ETV Bharat / politics

నన్ను ఎవరూ కిడ్నాప్​ చేయలేదు - నేను బీఆర్​ఎస్​లోనే ఉన్నాను : ఆరూరి రమేశ్​ - BRS leader Aruri Ramesh join BJP

Tension at BRS Leader Aruri Ramesh Residence : తాను ఏ పార్టీ మారడం లేదని, తనను ఎవరూ కిడ్నాప్​ చేయలేదని బీఆర్​ఎస్​ నేత, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ తెలిపారు. ఆయన పార్టీ మారకుండా ఉండేందుకు బీఆర్​ఎస్​ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అంతకు ముందు హనుమకొండలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్​ఎస్​ నేత ఆరూరి రమేశ్​ ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

Aruri Ramesh Residence
Tension at BRS Leader Aruri Ramesh Residence
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 13, 2024, 3:32 PM IST

Updated : Mar 13, 2024, 4:09 PM IST

Tension at BRS Leader Aruri Ramesh Residence : తనను ఎవరూ కిడ్నాప్​ చేయలేదని బీఆర్​ఎస్​ నేత, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ స్పష్టం చేశారు. తమ పార్టీ నేతలతో కలిసి తాను హైదరాబాద్​ వచ్చానని అన్నారు. తాను బీఆర్​ఎస్​లోనే ఉన్నా అంటూ చెప్పారు. అసలు తాను అమిత్​ షాను కలవలేదని ప్రకటించారు. ఆరూరి రమేశ్​ను వరంగల్​ నుంచి హైదరాబాద్​ తీసుకువచ్చిన బీఆర్​ఎస్​ నేతలు, నేరుగా కేసీఆర్​ ఇంటికి తీసుకెళ్లారు. ఆయన పార్టీ మారకుండా కేసీఆర్​ వర్ధన్న పేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​తో చర్చించారు.

ఆరూరి రమేశ్​ను బలవంతంగా కారులో ఎక్కించుకున్న బీఆర్​ఎస్​ నేతలు : వరంగల్​ పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీకి సిద్ధమైన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ను బీఆర్​ఎస్​ నేతలు బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లడం కలకలం రేపింది. వరంగల్​ పార్లమెంటు స్థానానికి ఆరూరి బీజేపీ తరఫున పోటీ చేయనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి బలం చేకూర్చుతూ మంగళవారం రాత్రి హైదరాబాద్​లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా(Aruri Ramesh meet Amit Shah)తో సమావేశం అయినట్లు సమాచారం. దీంతో ఆయన బీజేపీలో చేరడం ఖాయమైంది. ఇదే విషయాన్ని మీడియాకు వెల్లడించేందుకు తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో బీఆర్​ఎస్​ నేతలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎమ్మెల్సీ బస్వరాజ్​ సారయ్య, కుడా మాజీ ఛైర్మన్​ సుందర్​ రాజ్​ తదితరులు ఆరూరి నివాసానికి చేరుకున్నారు. బీఆర్​ఎస్​ను వీడవద్దంటూ ఆరూరి రమేశ్​ను బుజ్జగించే యత్నం చేశారు. ఇదే సమయంలో ఆరూరిని బలవంతంగా కారులో ఎక్కించేందుకు ప్రయత్నించగా ఆరూరి అనుచరులు అడ్డుకున్నారు. పరస్పర నినాదాల నడుమ ఆయనను బీఆర్​ఎస్​ నేతలు(BRS vs BJP) తమ వాహనంలో ఎక్కించుకుని హైదరాబాద్​ తీసుకెళ్లారు.

BRS vs BJP at Hanumakonda : ఈ విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు పెంబర్తి వద్ద మరోసారి బీఆర్​ఎస్​ నేతల వాహనాలను అడ్డుకోగా ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. ఇరువర్గాల తోపులాటల్లో ఆరూరి రమేశ్​ చొక్కా చిరిగిపోయింది. స్థానిక నాయకులు కేంద్రమంత్రి కిషన్​ రెడ్డితో ఆరూరికి ఫోన్​ చేయించి మాట్లాడించారు. ఈ జరిగిన విషయం మొత్తం ఆయన కిషన్​ రెడ్డికి తెలియజేశారు.

బీజేపీలో చేరేది ఖాయమంటూ ఆరూరి తెలిపినట్లు కమలం నేతలు చెబుతున్నారు. అనంతరం ఆరూరిని కారులో ఎక్కించుకొని గులాబీ​ నేతలు హైదరాబాద్​కు తీసుకెళ్లారు. బీఆర్​ఎస్​ నేతలు గూండాల్లా వ్యవహరిస్తున్నారని కమలం నేతలు ఆరోపించారు. మోదీ విధానాలు నచ్చి ఆరూరి తమ పార్టీలో చేరితే బీఆర్​ఎస్​ నేతలు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.

నన్ను ఎవరూ కిడ్నాప్​ చేయలేదు - నేను బీఆర్​ఎస్​లోనే ఉన్నాను : ఆరూరి రమేశ్​

బీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవికి కోనేరు కోనప్ప రాజీనామా - రేపు కాంగ్రెస్​లో చేరిక

బీఆర్​ఎస్​కు మరో షాక్ - కాంగ్రెస్​లోకి గుత్తా అమిత్​ రెడ్డి !

Last Updated : Mar 13, 2024, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.