ETV Bharat / politics

నాడు పార్టీ, ప్రభుత్వంలో నెం.2 - నేడు పుంగనూరులోనే పట్టు కోల్పోతున్న పెద్దిరెడ్డి - PEDDI REDDY POLITICAL CAREER

Big Shock to PeddiReddy:పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొన్నటిదాకా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నెంబర్‌ 2గా వెలుగొందారు. రాయలసీమలో ఆయన చెప్పిందే వేదంలా పార్టీ నేతలు, నాయకులు పాటించారు. కానీ పార్టీ అధికారం కోల్పోయాక ఆయన సొంత నియోజకవర్గంలోనే పర్యటించలేకపోతున్నారు. అడుగడుగునా నిరసనలతో ప్రజలు అడ్డగిస్తున్నారు. మరోవైపు ఇంత కాలం వెంట నడిచిన పార్టీ నేతలూ ఒకరి వెంట ఒకరు రాజీనామా చేస్తూ వరుస షాక్‌లు ఇస్తున్నారు.

Big Shock to Peddi Reddy
Big Shock to Peddi Reddy (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 13, 2024, 7:38 AM IST

Big Shock to Peddi Reddy : వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా రాయలసీమ జిల్లాల్లో ఆ పార్టీకి పెద్ద దిక్కుగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సొంత నియోజకవర్గంలోనే గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాలో ఎదురులేని నాయకుడిగా ఒంటిచేత్తో రాజకీయాలు నెరపిన పెద్దిరెడ్డి సాధారణ ఎన్నికల్లో పార్టీ ఓటమి అనంతరం అనూహ్య పరిణామాలు చవిచూస్తున్నారు.

PeddiReddy Political Career End? : ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయిన రీతిలో స్వల్ప మెజారిటీతో గట్టెక్కిన పెద్దిరెడ్డి పుంగనూరు నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం నియోజకవర్గంలో పర్యటించలేని స్థితికి పెద్దిరెడ్డి పరిస్థితి దిగజారిపోయింది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని గడచిన ఐదు సంవత్సరాలుగా నియోజకవర్గంలో చేసిన దౌర్జన్యాలు, అరాచకాలతో విసిగిపోయిన ప్రజలు ఎన్డీయే కూటమి నేతలకు అండగా ఉండటం పెద్దిరెడ్డికి ఇబ్బందిగా మారింది. పుంగనూరు నియోజకవర్గంలో పర్యటించడానికి ప్రయత్నించిన రెండు సార్లు నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో పర్యటన విరమించుకున్నారు.

పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎదురుదెబ్బ - Shock to Ex Minister peddireddy

రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఓటమి నియోజకవర్గంలో తనకు ఎదురవుతున్న నిరసనల నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ కార్యకర్తలకు అండగా నిలవలేకపోతున్నారు. అధికారంలో ఉన్న సమయంలో శ్రేణులకు పదవులు కట్టపెట్టి అధికారాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని రాజకీయాలు చేసిన పెద్దిరెడ్డి పార్టీ ఓటమి పాలయ్యాక సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో పార్టీ తుడిచిపెట్టుకుపోవడం మరో వైపు పెద్దిరెడ్డి నియోజకవర్గంలో పర్యటించలేని పరిస్థితులతో వైఎస్సార్సీపీ నేతలు ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించారు.

ఈ కోవలోనే పుంగనూరు పురపాలక సంస్థ ఛైర్మన్‌ సహా 11 మంది కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. పులిచర్ల మండల జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్‌తో పాటు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు పార్టీని వీడారు. ఓటమి తర్వాత పార్టీ శ్రేణులకు అండగా నిలవకపోవడం పదవులు తప్ప అధికారం ఇవ్వకపోవడం వంటి ఆరోపణలతో నేతలు పార్టీని వీడుతున్నారు.

పార్టీలో, ప్రభుత్వంలో నెంబర్‌ 2గా చలామణి అవుతూ చక్రం తిప్పిన పెద్దిరెడ్డి సొంత నియోజకవర్గాన్ని కాపాడుకోలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. తన దౌర్జన్యకాండతో ప్రతిపక్షాలను అణగతొక్కి నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచులను వంద శాతం ఏకగ్రీవం చేసుకొని రికార్డు సృష్టించారు. అధికారం పోయాక భిన్నమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గ్రామ స్థాయి, ద్వితీయ శ్రేణి నాయకులు సైతం పార్టీ వీడుతుంటే నిలువరించలేని నిస్సహాయ స్థితికి పెద్దిరెడ్డి పడిపోయారు.

రోడ్డుపై పెద్దిరెడ్డి పెత్తనం - ప్రజలు తిరగకుండా గేట్లు ఏర్పాటు - Peddireddy occupied Tirupati road

పుంగనూరులో ఉద్రిక్తత- మిథున్‌ రెడ్డి పర్యటనను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు - Alliance Leaders Protest

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.