ETV Bharat / politics

రాష్ట్రంలో హీటెక్కుతోన్న పొలిటికల్​ వార్ - హరీశ్​రావు సహా బీఆర్​ఎస్ ముఖ్యనేతల గృహ నిర్బంధం - BRS Leaders Kept Under House Arrest

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2024, 11:11 AM IST

Kaushik Reddy vs Arikapudi Gandhi : రాష్ట్రవ్యాప్తంగా బీఆర్​ఎస్​ శ్రేణులను పోలీసులు గృహనిర్బందం చేశారు. ఎమ్మెల్యేలు కౌశిక్ ​రెడ్డి, అరికెపూడి గాంధీ సవాళ్లతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. బీఆర్​ఎస్​ నేతలు అరికెపూడి గాంధీ నివాసంలో సమావేశం అవుతున్నారన్న సమాచారం మేరకు అక్కడ భారీగా మోహరించారు.

BRS Leaders Kept Under House Arrest
BRS Leaders Kept Under House Arrest (ETV Bharat)

BRS Leaders Kept Under House Arrest : రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కౌశిక్​రెడ్డి, అరికెపూడి గాంధీ సవాళ్లు ప్రతిసవాళ్లతో రాజకీయం ఒక్కసారి వేడెక్కింది. ఇవాళ అరికెపూడి గాంధీ నివాసంలో బీఆర్​ఎస్​ శ్రేణులు భేటీ నిర్వహించాలనుకున్నారు. ఈ భేటీకి ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డి కూడా హాజరవుతారని బీఆర్​ఎస్​ నేతలు చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో కౌశిక్​రెడ్డి, అరికెపూడి గాంధీ, శంభీపూర్​ రాజులతో పాటు మాజీ మంత్రులు హరీశ్​రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్​,ఎమ్మెల్యేలు, బీఆర్​ఎస్​ నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు.

హరీశ్​రావు ఇంటి వద్ద ఉద్రిక్తత : కోకాపేటలోని మాజీమంత్రి హరీశ్​రావును పోలీసులు హౌస్​ అరెస్ట్​ చేశారు. హరీశ్​రావు ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. ఇంటి ముందు బారికేట్లు ఏర్పాటు చేసి హరీశ్​ను కలిసేందుకు వచ్చిన ప్రజలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో హరీశ్​రావు భుజానికి గాయమైందని పరామర్శించడానికి వచ్చిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాలోతు కవితలను పోలీసులు అడ్డుకున్నారు. వీరిని అరెస్ట్​ చేసి పోలీసు స్టేషన్​కు తరలించారు. గురువారం పోలీసుల తోపులాటలో తీవ్రంగా గాయపడిన మాజీ మంత్రి హరీశ్​రావు చేతి నొప్పితో ఆసుపత్రికి వెళ్తానంటే పోలీసులు అనుమతించలేదు.

బీఆర్​ఎస్​ శ్రేణులను తక్షణమే విడుదల చేయాలి : రాష్ట్రవ్యాప్తంగా బీఆర్​ఎస్​ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీమంత్రి హరీశ్​రావు తెలిపారు. అరెస్టు చేసిన బీఆర్​ఎస్​ శ్రేణులను తక్షణమే విడుదల చేయాలని బీఆర్​ఎస్​ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయకుండా బీఆర్​ఎస్​ శ్రేణులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేలపై దాడి చేసిన గాంధీ, వారి అనుచరులు అరెస్టు చేయాలని డిమాండ్​ చేశారు.

బీఆర్​ఎస్​ నేతలు నిర్బంధం : పేట్​ బషీరాబాద్​ ఏసీపీ కె.రాములు నేతృత్వంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద నివాసం, క్యాంపు కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసం వద్ద భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేను గృహనిర్బంధం చేశారు. ఎమ్మెల్సీ శంభీపూర్​ రాజు నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎమ్మెల్సీ ఇంటికి చేరుకున్న పలువురు బీఆర్​ఎస్​ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇంటి వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్​ఎస్​ కార్పొరేటర్లు ఇళ్ల వద్ద కూడా పోలీసులు బందోబస్తు నిర్వహించి బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు.

సబితా ఇంద్రారెడ్డి హౌస్​ అరెస్టు : ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముందు పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నిర్బంధాలు, ఆంక్షలు బీఆర్​ఎస్​కు కొత్త కాదని అన్నారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులు అర్థం అవుతున్నాయని తెలిపారు. ప్రజాపాలనకు నిదర్శనం నిర్బంధాలు అని సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. సూరారం కార్పొరేటర్​ మంత్రి నారాయణను 50 మంది కార్యకర్తలను అరెస్టు చేసి జీడిమెట్ల పీఎస్​కు పోలీసులు తరలించారు.

పాడి vs గాంధీ : 'నేడు అరికెపూడి నివాసంలో బీఆర్​ఎస్​ విస్తృతస్థాయి సమావేశం' - హాజరుకానున్న కౌశిక్​రెడ్డి - Padi Kaushik Reddy Vs Arekapudi

నా ఇంట్లో నేను ఉంటే దాడి చేశారు - రేపు బీఆర్‌ఎస్‌ సత్తా ఏంటో చూపుతాం : కౌశిక్​రెడ్డి - Kaushik Reddy on Gandhi

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.