ETV Bharat / politics

లక్షల్లో డబ్బులు తీసుకోని సుబ్బారావుకు అన్యాయం చేశారు - Subbarao family suicide Case - SUBBARAO FAMILY SUICIDE CASE

Subbarao mother blamed the revenue officials: సుబ్బారావు కుటుంబం ఆత్మహత్య ఘటనపై అతని తల్లి స్పందించారు. అధికారుల ధనదాహానికి తన కుటుంబం బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 3 ఎకరాల పోలం కోసం, సుబ్బారావు అధికారులకు లక్షలు ముట్టజెప్పారని ఆరోపించారు. తన కుమారుడి దగ్గర లక్షల్లో డబ్బులు తీసుకోని అతనికి అన్యాయం చేశారని ఆరోపించారు.

Subbarao mother blamed the revenue officials

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 26, 2024, 7:37 PM IST

లక్షల్లో డబ్బులు తీసుకోని సుబ్బారావుకు అన్యాయం చేశారు

Subbarao mother blamed the revenue officials: సుబ్బారావు కుటుంబం బలవన్మరణం చేసుకోవడానికి ప్రధాన కారణం తనకున్న 3 ఎకరాల పొలాన్ని వేరొకరి పేరుతో ఆన్ లైన్​లో మార్చేయడమేని, ఈ విషయంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వాటి నుంచి తప్పించుకోవడానికే పోలీసులు, రెవిన్యూ అధికారులు కేసు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుబ్బారావు తల్లితో ఈటీవీ భారత్ మాట్లాడగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇద్దరు ఎమ్మార్వోలకు లక్షల్లో: సుబ్బారావు కుటుంబం ఆత్మహత్యపై అతని తల్లి రామలక్ష్మమ్మ స్పందించారు. ఆ 3 ఎకరాల భూమిని గతంలో నా భర్త సాగు చేసేవాడు. నా భర్త మరణించిన తరువాత నా కుమారుడు సుబ్బారావు ఆ భూమిని సాగుచేస్తున్నాడు. ఆ భూమికి సంబంధించి మూడు సార్లు పీఎం కిసాన్ యోజన డబ్బులుపడ్డాయి. అయితే, భూమి మా పేరు నుంచి శ్రావణి పేరు మీద మార్చారు. భూమి వేరే వ్యక్తి పేరుపై మారడంతో, సుబ్బారావు గత కొంత కాలంగా ఆందోళన చెందారు.

ఇదే విషయమై రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగాడు. ఇద్దరు ఎమ్మార్వోలకు లక్షల్లో డబ్బులు ముట్టజెప్పాడు. నా కుమారుడి దగ్గర లక్షల్లో డబ్బులు తీసుకోని అతనికి అధికారులు అన్యాయం చేశారు. భూమి చేతికి రాకపోవడంతో అప్పులు చేశాడు. ఇక భూమి దక్కదని ఆందోళన చెంది కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. రికార్డుల్లో మారిన తమ 3 ఎకరాల భూమిని తిరిగి సుబ్బారావు కుతురి పేరుపై ఎక్కించాలి. ప్రభుత్వం తరఫున సహాయం చేయడంతో పాటుగా, సుబ్బారావు కుతురిగి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సుబ్బారావు తల్లి రామలక్ష్మమ్మ డిమాండ్ చేశారు.

సుబ్బారావు కుటుంబానిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: టీడీపీ - Subbarao Family Suicide Case

స్పందించిన వైఎస్ఆర్ కడప బీసీ సంఘం నేతలు: సుబ్బారావు కుటుంబం ఆత్మహత్యకు, ప్రత్యక్షంగా రెవిన్యూ అధికారులు, పరోక్షంగా స్థానికంగా ఉన్న వైసీపీ నేతలే కారణమని కడప బీసీ సంఘం అధ్యక్షులు రామాంజనేయులు ఆరోపించారు. సీఎం జగన్‌ సక్రమంగా లేకపోవడంతోనే రాష్ట్రంలో బీసీలపై అరాచకాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కడప డీఎస్పీ షరీఫ్‌, స్థానికంగా ఉన్న ఓ వైసీపీ నేత అధికారులతో కలిసి కేసును పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మృతుడు సుబ్బారావు కుటుంబానికి 30 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఆ కుటుంబానికి న్యాయం చేయకపోతే జిల్లావ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలను కలుపుకుని పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

సుబ్బారావు కుటుంబం బలవన్మరణం చేసుకోవడానికి అధికారుల దనదాహమే ప్రధాన కారణం. తనకున్న 3 ఎకరాల పొలాన్ని, అధికారులు వేరొకరి పేరుతో ఆన్​లైన్ లో మార్చారు. అందుకు సంబంధించి ఆరోపణల నుంచి తప్పించుకోవడానికే పోలీసులు, రెవిన్యూ అధికారులు కేసు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సుబ్బారావు కుటుంబానికి అన్యాయం జరిగే వరకూ బీసీ సంఘాలు పోరాటం కొనసాగిస్తాయి. రామాంజనేయులు, బీసీ సంఘం నేత

Muppalla Subbarao Interview about Chandrababu Arrest: రాజకీయ దురుద్దేశంతో సీఐడీ స్వామి భక్తి: ముప్పాళ్ల సుబ్బారావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.