ETV Bharat / politics

బెజవాడలో అన్నదమ్ముల సవాల్- బలంగా టీడీపీ, బోణీకొట్టని వైఎస్సార్సీపీ ​ - Vijayawada LOK SABHA ELECTIONS - VIJAYAWADA LOK SABHA ELECTIONS

Vijayawada constituency : అటు కృష్ణమ్మ గలగలలు, ఇటు కనకదుర్గమ్మ దీవెనలు. కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య వారధి ప్రకాశం బ్యారేజ్, ఇంద్రకీలాద్రి పర్వతం విజయవాడ నగరానికి వన్నెతెస్తుంటాయి. తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్​ ఉన్న విజయవాడలో ప్రస్తుతం కేశినేని సోదరుల మధ్య పోరు ఆసక్తిగా మారింది.

vijayawada_loksabha
vijayawada_loksabha
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 20, 2024, 10:36 AM IST

Updated : Apr 20, 2024, 11:01 AM IST

Vijayawada constituency : విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం (Vijayawada Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. విజయవాడ నియోజకవర్గం ఆవిర్భావం నుంచి జనరల్‌ కేటగిరిలో ఉంది.

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు:

విజయవాడ లోక్​సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నందిగామ, తిరువూరు రిజర్వుడ్ స్థానాలు. 2022లో జిల్లాల పునర్విభజనలో భాగంగా ఎన్టీఆర్‌ జిల్లాను ఏర్పాటు చేశారు.

  1. విజయవాడ తూర్పు
  2. విజయవాడ మధ్య
  3. విజయవాడ పశ్చిమ
  4. మైలవరం
  5. నందిగామ
  6. జగ్గయ్యపేట
  7. తిరువూరు

తిరుపతి లోక్​సభ స్థానంపై కన్నేసిన బీజేపీ- వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఎవరికో! - Tirupati LOK SABHA ELECTIONS

తాజా గణాంకాల ప్రకారం ఓటర్ల వివరాలు

  • మొత్తం ఓటర్లు 16,75,381
  • పురుషులు 8,17,837
  • మహిళలు 8,57,394
  • ట్రాన్స్‌జెండర్లు 150
vijayawada_loksabha
vijayawada_loksabha

తొలిసారి స్వతంత్ర అభ్యర్థి హరిశ్చంద్ర ఛటోపాధ్యాయ విజయం సాధించగా, 1967లో డాక్టర్ కేఎల్.రావు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్‌పై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేశినేని నాని 8,726 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

ప్రస్తుత ఎన్నికల్లో విజయవాడ నుంచి టీడీపీ తరఫున కేశినేని శివనాథ్‌ (చిన్ని) (Kesineni Chinni) పోటీ చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో పార్టీకి విధేయంగా పనిచేస్తూ, నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర లాంటి కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించిన ఆయనకు అందరూ ఊహించినట్టే టికెట్‌ దక్కింది. మరోవైపు, విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) కొన్ని నెలల కిందటే అధికార పార్టీ వైఎస్సార్సీపీలో కండువా కప్పుకొన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రత్యర్థి కూడా ఆయనే. నిన్నటి వరకూ వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్‌ను దుమ్మెత్తి పోసిన ఎంపీ నాని ఇప్పుడు ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అమరావతి రాజధాని కావాలన్న ఆయన ఇప్పుడు వైఎస్సార్సీపీ నిర్ణయాలకు వంతపాడుతున్నారు. మరోవైపు చిన్ని సేవా కార్యక్రమాలతో ప్రజల్లో ముందుకు సాగుతున్నారు. అన్న క్యాంటీన్లు, వైద్య శిబిరాలు, జాబ్‌మేళాలతో నిత్యం జనంలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఎన్నిక అన్నదమ్ముల మధ్య నువ్వా నేనా అన్నట్లు ఉండటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

డాల్ఫిన్​ నోస్​ సిటీ మన వాల్తేరు - విశాఖ లోక్​సభ గతం తెలుసా? - Visakhapatnam LOK SABHA ELECTIONS

బెజవాడ ఎంపీలు వీరే..

1952: హరిశ్చంద్ర ఛటోపాధ్యాయ(స్వతంత్ర)

1957: కె.అచ్చమాంబ(కాంగ్రెస్)

1962: కె.ఎల్.రావు(కాంగ్రెస్)

1967: కె.ఎల్.రావు(కాంగ్రెస్)

1971: కె.ఎల్.రావు(కాంగ్రెస్)

1977: గోడే మురహరి(కాంగ్రెస్)

1980: చెన్నుపాటి విద్య(కాంగ్రెస్) (ఐ)

1984: వడ్డే శోభనాద్రీశ్వరరావు (టీడీపీ)

గత ఎన్నికల్లో విజేతలు - సమీప ప్రత్యర్థులు

1989: చెన్నుపాటి విద్య (కాంగ్రెస్) - వడ్డె శోభనాద్రీశ్వర్​ రావు (టీడీపీ)

1991: వడ్డే శోభనాద్రీశ్వరరావు (టీడీపీ) - విద్య చెన్నుపాటి (కాంగ్రెస్)

1996: పర్వతనేని ఉపేంద్ర (కాంగ్రెస్) - వడ్డె శోభనాద్రీశ్వర్​ రావు (టీడీపీ)

1998: పర్వతనేని ఉపేంద్ర (కాంగ్రెస్) - జై రమేష్ దాసరి (టీడీపీ)

1999: గద్దె రామ్మోహన్ (టీడీపీ) - పి.ఉపేంద్ర (కాంగ్రెస్)

2004: లగడపాటి రాజగోపాల్ (కాంగ్రెస్) - అశ్వనీదత్​ (టీడీపీ)

2009: లగడపాటి రాజగోపాల్ (కాంగ్రెస్) - వల్లభనేని వంశీమోహన్ (టీడీపీ)

2014: కేశినేని నాని(టీడీపీ) - కోనేరు రాజేంద్రప్రసాద్ ​ (వైఎస్సార్సీపీ)

2019: కేశినేని నాని (టీడీపీ) - ప్రసాద్​.వి.పొట్లూరి​ (వైఎస్సార్సీపీ)

Last Updated : Apr 20, 2024, 11:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.