ETV Bharat / politics

సికింద్రాబాద్‌ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ - Secunderabad BRS MP Candidate - SECUNDERABAD BRS MP CANDIDATE

Secunderabad BRS MP Candidate Padma Rao Goud : లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తమవుతున్న బీఆర్ఎస్ పార్టీ ఒక్కొక్కటిగా ఎంపీ స్థానాలను ప్రకటిస్తోంది. ఇప్పటికే పదమూడు స్థానాలకు లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ అధినేత కేసీఆర్ తాజాగా సికింద్రాబాద్‌ స్థానానికి పేరు ఖరారు చేశారు. మాజీ మంత్రి పద్మారావు గౌడ్‌కు ఆ స్థానం కేటాయించారు.

Secunderabad BRS MP Candidate Padma Rao Goud

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 23, 2024, 4:06 PM IST

Updated : Mar 23, 2024, 4:54 PM IST

Secunderabad BRS MP Candidate Padma Rao Goud : అసెంబ్లీ ఫలితాలు పార్లమెంట్ ఎన్నికల్లో పునరావృతం కాకుండా బీఆర్ఎస్ జాగ్రత్త పడుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించాలని ఉవ్విళ్లూరుతోంది. ఆ దిశగా కార్యాచరణను ముమ్మరం చేస్తోంది. ఓవైపు ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతూనే మరోవైపు విడతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తోందని. గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ వరుసగా లోక్‌సభ నియోజకవర్గాలపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో ఆయా నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటిస్తున్నారు.

ఇప్పటి వరకు 13 స్థానాలకు లోక్‌సభ అభ్యర్థుల (BRS Lok Sabha Candidates)ను ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ తాజాగా మరో ఎంపీ అభ్యర్థి పేరును ఖరారు చేశారు. తాజాగా సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. మాజీ మంత్రి పద్మారావు గౌడ్‌కు ఈ స్థానం నుంచి ఎంపీ టికెట్ ఇచ్చింది. పద్మారావు గౌడ్ పేరును పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. మరోవైపు ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి బరిలో నిలిచారు.

మరో 2 లోక్​సభ స్థానాలకు బీఆర్​ఎస్​ అభ్యర్థుల ప్రకటన​ - మెదక్ బరిలో మాజీ ఐఏఎస్ - BRS Lok Sabha Candidates 2024

BRS Lok Sabha Candidates in Telangana 2024 : పార్టీ సీనియర్ నేతగా నాటి ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పార్టీకి విధేయుడుగా ఉన్న పద్మారావు గౌడ్ అందరివాడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సికింద్రాబాద్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన, నిబద్ధత కలిగిన నేతగా పేరుగాంచారు. స్థానిక నేతగా ఆ ప్రాంత ప్రజలు బస్తీవాసులందరికీ పజ్జన్నగా ఆదరాభిమానాలు పొందిన పద్మారావు గౌడ్‌ ఈ స్థానానికి సరైన ఎంపిక అని పార్టీ అధినేతతో పాటు స్థానిక నేతలు కూడా భావించారు. ఈ నేపథ్యంలో పద్మారావు గౌడ్‌ (BRS MP Candidate Padma Rao Goud)ను సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఆమోదించినట్లు పేర్కొన్నారు. అందరి ఏకాభిప్రాయం మేరకే పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇక లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటికే 13 స్థానాలకు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. అయితే పార్టీ నుంచి వరుసగా కీలక నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతుండటంతో గులాబీ పార్టీ అభ్యర్థుల ప్రకటనపై అయోమయానికి గురవుతోంది. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా మాజీ మంత్రులు, మాజీ శాసనసభ, శాసనమండలి సభ్యులు కాంగ్రెస్, బీజేపీ కండువాలు కప్పుకుంటున్నారు. ఇక ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కూడా కారు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంతో పకడ్బందీగా, ఆచితూచి కేసీఆర్ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల్లో మాజీ ఐఏఎస్, మాజీ ఐపీఎస్ ఉండటం గమనార్హం.

లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన కేసీఆర్ - ఫస్ట్‌ లిస్ట్‌లో వీరికే ఛాన్స్

14 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు వీరే :

  • సికింద్రాబాద్ - పద్మారావు గౌడ్
  • మెదక్ - పి.వెంకట్రామి రెడ్డి
  • నాగర్​ కర్నూల్ - ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్
  • మహబూబ్‌నగర్‌ - మన్నె శ్రీనివాస్‌రెడ్డి
  • ఖమ్మం- నామా నాగేశ్వరరావు
  • ఆదిలాబాద్​- ఆత్రం సక్కు
  • మల్కాజిగిరి- రాగిడి లక్ష్మారెడ్డి
  • వరంగల్‌ - కడియం కావ్య
  • చేవెళ్ల - కాసాని జ్ఞానేశ్వర్‌
  • జహీరాబాద్‌ - గాలి అనిల్‌ కుమార్‌
  • నిజామాబాద్‌ - బాజిరెడ్డి గోవర్దన్‌
  • కరీంనగర్‌ - బి.వినోద్‌ కుమార్‌
  • పెద్దపల్లి - కొప్పుల ఈశ్వర్‌
  • మహబూబాబాద్‌ - మాలోత్‌ కవిత

మరో రెండు స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్​ఎస్​ - మల్కాజిగిరి బరిలో లక్ష్మారెడ్డి

Last Updated : Mar 23, 2024, 4:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.