TDP Leader Surya Prakash Reddy Comments on Balineni Srinivasa Reddy: ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డిపై టీడీపీ నాయకుడు పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒంగోలు మున్సిపాలిటీలో బాలినేని శ్రీనివాసరెడ్డి అవుట్ సోర్స్ తరపున 57 మందికి ఉద్యోగాలు ఇప్పించారు. అయితే వారికి జీతాలు మాత్రం మున్సిపాలిటీ నుంచే వస్తున్నాయని ఆరోపించారు. కానీ ఆ 57 మంది పనిచేసేది మాత్రం బాలినేని శ్రీనివాస రెడ్డి, తనయుడు ప్రణీత్ రెడ్డికి, వారి వియ్యంకుడు భాస్కర్ రెడ్డికి అని పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
బాలినేనికి ఔట్సోర్సింగ్ కింద 57 మంది సొంత పని చేస్తుంటే ఒంగోలు మేయర్ ఏం చేస్తున్నరని ఆయన మండిపడ్డారు. మున్సిపాలిటీలో ఇంత మందికి జీతాలు ఇస్తుంటే ప్రజాదానాన్ని దుర్వియోగం చేస్తున్నట్లు కాదా అని ఆయన విమర్శించారు. ఒంగోలు మున్సిపాలిటీ పరిథిలోని చెరుకుంపాలెంలో 600 వందల దొంగ ట్యాప్ కలెక్షన్లు వేస్తుంటే నగర మేయర్, మున్సిపల్ కమిషనర్ పట్టించుకోకుండా వదిలేశారని ఆయన ఆరోపించారు. మున్సిపాలిటీ టాక్స్ కింద ప్రజాదానానికి గండి కొడుతున్నారని ఆయన అన్నారు. నగరంలో ఇంత జరుగుతుంటే అధికారులు నిద్రపోతున్నారా అని సూర్య ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు.
"ఒంగోలు మున్సిపాలిటీ లో బాలినేని శ్రీనివాసరెడ్డి అవుట్ సోర్స్ తరఫున 57 మందికి ఉద్యోగాలు ఇప్పించారు. కాని వాళ్లకు జీతాలు మాత్రం మున్సిపాలిటీ నుంచే వస్తున్నాయి. ఆ ఉద్యోగులు మాత్రం బాలినేని శ్రీనివాస రెడ్డి, తనయుడు ప్రణీత్ రెడ్డికి, వారి వియ్యంకుడు భాస్కర్ రెడ్డికి పనిచేస్తున్నారు. మున్సిపాలిటీలో ఇంత మందికి జీతాలు ఇస్తూ ప్రజాదానాన్ని దుర్వియోగం చేస్తుంటే అధికారులు పట్టించుకోవట్లేదు. చెరుకుంపాలెంలో 600 వందల దొంగ ట్యాప్ కలెక్షన్లు వేస్తుంటే నగర మేయర్, మున్సిపల్ కమిషనర్ పట్టించుకోకుండా వదిలేశారు."- పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి, టీడీపీ నేత