ETV Bharat / politics

శాంతిభద్రతలపై నేడు శ్వేతపత్రం - అసెంబ్లీ వేదికగా విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు - White Paper on Law and Order in AP - WHITE PAPER ON LAW AND ORDER IN AP

White Paper on Law and Order in AP : వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఇటీవల మృతి చెందిన మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం ప్రకటించనుంది.

White Paper on Law and Order in AP
White Paper on Law and Order in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 25, 2024, 6:57 AM IST

AP Assembly Sessions 2024 Updates : గడచిన ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం శాంతిభద్రతల పరంగా రాష్ట్రంలో వ్యవహరించిన తీరును ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో వివరించనున్నారు. జగన్‌ ఏలుబడిలోని అక్రమ కేసులు, నిర్బంధకాండ, ప్రతిపక్షాల అణచివేత, పౌరులపై నమోదైన కేసులు వంటి అంశాలపై శ్వేతపత్రం ద్వారా వివరాలు వెల్లడించనున్నారు. భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునేలా గత పాలకులు వ్యవహరించిన తీరు, సాధారణ పౌరులపైనా కేసులను నమోదు చేసిన వ్యవహారం, ఎస్సీలపై దాడులు, హత్య కేసులు వంటి అంశాలనూ ప్రస్తావించే అవకాశముంది.

White Paper on Law and Order in AP : అమరావతి రైతుల ఉద్యమాన్ని అణచివేసేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును వివరించనున్నారు. డాక్టర్ సుధాకర్, దళితుడైన డ్రైవర్ సుబ్రమణ్యం, కోడి కత్తి కేసు వ్యవహారంలో గత సర్కార్ వైఖరి, వివేకా హత్యకేసులో కేంద్ర దర్యాప్తు సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవటం వంటి అంశాలను శ్వేతపత్రంలో ప్రస్తావించనున్నట్టు సమాచారం. గడచిన ఐదేళ్లుగా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లు పెద్ద ఎత్తున నమోదైన అంశాలనూ శ్వేతపత్రం ద్వారా ప్రజల ముందుకు తీసుకురానున్నట్టు తెలుస్తోంది.

ఇటీవల మృతిచెందిన మాజీ శాసనసభ్యులు పెండ్యాల వెంకట కృష్ణారావు, యెర్నేని సీతాదేవి, అనిశెట్టి బుల్లబ్బాయ్ రెడ్డి, సద్దపల్లి వెంకటరెడ్డిలకు శాసనసభ సంతాపం ప్రకటించనుంది. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ , సంఘ విద్రోహశక్తుల నియంత్రణ, విశాఖలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సౌకర్యాలపై మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు. అదేవిధంగా వైఎస్సార్సీపీ పాలనలో జరిగిన ఎస్సీ ఎస్టీల సంక్షేమ పథకాల రద్దు, టిడ్కో గృహాలు, సుప్రీంకోర్టులో కేసులు , ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కేసీ కెనాల్ మళ్లింపు వంటి అంశాలపై మంత్రులు సమాధానం ఇస్తారు.

మండలిలో శ్వేతపత్రం విడుదల చేయనున్న హోంమంత్రి అనిత : వైఎస్సార్సీపీ పాలనలో అదుపుతప్పిన శాంతిభద్రతలపై హోంమంత్రి వంగలపూడి అనిత శాసనమండలిలో శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ప్రశ్నోత్తరాల్లో ప్రైవేట్ ఏజన్సీలకు మోనజైట్ సిలికాన్‌ల అనధికార విక్రయం, రాష్ట్రంలో ఇ-వ్యర్థాల తొలగింపు, 2023 - 2024 మధ్యకాలంలో ధాన్యం సేకరణ, నిత్యావసరాల ధరల పెరుగుదలపై మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు. పంటల బీమా బకాయిల చెల్లింపు, రైతులకు పెట్టుబడి సాయం, మంగంపేట బెరైటీస్ గనులలో అక్రమాలు, పులివెందుల గృహనిర్మాణ ప్రాజెక్టులో అనర్హులైన లబ్ధిదారులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తారు.

"పాలకుడు ఎలా ఉండకూడదో గత ఐదేళ్లలో చూశాం- మద్యం సొమ్మంతా వైఎస్సార్సీపీ నేతల జేబుల్లోకి వెళ్లింది" - excise department white paper

హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లు - అసెంబ్లీ ఆమోదం - AP Assembly Sessions 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.