ETV Bharat / politics

పదేళ్లలో ఏనాడూ బీఆర్‌ఎస్‌ సర్కార్‌ కాంగ్రెస్ నేతలను ఆహ్వానించలేదు : పొన్నం ప్రభాకర్‌ - Telangana Decade Celebrations 2024 - TELANGANA DECADE CELEBRATIONS 2024

Telangana Formation Celebrations Arrangements : రాష్ట్రావిర్భావ వేడుకలను ప్రజలంతా పండుగలా జరుపుకోవాలని మంత్రులు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం చాటిచెప్పేలా కార్యక్రమాలు ఉంటాయని మంత్రులు తెలిపారు. రాజకీయాలకతీతంగా వేడుకల్లో పాల్గొనాలని మంత్రులు కోరారు.

Ministers inspected the arrangements at the parade ground
Telangana Formation Celebrations Arrangements (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 1, 2024, 3:34 PM IST

Ministers Inspected Arrangement of Telangana Formation Celebrations : రాష్ట్రం కోసం ఎన్నో వర్గాల ప్రజలు పోరాటం చేశారని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. పరేడ్‌ గ్రౌండ్‌లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు పరిశీలించి మాట్లాడారు. తెలంగాణ వచ్చాక పదేళ్లపాటు నియంతృత్వం కొనసాగిందని విమర్శించారు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, అందరూ ఉత్సాహంగా వేడుకలు జరుపుకోవాలని కోరారు.

అమర వీరులను స్మరించుకుంటూ ఆవిర్భావ వేడుకలు జరుగుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఆనాడు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఒక్క అడుగు వెనక్కి వేసినా, రాష్ట్ర ఏర్పాటు సాధ్యమయ్యేది కాదన్నారు. ప్రధాని మోదీ తెలంగాణ ఏర్పాటును అవమానించేలా ఎన్నోసార్లు మాట్లాడారని దుయ్యబట్టారు. భవిష్యత్‌లో తెలంగాణ, ప్రజాస్వామిక రాష్ట్రంగా మరింత ముందుకెళ్తుందని ఆశించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర అవతరణ వేడుకలకు రాజకీయాలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

"ప్రజల పాలనలో జరుగుతున్న ఈ దశాబ్ది వేడుకల్లో ప్రజలంతా పాల్గొనాలి. నాడు తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన గీతాన్ని, నేడు రాష్ట్ర గేయంగా రేపు ఆవిష్కరించకోవటం జరుగుతుంది. ఈ వేడుకలను అన్ని రాజకీయ పార్టీలు ఘనంగా జరుపుకోవాలి. అందరూ భాగస్వాములు కావాలి. గత పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో మాకెవరికీ ఆహ్వానం రాలేదు. మేము తెలంగాణ బిడ్డలమే. ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సైతం మర్యాదపూర్వకంగా ఆహ్వానం పంపించాం."-పొన్నం ప్రభాకర్, మంత్రి

Telangana Formation Day 2024 : రాష్ట్రంలో ప్రతి గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ దశాబ్ది వేడుకలకు సోనియాగాంధీ వస్తారని ఆశిస్తున్నామన్న మంత్రి పొన్నం తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో కూడా గత ప్రభుత్వం ఎవరినీ వేడుకలకు ఆహ్వానించలేదని, మరీ ముఖ్యంగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ నేతలను ఎప్పుడూ ఆహ్వానించలేదన్నారు. రాష్ట్ర చిహ్నం రూపకల్పనలో సైతం గత బీఆర్ఎస్‌ సర్కార్‌ ఎవరి అభిప్రాయాలను సేకరించలేదన్నారు.

రాష్ట్ర విభజన చట్టం ప్రకారమే అన్నీ జరుగుతాయని, యావత్‌ తెలంగాణ జాతిని ఏకం చేసిన శక్తి జయ జయహే తెలంగాణ పాటదని కొనియాడారు. వచ్చే తెలంగాణ గొప్పగా ఉండాలని అమర వీరులు ఆకాంక్షించారని, అలాంటిది గడిచిన పదేళ్లలో తెలంగాణ అమరుల ఆకాంక్షలు నెరవేరలేదని ఆక్షేపించారు.

పదేళ్లలో ఏనాడూ బీఆర్‌ఎస్‌ సర్కార్‌ కాంగ్రెస్ నేతలను ఆహ్వానించలేదు : పొన్నం ప్రభాకర్‌ (ETV Bharat)

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు రండి - గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్​ను ఆహ్వానించిన సీఎం రేవంత్ - CM Revanth Meet Governor 2024

తెలంగాణ సాధనలో అన్నింటా తానైన భాగ్యనగరి - నాటి పోరాట స్మృతులను ఓసారి గుర్తు చేసుకుందాం రండి!! - Telangana Formation day 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.