SIT investigation Start : రాష్ట్రంలో పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు ప్రారంభమైంది. పల్నాడు జిల్లా మాచర్ల, తిరుపతి జిల్లా చంద్రగిరి, అనంతపురం జిల్లా తాడిపత్రిలో అధికార వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ ఎత్తున దాడులకు పాల్పడ్డాయి. మారణాయుధాలతో స్వైర విహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. ఈ అల్లర్లలో ఇప్పటికే పలువురు అధికారులు, పోలీసుల పాత్ర కూడా ఉందని ఆరోపణలు వెల్లువెత్తగా కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు పలువురు పోలీస్ ఉన్నతాధికారులపై వేటు వేసింది.
పల్నాడులో 144 సెక్షన్- భారీగా పోలీస్ పహారా - attacks in palnadu
ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం క్షేత్రస్థాయిలో కేసుల విచారణ ప్రారంభించనుంది. పల్నాడు జిల్లా మాచర్ల, నర్సరావుపేట, తిరుపతి జిల్లా చంద్రగిరి, అనంతపురం జిల్లా తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరిగిన అల్లర్లపై ప్రాథమిక నివేదికను సిట్ ఈసీకి పంపనుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం ముందుగా హింసాత్మక ఘటనలపై నమోదైన కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్ లను పునః సమీక్షించనుంది.
హింసాత్మక ఘటనలతో సంబంధం ఉన్న కొందరు రాజకీయ పార్టీ నేతల్ని అరెస్టు చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఈ ఘటనలకు పరోక్షంగా సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొటున్న పోలీసులపైనా చర్యలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. నాలుగు ప్రాంతాల్లో జరిగిన ఘటనలకు సంబంధించి కొన్ని ప్రాథమిక ఆధారాలు సిట్ బృందానికి అందాయని సమాచారం.
రణరంగంగా తాడిపత్రి - రహస్య ప్రాంతానికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి తరలింపు - High Tension In Tadipatri
సిట్ దర్యాప్తు నేపథ్యంలో అధికార వైఎస్సార్సీపీ నేతల్లో వణుకు మొదలైంది. ప్రత్యర్థులపై దాడులకు ఉసిగొల్పడమే గాకుండా పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రి మారణాయుధాలు దాచి ఉంచారు. భారీ ఎత్తున అల్లర్లు జరిగేలా దాచి ఉంచిన నాటు బాంబులు, పెట్రోల్ బాంబులు, ఖాళీ సీసాలు పోలీసుల తనిఖీల్లో లభ్యం కావడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లలో సోదాలు చేసిన పోలీసులు బాత్రూముల్లో దాచిన మందుగుండు సామగ్రిని చూసి విస్తుపోయారు. పల్నాడు, కారంపూడి, పిన్నెల్లి సహా పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేసి పెద్ద ఎత్తున వాటిని స్వాధీనం చేసుకున్నారు.
నాటు బాంబులు, పెట్రోల్ సీసాల దాడులతో రక్తసిక్తమైన పల్నాడు - YSRCP attacks in Palnadu