TDP Candidates Third List Release 2024 : ఏపీలో తెలుగుదేశం పార్టీ మూడో జాబితా విడుదలైంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 24 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించారు. ఇందులో 11 ఎమ్మెల్యే స్థానాలు, 13 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటివరకూ విడుదల చేసిన రెండు జాబితాల్లో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులనే ప్రకటించింది.
AndhraPradesh Elections 2024 : పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. ఈ నేపథ్యంలో తొలి జాబితాలో 94, రెండో జాబితాలో 34 అసెంబ్లీ అభ్యర్థులను (AP TDP Candidates 2024) ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కంటే ముందే యమ జోరుగా 128 మంది శాసనసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అన్నీ అనుకున్నట్లుగానే జరిగితే ఇదే స్పీడులో ఇప్పటికే లోక్‌సభ అభ్యర్థుల జాబితానూ తెలుగుదేశం పార్టీ ప్రకటించి ఉండేది.
అయితే జీజేపీ, జనసేన సీట్ల సర్దుబాటు చర్చల కారణంగా వాయిదా పడగా, సీట్ల ఖరారుపై ప్రస్తుతం చంద్రబాబు స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తాజాగా జాబితాలో పెండింగ్లో ఉన్న 17 ఎంపీ స్థానాలకు గానూ 13, 16 ఎమ్మెల్యే స్థానాలకు గానూ 11 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేశారు. ఇంకా 5 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలను పెండింగ్లో ఉంచారు.
Chandrababu on TDP Candidates : ఏపీ ప్రయోజనాలే ఏకైక ఎజెండాగా ఎన్డీయేలో చేరినట్లు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో బలమైన గళం వినిపిస్తూ, రాష్ట్రం కోసం పోరాడగల నాయకులనే తెలుగుదేశం అభ్యర్థులుగా నిలబెడుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే తాజాగా లోక్‌సభకు పోటీ చేసే 13 మందిని, అసెంబ్లీకి పోటీచేసే 11 మందిని కూడా ప్రజాభిప్రాయం మేరకు ఎంపిక చేసినట్లు తెలిపారు. వారిని ప్రజలు ఆశీర్వదించాలని చంద్రబాబు నాయుడు కోరారు.
11 మందితో అసెంబ్లీ అభ్యర్థుల మూడో జాబితా :
13 మందితో లోక్‌సభ అభ్యర్థుల జాబితా :
ఏపీలో టీడీపీ కూటమిదే విజయం - తెలంగాణలో కాంగ్రెస్ హవా!
ఏపీలో ఎన్నికలు ఏకపక్షమే - టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభంజనం సృష్టిస్తుంది- చంద్రబాబు