ETV Bharat / politics

నేడు కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా! - ఆశావహుల్లో ఉత్కంఠ - Lok Sabha Elections 2024

Telangana Congress MP Candidates List 2024 : రాష్ట్రంలో కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై కేంద్ర ఎన్నికల కమిటీ ఇవాళ తుది నిర్ణయం తీసుకోనుంది. నిన్న సోనియా గాంధీతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర పరిపాలన, అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ముంబయిలో మొన్న రాత్రి సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించి పలు నియోజక వర్గాల్లో అభ్యర్ధుల ఎంపికపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 19, 2024, 7:59 AM IST

నేడు కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా - ఆశావహుల్లో ఉత్కంఠ

Telangana Congress MP Candidates List 2024 : రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరింది. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించింది. ఏఐసీసీ ప్రకటించిన మొదటి జాబితాలో రాష్ట్రానికి చెందిన జహీరాబాద్, మహబూబాబాద్, నల్గొండ, మహబూబునగర్ లోకసభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. మిగిలిన 13 లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. 13 నియోజక వర్గాల నుంచి టికెట్లు ఆశిస్తున్న నాయకులపై కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందం ఇప్పటికే ఫ్లాష్ సర్వేలు నిర్వహించింది. సర్వేల వివరాలు ముంబయిలో ఆదివారం రాత్రి జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చించింది.

Congress Lok Sabha Candidates Final List Today : గెలుపే ప్రధానమన్న లక్ష్యంతో 13 లోకసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. సామాజిక సమతుల్యత పాటిస్తూనే విజయం సాదించ గలిగే ప్రజాబలం కలిగిన వారికే టికెట్లు ఇచ్చే దిశలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ముందుకు వెళుతుంది. జనాదరణ కలిగిన నాయకులనే బరిలో దించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇవాళ సాయంత్రం దిల్లీలో జరగనున్న కేంద్ర ఎన్నికల కమిటీ రాష్ట్రానికి చెందిన లోకసభ అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటుంది. ఏఐసీసీ ప్రకటించనున్న నాలుగో జాబితాలో తెలంగాణ లోక్‌సభ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తుందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రాత్రికి కానీ రేపు కానీ అభ్యర్థుల వివరాలను అధిష్టానం వెల్లడించే అవకాశముందని సమాచారం.

లోక్‌సభ ఎన్నికలు 2024 - నాలుగు ఎంపీ స్థానాలు ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ

Telangana Lok Sabha Election 2024 : అప్పట్లో చేవెళ్ల నుంచి సునీతా మహేందర్‌ రెడ్డి, సికింద్రాబాద్‌ నుంచి బొంతు రామ్మోహన్‌లను రంగంలోకి దించాలని పార్టీ నాయకత్వం భావించింది. కాని మారిన, మారుతున్న రాజకీయ సమీకరణాలతో అభ్యర్ధుల విషయంలో పార్టీ నిర్ణయాలు మారుతున్నాయి. తాజాగా బీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌లు కాంగ్రెస్‌లో చేరడంతో, పార్టీ సమీకరణాలు మారినట్లయింది.

చేవెళ్ల నుంచి రంజిత్‌ రెడ్డిని పోటీలో నిలపడం, అక్కడ నుంచి పోటీ చేయించాలని యోచించిన సునీతా మహేందర్‌ రెడ్డిని మల్కాజిగిరి నుంచి బరిలో దించాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తున్నట్ల తెలుస్తోంది. మరొకవైపు సికింద్రాబాద్‌ లోకసభ స్థానం నుంచి మాజీ మేయర్‌ బొంతు రామ్మోన్‌ బదులు దానం నాగేందర్‌ను బరిలో దించాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒక సిట్టింగ్‌ ఎంపీ, ఒక సిట్టింగ్‌ ఎమ్మెల్యేని పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా రెండు లోకసభ స్థానాలకు అభ్యర్ధుల సర్దుబాటు జరిగిందని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

లోక్​సభ పోరుకు కాంగ్రెస్ రెడీ - రేపు ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్న ఏఐసీసీ

లోక్​సభ అభ్యర్థుల ఎంపికపై నేతల అభిప్రాయ సేకరణ చేస్తున్న కాంగ్రెస్​ అధిష్ఠానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.