ETV Bharat / politics

యూపీఏ, ఎన్డీయే ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా - సీఎం రేవంత్​ రెడ్డికి కిషన్​రెడ్డి సవాల్ - Kishan Reddy Letter To Cm Revanth - KISHAN REDDY LETTER TO CM REVANTH

Union Minister Kishan Reddy Challenge To CM Revanth : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణకు యూపీఏ, ఎన్డీఏ ఇచ్చిన నిధులపై చర్చకు ఆహ్వానిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కొడంగల్, లేదా అమరవీరుల స్థూపం దగ్గర చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందంటూ వ్యాఖ్యానించడం తీవ్ర అభ్యంతరకరమన్నారు.

Kishan Reddy Letter To Cm Revanth Reddy
Union Minister Kishan Reddy Challenge To CM Revanth (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 5, 2024, 10:30 AM IST

Kishan Reddy Letter To Cm Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. 2004 నుంచి 2014 వరకు యుపీఏ హయాంలో 2014 నుంచి 2024 వరకు ఎన్డీఏ హాయాంలో కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులపై అర్ధవంతమైన చర్చకు ఆహ్వానిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ హయాంలో చేసిన ఘనతలు, విజయాలు, సానుకూల ఫలితాలతో పాటు 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ పాలన వైఫల్యాలను, ప్రతికూలాంశాలను ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడిగా విమర్శించవచ్చు కానీ అబద్ధాలను ఆశ్రయించడం దురదృష్టకరం అన్నారు. పదేళ్లలో మోదీ తెలంగాణకు ఇచ్చిన నిధులపై సీఎం చర్చకు రావాలని సవాల్‌ విసిరారు.

గ్యారంటీలు అమలు చేయకుండా గాడిద గుడ్డు చూపిస్తున్నారు : కిషన్‌రెడ్డి - lok sabha elections 2024

Kishan Reddy Fires On CM Revanth : ముఖ్యమంత్రితో సహా మంత్రులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, అభ్యర్థులు అబద్ధాలు మాట్లాడటం ఇది పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించడమే అవుతుందన్నారు. సామాజిక వాతావరణాన్ని కలుషితం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందంటూ వ్యాఖ్యానించడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో తెలంగాణకు రూ.9 లక్షల కోట్లకుపైగా నిధులను ఇచ్చిందని స్పష్టం చేశారు.

సీఎం చర్చకు రావాలని డిమాండ్‌ : 2014 - 24 కాలంలో మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చిందనే అంశంపై తాను చర్చకు వస్తానని 2004-2014 కాలంలో యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రపద్రేశ్‌లోని తెలంగాణ ప్రాంతానికి ఏమిచ్చిందనే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు. కొడంగల్, అమవీరుల స్థూపమా, తేదీ మీరే నిర్ణయించండని సీఎంకు సూచించారు. వాస్తవాలతో అర్థవంతమైన చర్చ జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

కాంగ్రెస్ తెలంగాణకు ఏం ఇచ్చింది : ప్రధానిగా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ అభివృద్ధికి, సంక్షేమ పథకాలకు ఇచ్చిన నిధులెన్నో తాను చర్చకు వస్తానని అన్నారు. జాతీయ రహదారులు, రైల్వే నెట్‌వర్క్ రైతుల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వంటి వాటిలో మోదీ ఏం చేశారో తాను వివరిస్తాన్నారు. గత కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో రేవంత్‌రెడ్డి తెలపాలని ఆ లేఖలో సవాల్ చేశారు.

బీజేపీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్​కు లేదు : కిషన్ రెడ్డి - Kishan Reddy Fires On Congress

దేశ, రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది :​ కిషన్​రెడ్డి - BJP Manifesto 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.