CM Revanth Reddy Election Campaign in Kerala : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేరళలోని వయనాడ్‌లో నిర్వహించిన రైతుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేరళ ప్రజలు కష్టపడే మనస్తత్వం కలిగిన వారని, తెలివైన వారని రేవంత్ కితాబిచ్చారు. కేరళ ప్రజల శ్రమ వల్ల దుబాయ్ లాంటి దేశాలు అభివృద్ధి చెందాయని, కానీ కేరళ మాత్రం అభివృద్ధి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Revanth Reddy Parliament Election Campaign : ఈ క్రమంలోనే కేరళ సీఎం పినరయి విజయన్, ఆయన కుటుంబసభ్యులు అవినీతిలో మునిగిపోయారని రేవంత్ ఆరోపించారు. బంగారం స్మగ్లింగ్‌లో సీఎం విజయన్ కుటుంబ సభ్యుల పాత్ర ఉండటం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్న రేవంత్, విజయన్ పై ఈడీ, ఆదాయ పన్ను కేసులున్నా మోదీ చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ప్రధానితో విజయన్ రహస్య ఒప్పందం చేసుకున్నారన్నారు. రాష్ట్రాల ప్రయోజనాలు, నిధుల కోసం కేంద్రంతో పోరాటం చేయాలని, తెలంగాణ, కర్ణాటక, ఝార్ఖండ్, దిల్లీ లాంటి రాష్ట్రాలు కేంద్రంతో నిధుల కోసం పోరాడుతున్నాయని గుర్తు చేశారు.
ఎన్నికల ప్రచారంపై కాంగ్రెస్ ఫోకస్- స్టార్ క్యాంపెయినర్‌గా రంగంలోకి సీఎం రేవంత్‌రెడ్డి
విజయన్ కమ్యూనలిస్ట్ : కేరళ సీఎం విజయన్ మాత్రం కేంద్రంతో ఎలాంటి పోరాటం చేయడం లేదని రేవంత్ విమర్శించారు. పైకి సీపీఎం ముఖ్యమంత్రిగా, కమ్యూనిస్టు నాయకుడిగా కనిపిస్తున్న విజయన్, కమ్యూనిస్టు కాదని, కమ్యూనలిస్టు అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మతతత్వ బీజేపీతో కలిసి విజయన్ పని చేస్తున్నాడని, వయనాడ్‌లో బీజేపీ అభ్యర్థి సురేంద్రన్‌కు కేరళ ముఖ్యమంత్రి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే సొంత పార్టీ సీపీఎంతో పాటు కేరళ ప్రజలను సీఎం మోసం చేస్తున్నారని ఆక్షేపించారు.
రెండు పరివార్‌ల మధ్య పోరాటం : మరోవైపు ప్రధాని మోదీ, అమిత్ షా మణిపూర్‌లో పర్యటించలేదని, రాహుల్ గాంధీ అక్కడి బాధితులను పరామర్శించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. జూన్ 9న రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో రెండు పరివార్‌ల మధ్య పోరాటం జరుగుతోందన్న ఆయన, మోదీ పరివార్‌లో ఈడీ, ఈవీఎంలు, సీబీఐ, ఇన్‌కమ్‌ట్యాక్స్, అదానీ, అంబానీ ఉన్నారని, ఇండియా పరివార్‌లో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వయనాడ్ కుటుంబ సభ్యులున్నారని వివరించారు.
ఆగస్టు 15 లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా : రేవంత్‌రెడ్డి - CM Revanth in Jana Jathara Sabha
'వయనాడ్ ప్రజలు రాహుల్ గాంధీ వైపు ఉన్నారు. నేను ప్రత్యేకంగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ నుంచి పోటీ చేయాలని మేం రాహుల్ గాంధీని కోరాం. కానీ వయనాడ్ వైపే ఆయన మొగ్గు చూపారు. మోదీకి వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తున్నాం. వారణాసి వర్సెస్ వయనాడ్ మధ్య ఇప్పుడు పోరాటం జరుగుతోంది. వయనాడ్ ప్రజలు ఓటు వేయబోయేది కేవలం ఎంపీ అభ్యర్థికి మాత్రమే కాదు, దేశానికి కాబోయే ప్రధానికి' అని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.
కేరళలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన - రెండ్రోజుల పాటు లోక్‌సభ ఎన్నికల ప్రచారం - lok sabha election 2024