ETV Bharat / politics

'వైఎస్సార్సీపీ ప్రభుత్వ ప్రకటనల కుంభకోణం'- కమిటీ వేయాలని టీడీపీ సభ్యుల డిమాండ్‌ - YSRCP Govt Advertising Scam - YSRCP GOVT ADVERTISING SCAM

TDP Leaders on YSRCP Govt Advertising Scam: వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమాచార పౌరసంబంధాల శాఖ ద్వారా ఇచ్చిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని శాసనసభలో టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. 2019-24 మధ్య 850 కోట్ల రూపాయల మేర ప్రకటనల్ని జారీ చేశారని వెల్లడించారు.

TDP_Leaders_on_YSRCP_Govt_Advertising_Scam
TDP_Leaders_on_YSRCP_Govt_Advertising_Scam (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 26, 2024, 12:36 PM IST

Updated : Jul 26, 2024, 2:15 PM IST

TDP Leaders on YSRCP Govt Advertising Scam: సమాచార పౌరసంబంధాల శాఖ ద్వారా ఇచ్చిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని శాసనసభలో టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. 850 కోట్ల రూపాయల మేర ప్రకటనల్ని 2019–24 మధ్య జారీ చేశారని, ఇందులో పక్షపాత ధోరణి ఉందని టీడీపీ సభ్యులు నక్కా ఆనంద్ బాబు, ధూళిపాళ నరేంద్ర, తెనాలి శ్రవణ్​కుమార్ డిమాండ్ చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని సభ్యులు లేవనెత్తారు.

ఏబీసీ సర్క్యులేషన్ రిపోర్టుకు విరుద్ధంగా గత ప్రభుత్వ హయాంలో సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు వ్యవహరించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి 15 రోజులకూ తమకు కావాల్సిన పత్రికలు, మీడియాలో నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు ఇచ్చి అనుచిత లబ్ధి కలిగించారని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ప్రభుత్వం, పాలకులు మారినా అధికారులు మాత్రం మారలేదని ఆక్షేపించారు. ప్రకటనలకు సంబంధించిన చెల్లింపుల్లో పక్షపాత ధోరణి ఉందని వ్యాఖ్యానించారు. గత ముఖ్యమంత్రి జగన్, ఆయన సతీమణి ఆధ్వర్యంలో నడిచిన సాక్షికి పెద్ద ఎత్తున ప్రకటనల డబ్బులు చెల్లించారని సభ్యులు ఆరోపించారు. సాక్షి పత్రికకు అనుచిత లబ్ధిచేకూరేలా చేయటంపై విచారణ కమిటీ వేస్తామని సభ్యుల ప్రశ్నలకు మంత్రి కొలుసు పార్థసారథి సమాధానమిచ్చారు.

లిక్కర్ స్కాంపై సీబీసీఐడీతో విచారణ చేయించి దోషులను కఠినంగా‌ శిక్షించాలి: బీజేపీ ఎమ్మెల్యేలు - BJP MLAs on Liquor Scam

గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో అక్రమాలు నిజమే - విచారణ జరిపిస్తాం: పయ్యావుల కేశవ్‌ - CBI Investigation on Group 1 Posts

Last Updated : Jul 26, 2024, 2:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.