ETV Bharat / politics

'ఆ పత్రాలు IRR కేసుకు సంబంధించినవే' సీఐడీ ధ్రువీకరణ - దహనంపై టీడీపీ ఆగ్రహం - Inner Ring Road case files - INNER RING ROAD CASE FILES

CID set fire to IRR case files : తాడేపల్లి సిట్ కార్యాలయం ప్రాంగణంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు దస్త్రాలకు సీఐడీ సిబ్బంది నిప్పంటించారు. తమ బాస్ ఆదేశాల మేరకే వాటిని తగలపెడుతున్నామని అడిగిన స్థానికులకు సమాధానం కూడా ఇచ్చారు. తగలపెడుతున్న తీరును తమ పెద్దబాస్ కు సాక్ష్యంగా చూపేందుకు మొత్తం కూడా వీడియో రికార్డింగ్ చేసుకున్నారు. జరిగిన తీరును స్థానికులు కూడా రికార్డు చేసి తెలుగుదేశం నేతలకు సమాచారం ఇవ్వటంతో కీలక ఘటన వెలుగులోకి వచ్చినట్లైంది.

cid_set_fire_to_irr_case_files
cid_set_fire_to_irr_case_files
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 8, 2024, 6:04 PM IST

'ఆ పత్రాలు IRR కేసుకు సంబంధించినవే' సీఐడీ ధ్రువీకరణ - దహనంపై టీడీపీ ఆగ్రహం

CID Set Fire to IRR Case Files : తాడేపల్లిలోని పాతూరు రోడ్డు సంవృద్ధి నెక్సా అపార్ట్మెంట్ లో సీఐడీ తన సిట్ కార్యాలయాన్ని 5ఫ్లోర్లలో ఏర్పాటు చేసుకుంది. సీఐడీ అదనపు డీజీ కొల్లి రఘురామరెడ్డి కూడా అందులోనే నివాసం ఉంటున్నారు. గేటెడ్ కమ్యూనిటీ (Gated community)కి చెందిన ఈ అపార్ట్ మెంట్ లో 200కు పైగా సాధారణ కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ ఉదయం 10 గంటల సమయంలో కొల్లి రఘురామరెడ్డి సిబ్బంది ఓ సంచి నిండా పలు దస్త్రాలను అపార్ట్​మెంట్ ప్రాంగణంలో పడేసి వాటిని తగులబెట్టడాన్ని అపార్ట్​మెంట్​లో ఉన్న ఇతర కుటుంబాల వారు గమనించి ప్రశ్నించారు.

చంద్రబాబు, హెరిటేజ్​కు సంబంధించిన దస్త్రాలు మా పెద్ద బాస్ తగలపెట్టమంటే పెడుతున్నట్లు సదరు వ్యక్తి స్థానికులకు చెప్పాడు. పూర్తిగా తగలపెట్టిన సాక్ష్యాన్ని కూడా వీడియో రూపంలో తమ పెద్ద బాస్​కు పంపేందుకు చిత్రీకరిస్తున్నానని సమాధానం ఇచ్చాడు. వెంటనే జరుగుతున్న ఘటనపై అనుమానం వచ్చిన స్థానికులు సమీపంలో ఉన్న తెలుగుదేశం నాయకులకు సమాచారం ఇచ్చారు. తెలుగుదేశం నాయకులు అక్కడికి చేరుకుని జరుగుతున్న తతంగాన్ని వీడియో చిత్రీకరించారు. సీఐడీ సిబ్బందికి జరుగుతున్న పరిణామాలపై అనుమానం వ్యక్తమవటంతో వీడియోలు తీయొద్దంటూ బెదిరింపులకు దిగారు. సిట్ అధిపతి కొల్లి రఘురామ్ రెడ్డి (SIT head Kolli Raghuram Reddy) ఈమేర ఆదేశాలు జారీ చేసినట్టు కూడా వారిని బెదిరించే యత్నం చేశారు.

చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు- అసైన్డ్‌ భూముల కేసులో ఛార్జిషీట్‌

జగన్ ఆదేశాలతో చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు సిట్ అనేక అక్రమ కేసులు బనాయించిందని పార్టీ వర్గాలు మండిపడుతున్నాయి. గతేడాది ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్​మెంట్​కు సంబంధించి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ నారా లోకేశ్ కు నోటీసులు జారీ చేసి వరుసగా రెండురోజులు విచారణకు పిలిచింది. విచారణ అనంతరం ఎటువంటి అనుమతులు లేకుండా హెరిటేజ్, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ఐటి రిటర్న్స్ (IT returns), ఇతర కీలక డాక్యుమెంట్స్ దొడ్డి దారిన సంపాదించి తనని బెదించారని అప్పట్లో లోకేశ్​ సీఐడీపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేసుతో సంబంధం లేని వారి వ్యక్తిగత పత్రాలు మీ చేతికి ఎలా వచ్చాయి అని ఆరోజే లోకేశ్ అధికారులను నిలదీశారు. ఇప్పుడు అన్ని సర్వేలు ఎన్డీఏ కూటమి గెలుపు పక్కా అని చెప్పడంతో రఘురామ్ రెడ్డి పత్రాలు తగలపెట్టించారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. చేసిన తప్పుడు పనులు, ఫేక్ ఆధారాలు, కీలక డాక్యుమెంట్స్ తగలబెట్టమని ఆదేశాలు జారీ చేశారని తెలుగుదేశం మండిపడుతోంది. ప్రభుత్వం మారిన వెంటనే తప్పుడు పనులు చేసిన వారంతా జైలుకు పోవడం ఖాయమనే భయంతోనే ఇలా చేశారని చర్చ సర్వత్రా జరుగుతోంది. అందుకే పత్రాలు అన్ని దహనం చేయమని ఆదేశాలు ఇచ్చారని తెలుగుదేశం వర్గాలు చెప్తున్నాయి.

తెలుగుదేశం ఇతర నేతలపైన పెట్టిన తప్పుడు కేసులకు సంబంధించి కూడా ఇలానే తప్పుడు ఆధారాలు ధ్వంసం చేసే కుట్ర జరుగుతోందని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. సచివాలయం సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద భద్రత పెంచాలని వారు డిమాండ్ చేశారు.

తనపై ఉన్న కేసుల వివరాలివ్వాలని కోరుతూ డీజీపీకి చంద్రబాబు లేఖ

లోకేశ్ విచారణ సమయంలో పత్రాలపై ఆనాడే అడిగాం అని దేవినేని ఉమ గుర్తు చేశారు. ఆ పత్రాలు ఎలా వచ్చాయో ఇంతవరకు సమాధానం చెప్పలేదని మండిపడ్డారు. సీఐడీ రఘురామిరెడ్డి తప్పుడు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని, పత్రాల దహనంపై రఘురామిరెడ్డి, డీజీపీ సమాధానం చెప్పాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. పత్రాల దహనంపై సీఈవోకు కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

ఫైబర్‌ నెట్‌ కేసు - అభియోగపత్రం దాఖలు చేసిన సీఐడీ

ఎవరి ఉత్తర్వులతో పత్రాలు తగలబెట్టారో డీజీపీ చెప్పాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే పత్రాలు దహనం చేశారని వర్ల మండిపడ్డారు. తప్పుడు పనులు చేసిన అధికారులను వదిలేది లేదని, కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డీజీపీని డిమాండ్‌ చేశారు.

ఐఆర్​ఆర్​ కేసులో సీఐడీ చార్జిషీట్ - సీల్డ్‌ కవర్లో ఏసీబీ కోర్టుకు అందజేత

తాడేపల్లి కార్యాలయం ఆవరణలో ఇన్నర్‌రింగు రోడ్డు కేసుకు సంబంధించిన దస్త్రాలు తగులబెట్టిన విషయాన్ని సీఐడీ ధ్రువీకరించింది. ఈ మేరకు వివరణ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా ఆధారాల కోసం లక్షల కాపీలు ఫొటోస్టాట్‌ తీస్తుంటామని ఈ క్రమంలో జిరాక్స్‌ మిషన్‌ వేడెక్కి హాంగ్‌ కావడం, పేపర్లు స్ట్రక్‌ అవ్వడం జరుగుతుంటుందని సీఐడీ తెలిపింది. ఇలాంటి సందర్భాల్లో ప్రింటింగ్‌ సరిగా రాకపోవచ్చని, సరిగా రాని కాపీలను తగలబెట్టడం జరుగుతుంటుందని వెల్లడించింది. ఐతే ఆధారాలకు సంబంధించి సరైన కాపీలను తిరిగి ఫొటోస్టాట్‌ తీసుకుంటామని సీఐడీ స్పష్టం చేసింది. తగులబెట్టిన కాపీలకు సంబంధించిన సరైన జిరాక్స్‌ పేపర్లను కోర్టుకు సమర్పించామని తెలిపింది. హెరిటేజ్‌ సంస్థ, నారా బ్రాహ్మణి ఐటీ రిటర్న్స్‌ను అనుమతులు లేకుండా సేకరించారన్న లోకేశ్ ఆరోపణలపైనా సీఐడీ స్పందించింది. ఈ పత్రాలన్నింటినీ అధికారికంగానే సేకరించామని స్పష్టం చేసింది.

రెడ్​బుక్​ వ్యవహారం - లోకేశ్​కు ఏపీ సీఐడీ నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.