TDP Aanam Ramakrishna Reddy on Sakshi: జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 'సాక్షి' పత్రిక లాభాలు అమాంతం పెరిగాయని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ ప్రకటనలు ద్వారా సాక్షి పత్రికకు దోచిపెట్టారన్నారు. లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే 4వేల 475కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని నిలదీశారు.
ఉద్యోగాల భర్తీపై జగన్ ఏనాడూ శ్రద్ధ పెట్టలేదు - నాది విజన్, జగన్‌ది పాయిజన్: చంద్రబాబు
అవినీతి సొమ్ము కోసం కుటుంబ మొత్తం కొట్లాడుతోందన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ప్రజలు కచ్చితంగా ఇంటికి పంపిస్తారన్న ఆయన టీడీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్సార్సీపీ అక్రమాలు వెలికితీస్తామని పేర్కొన్నారు. సీఐడీ విచారణ వేసి దోపిడీ సొమ్మును కక్కిస్తామని పేర్కొన్నారు.
"జగన్ సీఎం అయ్యాక 'సాక్షి' పత్రిక లాభాలు అమాంతం పెరిగాయి. ప్రభుత్వ ప్రకటనలు ద్వారా సాక్షి పత్రికకు దోచిపెట్టారు. రూ.లక్ష పెట్టుబడి పెడితే.. రూ.4,475కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు? అవినీతి సొమ్ము కోసం కుటుంబమొత్తం కొట్లాడుతోంది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక అక్రమాలు వెలికితీస్తాం. సీఐడీ విచారణ వేసి దోపిడీ సొమ్మును కక్కిస్తాం" - ఆనం వెంకటరమణారెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి
అన్నపై పోటీకి సిద్ధం! - సునీత కాంగ్రెస్‌లో చేరేందుకు డేట్ ఫిక్స్!
సాక్షి సంస్థపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు: కాగా సాక్షి సంస్థలో తనకు సగభాగం వాటా ఉందని, ఇప్పుడు సంస్థ తనపైనే బురద చల్లుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఆస్తిలో తనకు, జగన్‌కు సమాన భాగం ఉండాలని తమ తండ్రి వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి నిర్ణయించారని పేర్కొన్నారు. వైఎస్సార్ జిల్లాలోని కడపలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన ఆమె ఈ మేరకు వ్యాఖ్యానించారు.
దీంతోపాటు తెలంగాణలో తనతో కలిసి పనిచేసిన వాళ్లకు సాక్షి సంస్థ నుంచి ఫోన్లు చేస్తూ తన గురించి వ్యతిరేకంగా మాట్లాడాలని అడుగుతున్నారన్నారని తెలిపారు. వాస్తవాలను మరిచి సాక్షి పత్రిక ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తోందన్న ఆమె వీటిన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందన్నారు.
వైఎస్సార్సీపీ నేతలు ఏం చేసినా, సాక్షి పత్రిక ఏం రాసినా భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీను అధికారంలోకి తీసుకునిరావటానికి 3,200 కి.మీ పాదయాత్ర చేసి జగన్ కోసం అంత త్యాగం చేస్తే తనపై మూకుమ్మడిగా దాడి చేస్తున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు.
ప్రకాశం జిల్లా వైసీపీ శ్రేణుల్లో అయోమయం - ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలో అర్థంకాని పరిస్థితి