TDP MLA Candidates Second List in AP : తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తొలి జాబితాలో 94 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక రెండో జాబితాలో 34 మందికి అవకాశం ఇచ్చారు. పొత్తుల లెక్కప్రకారం మరో 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. తాజా జాబితాలో నరసన్నపేట - బగ్గు రమణమూర్తి, గాజువాక - పల్లా శ్రీనివాసరావు, చోడవరం-కె.ఎస్.ఎన్.ఎస్. రాజు, మాడుగుల - పైలా ప్రసాద్, ప్రత్తిపాడు - వరుపుల సత్యప్రభ తదితరులు ఉన్నారు.
టీడీపీలో చేరికలు : కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. సంజీవ్ కుమార్‌కు పార్టీ కండువా కప్పి చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. పొయ్యిమీద కాలుతున్న కుండను ముట్టుకునే ప్రయత్నం చేస్తే చెయ్యి కాలుతుందని, తనతో సహా రాష్ట్ర ప్రజలు వైఎస్సార్సీపీని ఓసారి ముట్టుకుని ఆ తప్పు చేశారని కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ అన్నారు. రెండో చెయ్యి కూడా కాల్చుకోవద్దని ఆయన ప్రజల్ని కోరారు.
పనితీరు బాలేకపోతే మార్చడం పక్కా - అభ్యర్థులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
కర్నూల్ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తాను తెలుగుదేశంలో చేరానని తెలిపారు. ఎలాంటి సీటు ఆశించకుండా భేషరతుగానే తెలుగుదేశంలో చేరా, తగు ప్రత్యామ్నాయం చూస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని సంజీవ్‌కుమార్ వెల్లడించారు. వైఎస్సార్సీపీ పాలనలో కంఠ శోష తప్ప ఏమీ లేదన్న ఆయన, ఆ పార్టీలో కల్పించేది ఉత్తుత్తి సామాజిక న్యాయమని విమర్శించారు. బీసీలకు వైఎస్సార్సీపీలో ఉత్సవ విగ్రహాల తరహా పదవులే తప్ప ప్రాధాన్యం లేదని ఆరోపించారు.
కర్నూలు ప్రాంతం నుంచి వలసలు, దారిద్య్రం నివారించలేకపోయాననే బాధ ఉందని అన్నారు. రెండు నదుల మధ్యలో ఉన్న కర్నూలు కు తాగు నీరుకూడా ఇవ్వలేనప్పుడు ఇక ఎంపీగా ఎందుకు అని అనిపించిందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి అపాయిట్మెంట్ కూడా వైసీపీలో దొరకటం గగనమేనని సంజీవ్‌కుమార్ విమర్శించారు. సంజీవ్ కుమార్ తోపాటు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ ప్యాలకుర్తి రమేశ్, వెంకాయపల్లె ఆలయ చైర్మన్ బేతం కృష్ణుడు, వాల్మీకీ సంఘం నాయకులు ముండ్ల శేఖర్, తలారి కృష్ణ, ఎన్జీవో మాజీ నాయకులు కుబేర స్వామి, నరసింహులు, శాంతకుమారి తదితరులు తెలుగుదేశంలో చేరారు.
అమరావతి విఛ్చిన్నమే అజెండాగా జగన్ సర్కార్ కుట్రలు - భూసేకరణ ప్రకటన ఉపసంహరణ
కొలిక్కివచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల సర్దుబాటు - సుదీర్ఘ చర్చల అనంతరం ప్రకటన