TDP Leaders Fire on Jagan for Calling Protests: ప్రజా సమస్యలపై ఆందోళనలకు జగన్ పిలుపునివ్వటం హాస్యాస్పదమని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. తన తప్పిదాలను ప్రస్తుత ప్రభుత్వానికి జగన్ బదిలీ చేయాలనుకుంటున్నాడని ఆరోపించారు. ఖజానాను ఖాళీ చేసిన జగన్ అధికారం లేకుండా ఉండలేకపోతున్నట్లు ఉందని మండిపడ్డారు. ఆయన అరాచక పాలనను ప్రజలు తిరస్కరించారని జగన్ గుర్తించాలని యనమల హితవు పలికారు. ఆందోళనలకు పిలుపునివ్వడం ద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యను సృష్టించడానికి జగన్ కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. గతంలో చెన్నారెడ్డి పాలనలో ఇలా శాంతిభద్రతల సమస్య సృష్టించిన అనుభవం వైఎస్ఆర్ కుటుంబానికి ఉందని యనమల గుర్తుచేశారు.
తన హయాంలో ప్రజలు పడిన కష్టాలను పక్కదారి పట్టించడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడని దుయ్యబట్టారు. జగన్ కేసుల్లో వేగం పెరిగితే ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుందని అన్నారు. వైఎస్ హయాంలో సెజ్ పేరుతో చిన్న, మధ్య తరహా రైతుల భూములను తీసుకున్న కేవీరావుపైనా కేసు పెట్టాలని అన్నారు. కేవీరావు వైఎస్ హయాంలో కేవలం తక్కువ పరిహారం మాత్రమే చెల్లించి భూములు తీసుకుని వాటిని అరబిందోకు బదలాయించారని ఆరోపించారు. కేవీరావు చర్యలు కారణంగా రైతులు నష్టపోయి, అరబిందో లాభపడిన కోణంలోనూ కేసు విచారణ జరగాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.
కాకినాడ సెజ్‌లో ఎకరం 29 వేలేనా? - జగన్‌ని A1గా చేర్చాలి: ఆనం
జగన్ ఇంటి ముందు ధర్నా చేస్తాము: తన బాధ ప్రపంచ బాధగా జగన్ భావిస్తున్నారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మండిపడ్డారు. విద్యార్థులకు 3,500 కోట్ల రూపాయల బకాయిలు ఎగ్గొట్టారని ఆరోపించారు. 11,600 కోట్ల రూపాయల విద్యుత్ సర్ ఛార్జీలను ఎన్నికల ముందు ఆమోదించారని అన్నారు. రబీ పంటలకు బీమా ఎగ్గొట్టినందుకు ధర్నాలు చేపడుతున్నారా అని ప్రశ్నించారు. అసెంబ్లీకి వెళ్లనందుకు, గెలిపించిన పులివెందుల ప్రజలను అన్యాయం చేసినందుకు జగన్ ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. బాధ్యత లేని ప్రజాప్రతినిధి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
గత ఐదు సంవత్సరాల్లో జగన్ సీఎంగా ఉన్న కాలంలో ఎప్పుడూ ప్రజలను కానీ కార్యకర్తలను కలిసిన పాపాన పోలేదని అన్నారు. ఇవాళ కార్యకర్తలతో కలిసి పోరాటం చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. గత ఐదేళ్ల కాలంలో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదని అన్నారు.
బియ్యం మాఫియాలో సీనియర్ల హస్తం - అదే బాధ కలిగించింది: నాదెండ్ల