ETV Bharat / politics

ప్రజల హృదయాల నుంచి పుట్టిందే మా గ్యారంటీల పత్రం : రాహుల్‌ గాంధీ - Tukkuguda Congress Meeting 2024 - TUKKUGUDA CONGRESS MEETING 2024

Rahul Gandhi Release Congress Manifesto in Tukkuguda : దేశ ప్రజల హృదయాల నుంచి పుట్టిందే మా గ్యారంటీల పత్రమని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. తుక్కుగూడ జనజాతర సభ వేదికగా, ఐదు గ్యారెంటీలను ఆవిష్కరించిన రాహుల్‌ రైతులు, యువత, మహిళల సహా అందరికీ అండగా ఉంటామని తెలిపారు. దేశంలో ఏ కుటుంబానికి ఏటా రూ.లక్ష ఆదాయం కంటే తక్కువ ఉండబోదని ఆయన హామీ ఇచ్చారు.

congress_meeting
congress_meeting
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 6, 2024, 9:48 PM IST

ప్రజల హృదయాల నుంచి పుట్టిందే మా గ్యారంటీల పత్రం : రాహుల్‌ గాంధీ

Rahul Gandhi Release Congress Manifesto in Tukkuguda : తెలంగాణలో ఇచ్చిన హామీలను అమలు చేసినట్లుగానే, జాతీయ స్థాయిలోనూ కచ్చితంగా అమలు చేసి తీరుతామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌గాంధీ, నేరుగా తుక్కుగూడ సభకు వచ్చారు. జనజాతర సభ వేదికపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం 'న్యాయ పత్రం' పేరిట కాంగ్రెస్‌ జాతీయస్థాయి మేనిఫెస్టోను(Congress National Manifesto) విడుదల చేశారు. గ్యారంటీ కార్డులను ఆవిష్కరించారు.

తెలంగాణలో అతి తక్కువ కాలంలోనే యువతకు 25 వేలకుపైగా ఉద్యోగాలు ఇచ్చామని, తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కూడా ఆ హామీని నిలబెట్టుకుంటామని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. విద్యావంతులైన యువకులకు సంవత్సరం శిక్షణతోపాటు నెలకు రూ.8,500 ఇస్తామని తెలిపారు. ‘మహిళ న్యాయం’ ద్వారా పేద మహిళలకు ఏటా రూ.లక్ష మొత్తాన్ని నేరుగా బ్యాంకులో జమచేస్తామని తెలిపారు. ఇది ఓ విప్లవాత్మక పథకమని వివరించారు.

నేను బయటకు వెళ్లాక నరికి చంపినా ఆశ్చర్యపడనక్కర్లేదు: సునీత - YS Vivekananda Reddy murder Case

"మేం రూ.500 సిలిండర్​, 200 యూనిట్ల ఉచిత విద్యుత్​, గృహలక్ష్మి, ఉచిత బస్సు హామీలను ఇచ్చాం. మీ అందరి మాటలను విని మేం ఈ హామీలు ఇచ్చి అమలు చేశాం. కాంగ్రెస్​ పార్టీ హామీ ఇస్తే వాటిని కచ్చితంగా అమలు చేస్తుందని ఇప్పుడు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. తెలంగాణలో ఇచ్చిన హామీలను ఎలా అయితే నిలబెట్టుకున్నామో అలాగే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం. దేశంలోని ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం ఈ మేనిఫెస్టో."-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్రనేత

బాబాయి హత్య విషయంలో జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారు: వైఎస్ షర్మిల - YS Sharmila Blames Jagan

స్వామినాథన్‌ సిఫార్సులను అనుసరించి పంటలకు మద్దతు ధర : మోదీ ప్రభుత్వం(PM Modi Govt) ధనవంతులకే రూ.16 లక్షల కోట్లు రుణమాఫీ చేసిందని, రైతుకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని రాహుల్​ విమర్శించారు. జాతీయ స్థాయిలో కనీస వేతనం రూ.400కి పెంచుతామన్న ఆయన, రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు, స్వామినాథన్‌ సిఫార్సులను అనుసరించి గిట్టుబాటు ధర అందిస్తామని చెప్పారు. ఇకపై దేశంలో ఏ కుటుంబానికి ఏటా రూ.లక్ష ఆదాయం కంటే తక్కువ ఉండబోదని రాహుల్‌ హామీ ఇచ్చారు.

అక్రమమైన సక్రమమైన ఆ వైఎస్సార్సీపీ నేతకు కప్పం కట్టాల్సిందే! - YCP leader irregularities in AP

అన్ని వర్గాలకు న్యాయం - కాంగ్రెస్‌ అభిమతం : కొన్ని నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుక్కుగూడలోనే గ్యారంటీ కార్డు విడుదల చేశామని రాహుల్​ గాంధీ తెలిపారు. రూ.500 సిలిండర్‌, గృహజ్యోతి(GruhaJyothi Scheme), మహిళలకు ఉచిత బస్సు, గృహలక్ష్మి గ్యారంటీలు ఇచ్చి, వాటిని అమలు చేస్తున్నామన్నారు. ప్రజల హృదయాల నుంచి పుట్టిందే మా గ్యారంటీల పత్రమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ అన్నివర్గాలకు న్యాయం చేస్తుందని, ఇదే పార్టీ అభిమతమని చెప్పారు. మోదీ వద్ద ధనం, సీబీఐ, ఈడీ ఉంటే, కాంగ్రెస్‌ వద్ద ప్రేమ, స్వచ్ఛత ఉన్నాయన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.