ETV Bharat / politics

ఏపీలో రహదారులకు త్వరలో మోక్షం- గోతులు పూడ్చటానికి టెండర్లు - National highway widening works

National highway widening works : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ కారణాలతో నిర్మాణం నిలిచిన జాతీయ రహదారుల పనులను వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్​ రెడ్డి కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్​ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అత్యధిక ట్రాఫిక్ కలిగిన 3,059 కిలోమీటర్ల పొడవైన 31 రాష్ట్ర మార్గాలను జాతీయ రహదారులుగా మార్చాలని మంత్రి కోరారు.

national_highway_widening_works
national_highway_widening_works (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 19, 2024, 12:51 PM IST

National highway widening works : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరై వివిధ కారణాలతో నిర్మాణం నిలిచిన జాతీయ రహదారుల పనులను వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్​ రెడ్డి కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్​ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం దిల్లీలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్నాయుడితో కలిసి గడ్కరీని కలిసి వినతి పత్రం సమర్పించారు. కేంద్ర రహదారి, మౌలిక వసతుల నిధి కింద పంపిన రూ.350 కోట్ల ప్రతిపాదనలను ఆమోదించాలని కోరినట్లు వెల్లడించారు. అందుకు గడ్కరీ సమ్మతించడంతోపాటు మరో రూ.150 కోట్ల విలువైన పనులకు అనుమతిస్తామని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. వరదల వల్ల దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు రూ.186 కోట్లతో అంచనాలు రూపొందించామన్నారు. రోడ్లపై గోతులు పూడ్చటానికి రూ.296 కోట్లతో టెండర్లు పిలుస్తున్నామని జనార్దన్​రెడ్డి వివరించారు.

YSRCP Government Neglects National Highway Works: జాతీయ రహదారి పనుల్లో జగన్​ సర్కార్​ వెనుకబాటు.. నాలుగేళ్లుగా పూర్తికాని భూసేకరణ

రాష్ట్రంలో అత్యధిక ట్రాఫిక్ ఉన్న 3,059 కిలోమీటర్ల పొడవైన 31 రాష్ట్ర మార్గాలను జాతీయ రహదారులుగా మార్చాలని మంత్రి కోరారు. వాటి వివరాలివి.

1. కళింగపట్నం-శ్రీకాకుళం- ఆమదాలవలస-పాలకొండ-పార్వతీపురం-రాయగడ

2. బేతంచర్ల- బనగానపల్లి-కోవెలకుంట్ల-ఆళ్లగడ్డ

3. గార-ఆలికం-బాతిలి రోడ్డు (వయా ఆమదాలవలస, హిరమండలం, కొత్తూరు, భామిని)-గుణుపూరు (ఒడిశా రాష్ట్రం మీదుగా)

4. ఆదోని-పత్తికొండ-ప్యాపిలి బనగానపల్లి-పాణ్యం

5. పాత ఎన్బీబీ రోడ్డు (జమ్మలమడుగు నుంచి కొలిమిగుండ్ల)

6. చిలకపాలెం-రామభద్రపురం- పార్వతీపురం- రాయగడ

7. కర్నూలు-కోడుమూరు--అస్పది-ఆలూరు-గుంతకల్లు

8. నరసరావుపేట-సత్తెనపల్లి-అమరావతి-తాడికొండ-కాజ

9. రాజమండ్రి-ద్వారపూడి-అనపర్తి-బిక్కవోలు-సామర్లకోట- కాకినాడ.

10. గుత్తి-ఆదోని-కౌతాళం-ఏపీ/కర్ణాటక సరిహద్దు

11. కదిరి-కృష్ణపట్నం పోర్టు వయా రాయచోటి, రాజంపేట, చిట్వేలు, రాపూరు, గూడూరు

12. భాకరాపేట-బేస్తవారిపేట వయా బద్వేలు- పోరుమామిళ్ల

13. తడ-వరదాయపాళెం- నీలవాయి-బుచ్చినాయుడు కండ్రిగ-శ్రీకాళహస్తి

14. రాకినాడ-ముక్తేశ్వరం-ద్రాక్షారామ- కోటిపల్లి- అయినవిల్లి-అమలాపురం

15. చిత్రదుర్గ-చెల్లి కెర-పావగడ (కర్ణాటక)- పెనుగొండ-బుక్కపట్నం (ఏపీ)

16. ఎమ్మిగనూరు-పత్తికొండ-గుంతకల్లు-ఉరవకొండ-కల్యాణదుర్గం-పావగడ- మడకశిర

17. మలకవేముల క్రాస్- నల్లమాడ-ఓబుళదేవరచెరువు - బాగేపల్లి

18. బైరెడ్డిపల్లె శంకరాయల్ పేట-పుంగనూరు-పులిచర్ల-చిన్నగొట్టిగల్లు-రొంపిచెర్ల

18. దామాజిపల్లి (నాగసముద్రం దగ్గర)- ధర్మవరం- బత్తలపల్లి- నాయనపల్లి క్రాస్

20. బేస్తవారిపేట-గొట్లగట్టు-పొదిలి-ఉప్పలపాడు-చీమకుర్తి-ఒంగోలు

21. తాళ్లపాలెం-చింతపల్లి- సీలేరు-భద్రాచలం

22. సబ్బవరం-చోడవరం-రావికమతం -నర్సీపట్నం- కోటనందూరు తుని

23. భీమడోలు-ద్వారకాతిరుమల-జంగారెడ్డిగూడెం

24. పామర్రు-కూచిపూడి-మొవ్వ-కొడాలి-చల్లపల్లి

25. గుంటూరు-ఒంగోలు వయా పత్తిపాడు

26. ఉత్తుకొట్టై-సత్యవేడు, సత్యవేడు-తడ

27. రాజమండ్రి- మార్టేరు ప్రక్కిలంక-ప్రత్తిపాడు-నిడదవోలు-భీమవరం

28. భీమవరం-కానూరు-లంకలకోడేరు- నరసాపురం-మార్టేరు- కోడేరు

ఆచంట సిద్ధాంతం

29. గుంటూరు-నల్లపాడు-పేరేచెర్ల- తాడికొండ-కాజ (గుంటూరు పశ్చిమ బైపాస్)

30. గుంటూరు-నారాకోడూరు-చేబ్రోలు-పొన్నూరు-బాపట్ల

31. విజయనగరం-పాలకొండ రోడ్డు

Farmers Blocked National Highway Works in vijayawada : జాతీయ రహదారి పనులను అడ్డుకున్న రైతులు.. పరిహారం చెల్లించాలని డిమాండ్​

18 గంటల్లోనే రహదారి​ నిర్మాణం.. లిమ్కా బుక్​లో స్థానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.