Suspense Continues Over TDP Contest in Anaparthi : బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు నేపథ్యంలో సీట్ల కేటాయింపు అంశం చాలా సున్నితంగా మారింది. బీజేపీతో పొత్తులకు ముందే అనపర్తి స్థానంలో టీడీపీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరు ప్రకటించింది. అనంతర పరిణామాల నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం అనపర్తి సీటుకు అభ్యర్థిని ఖాయం చేసింది. ఈ నేపథ్యంలో నల్లమిల్లి అనుచరులు, టీడీపీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనపర్తిలో టీడీపీ పోటీ చేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే నల్లమిల్లికి మద్దతుగా పార్టీ నాయకులంతా తమ పదవులను త్యాగం చేస్తున్నట్లు ప్రకటిస్తూ రాజీనామా (resignation) లకు సిద్ధపడ్డారు. ఓ కార్యకర్త ఆత్మహత్యకు యత్నించడం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ట్విటర్ వేదికగా నల్లమిల్లి చేసిన కామెంట్స్ పోటీ ఖాయమనే విధంగా ఉన్నాయి.
'ఎందుకు? ఏమిటి? ఎలా?' టీడీపీ సీనియర్లలో టెన్షన్ - బాబు నివాసం వద్ద హైడ్రామా
నల్లమిల్లి ఏమంటున్నారంటే! ఐదేళ్ల పాటు నా ఆరోగ్యాన్ని, నా కుటుంబాన్ని ఫణంగా పెట్టాను. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని పోరాడాను. కానీ, ఎన్నికల్లో నాకు జరిగిన అన్యాయంపై కుటుంబ సమేతంగా ప్రజల దగ్గరకే వెళ్లి తేల్చుకుంటా. ఆ తర్వాతే భవిష్యత్ కార్యాచరణ (Future activity) ప్రకటిస్తా అని నల్లమిల్లి ట్వీట్ (Nallamilli tweet) చేశారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు కార్యకర్తల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నామని, తమ కుటుంబాన్ని నమ్ముకుని 40 ఏళ్లుగా పోరాడుతున్న కార్యకర్తలను కాపాడుకోవడం కోసమే కఠిన నిర్ణయం తప్పదని నల్లమిల్లి స్పష్టం చేశారు.
చంద్రబాబు నివాసానికి టీడీపీ నేతలు క్యూ - రాజకీయ భవిష్యత్తుకు హామీ
ఐదేళ్లపాటు రాక్షసులతో ప్రత్యక్ష యుద్ధం చేశామని వైసీపీ పాలకులను ఉద్దేశించి నల్లమిల్లి ట్వీట్ చేశారు. ప్రభుత్వంపై పోరాటంలో 39 అక్రమ కేసులు, భౌతిక దాడులు, జైలు జీవితం గడిపానని తెలిపారు. ప్రత్యర్థులు తన హత్యకు సుఫారీ కూడా ఇచ్చారని, 400 మంది కార్యకర్తలపై 180కి పైగా కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. లాఠీ దెబ్బలు తిన్నా సరే 24X7 ప్రజల కోసమే పోరాటం చేశానని స్పష్టం చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసినా అవేమీ తనను కాపాడలేకపోయాయని గుర్తు చేసుకున్నారు. మాట మాత్రం కూడా చెప్పకుండా ఇచ్చిన టికెట్‌ను లాగేసుకున్నారంటూ భావోద్వేగానికి గురయ్యారు.
కడప ఎంపీ స్థానం మనదే- 160 స్థానాల్లో కూటమి విజయం ఖాయం : చంద్రబాబు
ఇదిలా ఉండగా నల్లమిల్లికి అన్యాయం జరిగిందంటూ నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళనకు పూనుకున్నారు. నిజం గెలవాలి - అనపర్తిలో టీడీపీ నిలవాలి అని నినాదాలు చేశారు. ఈ క్రమంలో నిజం గెలవాలి యాత్ర చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో కలిసిన అనపర్తి టీడీపీ (TDP) శ్రేణులు నల్లమిల్లిని కొనసాగించాలని కోరారు. టీడీపీ తొలి జాబితాలోనే రామకృష్ణారెడ్డి పేరు ప్రకటించారని గుర్తు చేస్తూ బీజేపీ కూటమిలో కలిశాక మార్పు చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తల విజ్ఞప్తి మేరకు భువనేశ్వరి సానుకూలంగా స్పందించారు. రాజకీయంగా తాను ఎప్పడూ జోక్యం చేసుకోలేదని చెప్తూనే అనపర్తి సీటు విషయమై అధిష్ఠానంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.
టికెట్ ఇవ్వలేదని మనస్తాపం!- పురుగుల మందు మింగి ఎంపీ ఆత్మహత్య