Police Cases Against Political Leaders : తెలుగుదేశం అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ సహా పలువురు రాజకీయ నాయకులపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. కేసుల వివరాలను టీడీపీ అధినేత చంద్రబాబు, ఇతరులకు మెయిల్ లో పంపామని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ఒకసారి మెయిల్ చెక్ చేసుకుని చెప్పాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులను హైకోర్ట్ న్యాయమూర్తి కోరారు. మధ్యాహ్నం లోపు చెప్పాలని న్యాయమూర్తి తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, అచ్చెన్నయుడు, మాజీ మంత్రులు నారాయణ, అయ్యన్న పాత్రుడు, రామచంద్ర యాదవ్ పై కేసుల వివరాలు ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలైంది. మార్చి 1వ తేదీన డీజీపీకి లేఖ రాసినప్పటికీ నేటి వరకు వివరాలు ఇవ్వలేదని చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో కేసుల వివరాలు ఇవ్వాలని హైకోర్ట మౌఖికంగా ఆదేశించడం విదితమే.
కేసుల వివరాలివ్వడానికి ఎంత సమయం కావాలి: హైకోర్టు - Cases on Political Leaders
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై నమోదైన కేసుల వివరాలను తక్షణమే వారికి అందజేయాలని ఏపీ హైకోర్టు పోలీస్ శాఖను ఆదేశించింది. తమపై నమోదైన కేసుల వివరాలివ్వాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ సహా పలువురు నేతలు ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే పలుమార్లు విచారించగా ఈ నెల 16లోగా అందజేయాలని మౌఖిక ఉత్తర్వులు ఇచ్చింది.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమపై నమోదైన పోలీస్ కేసుల వివరాలను నామినేషన్ పత్రాల్లో వెల్లడించాలి. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌తో పాటు ఇంకా పలు పార్టీల నేతలపై ఎక్కడ ఎలాంటి కేసులు ఉన్నాయో పోలీసులు వెల్లడించడం లేదు. అధికార పార్టీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ కేసుల వివరాలు గోప్యంగా ఉంచుతోందని, తద్వారా ఎన్నికల్లో అనర్హత వేసేలా ఆలోచిస్తోందని ఆయా నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే వారంతా జిల్లాల ఎస్పీలతో పాటు డీజీపీకి సైతం లేఖలు రాశారు. తమపై నమోదైన కేసుల వివరాలివ్వాలంటూ కోరగా స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించగా తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి.
16లోగా ఆ వివరాలిచ్చేయండి - పోలీసులకు హైకోర్టు ఆదేశం - cases on political leaders
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్టేషన్లలో తమపై ఉన్న కేసుల వివరాలను అందజేసేలా ఎస్పీలు, డీజీపీని ఆదేశించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు విచారించింది. వ్యాజ్యాలు దాఖలు చేసిన వారిలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, సీనియర్ నేత, నర్సీపట్నం టీడీపీ అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడు, గాజువాక టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు, భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధ్యక్షుడు బి.రామచంద్రయాదవ్ హైకోర్టులో తదితరులున్నారు.