ETV Bharat / politics

తెలంగాణ రాష్ట్రం - దక్షిణ భారతదేశానికి గేట్​ వే లాంటిది : కేంద్రమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ - Rajnath Singh election Campaign

Rajnath Singh Campaign on Telangana Election : కాంగ్రెస్​ ప్రధానులు పేదరికాన్ని పెంచి పోషించారని కేంద్రమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ విమర్శించారు. సికింద్రాబాద్​లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్​ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 19, 2024, 2:16 PM IST

Updated : Apr 19, 2024, 2:30 PM IST

Rajnath Singh
Rajnath Singh

Rajnath Singh Campaign on Telangana Election : తెలంగాణ దక్షిణ భారతదేశానికి గేట్​ వే లాంటిదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ తెలిపారు. బీఆర్​ఎస్​ సర్కారు అవినీతి చేసి ప్రజల సొమ్మును లూటీ చేసిందని అన్నారు. మోదీ నేతృత్వంలో దేశంలో ఒక్క అవినీతి జరగలేదని పేర్కొన్నారు. 2027 వరకు ప్రపంచంలోనే భారత్​ ఆర్థిక వ్యవస్థ మూడో స్థానానికి చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్​లోని జరిగిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో కేంద్రమంత్రులు రాజ్​నాథ్​ సింగ్​, కిషన్​రెడ్డి, లక్ష్మణ్​, ఈటల రాజేందర్​ పాల్గొన్నారు.

కాంగ్రెస్​ పార్టీ సంతుష్టీకరణ విధానాలను అవలంబిస్తోందని కేంద్రమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ మండిపడ్డారు. భవ్యమైన రామ మందిరం నిర్మించి ప్రాణ ప్రతిష్ట చేశామన్నారు. జమ్మూకశ్మీర్​ 370 ఆర్టికల్​ను రద్దు చేశామని గుర్తు చేశారు. ట్రిపుల్​ తలాక్​ను రద్దు చేసి ముస్లిం సమాజంలోని మహిళలకు విముక్తి కలిగించామని చెప్పారు.

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్​కు 40 సీట్లు కూడా రావు : ఎంపీ లక్ష్మణ్

Rajnath Comments on Congress : బీజేపీ రాజనీతి పార్టీనని, బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ పార్టీలు రాజనీతి పార్టీలు కాదని కేంద్రమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ తెలిపారు. కాంగ్రెస్​ ప్రధానులు పేదరికాన్ని పెంచి పోషించారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదరికం నుంచి 15 కోట్ల మందిని బయటకు తీసుకువచ్చామని వెల్లడించారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్​ తీసుకువచ్చామని గర్వించారు.

రక్షణ శాఖకు సంబంధించి అన్ని స్వదేశంలోనే ఉత్పత్తి చేసుకుంటున్నామని హర్షం వ్యక్తం చేశారు. కిషన్​రెడ్డి నామినేషన్​ కోసం తాను వచ్చానని, ఈటల రాజేందర్​ ఆర్థిక మంత్రిగా అద్భుతంగా పని చేశారని రాజ్​నాథ్​ సింగ్​ కొనియాడారు. ఈ సందర్భంగా కిషన్​రెడ్డి, ఈటల రాజేందర్​ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

"కిషన్‌రెడ్డి చాలా మంచి వ్యక్తి. ప్రతి విషయంపై సాధికారికంగా కిషన్‌రెడ్డి మాట్లాడతారు. కిషన్‌రెడ్డి మాతో కలిసి చాలాకాలంగా పనిచేస్తున్నారు. రాష్ట్ర ఆర్థికమంత్రిగా ఈటల ఎన్నో సేవలు అందించారు. మల్కాజిగిరిలో ఈటలను గెలిపించి లోక్‌సభకు పంపండి. బీజేపీ రాజనీతి పార్టీ అనీ, బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ రాజనీతి పార్టీలు కాదు. తెలంగాణ గేట్​ ఆఫ్​ దక్షిణ ఇండియా." - రాజ్​నాథ్​ సింగ్​, రక్షణ శాఖ మంత్రి

తెలంగాణ రాష్ట్రం - దక్షిణ భారతదేశానికి గేట్​ వే లాంటిది : కేంద్రమంత్రి రాజ్​నాథ్​ సింగ్​

కిషన్​రెడ్డి భుజాలపై మోదీ అతిపెద్ద బాధ్యతను పెట్టారు : మనదేశ సంస్కృతి, సంప్రదాయాలను కిషన్‌రెడ్డి కాపాడుతున్నారని మల్కాజిగిరి బీజేపీ లోక్‌సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. కిషన్‌రెడ్డి భుజాలపై ప్రధాని మోదీ అతిపెద్ద బాధ్యత పెట్టారని చెప్పారు. మోదీ పాలనలో ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. కులం, మతం, ప్రాంతం భేదాలు లేకుండా కిషన్‌రెడ్డి సేవలు చేస్తున్నారని, సికింద్రాబాద్ ప్రజలు మరోసారి ఆయనను ఆశీర్వదించాలని కోరుతున్నట్లు ఈటల రాజేందర్ వెల్లడించారు.

నేను ఏనాడూ దౌర్జన్యాలు చేయలేదు - ప్రజల కోసమే పని చేశా - మరోసారి అవకాశం ఇవ్వండి : కిషన్‌ రెడ్డి

రెండంకెల ఎంపీ స్థానాలే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు - ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్న అభ్యర్థులు

Last Updated : Apr 19, 2024, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.