్టడంతో ఎస్వీ మోహన్‌రెడ్డికి పుండు మీద కారం చల్లినట్లయింది. దీంతో ఇంతియాజ్‌కు మద్దతుగా పనిచేసేది లేదని ఆయన భీష్మించుకుని కూర్చున్నారు. దిక్కుతోచని స్థితిలో ఇంతియాజ్‌ పరిస్థితిని సజ్జల రామకృష్ణారెడ్డికి (Sajjala Ramakrishna Reddy) తెలియజేశారు. తర్వాత మోహన్‌రెడ్డి ఇంటికి వెళ్లి మద్దతు ఇవ్వాలని అర్థించారు. జగనే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్న ఆగ్రహంతో ఉన్న మోహన్‌రెడ్డి సజ్జల మాటలతో మెత్తబడతారా? ఇంతియాజ్‌కు మద్దతిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

వైసీపీ అధికార ప్రతినిధిలా సరికొత్త అవతారం - బయటపడ్డ కాంతిరాణా అసలు రంగు - Kanthi Rana Tata complaint to CEO

కర్నూలు మేయర్‌ బీవై. రామయ్యను (Mayor B.Y. Ramaiah) కర్నూలు లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించారు. కార్పొరేటర్‌గా ఉన్న సత్యనారాయణమ్మకు మేయర్ పదవి ఇస్తామని ఆ సమయంలో పార్టీ పెద్దలు ప్రకటించారు. ఎన్నికల్లో అటోఇటో అయితే పరిస్థితేంటన్న సందేహంతో ఇప్పటికిప్పుడు మేయర్ పదవిని వదులుకోలేనని రామయ్య తేల్చిచెప్పినట్లు తెలిసింది. జిల్లా పార్టీ అధ్యక్షుడిగానూ ఆయనే ఉన్నారు. సత్యనారాయణమ్మ సామాజికవర్గం కర్నూలు జిల్లాలో కొంత బలంగా ఉంది. ఆమెకు మేయర్‌ పదవి ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం వంటివి ఎన్నికల్లో ప్రభావం చూపుతాయన్న భయంతోనే ఇష్టం లేకపోయినా ఆమెకు పార్టీ జిల్లా పగ్గాలు కట్టబెట్టారనే వాదనలు వినిపిస్తున్నాయి.

అధిష్టానాన్ని కంగారు పెడుతున్న కర్నూలు వైసీపీ నేతల వర్గపోరు - చేసేది లేక పార్టీకి వీడ్కోలు

Last Updated : Apr 7, 2024, 8:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.