ETV Bharat / politics

కాంగ్రెస్‌ పాలనలో రాజ్యాంగానికి రక్షణ లేదు - తెలంగాణలో అభివృద్ధి లేదు : ప్రధాని మోదీ - PM MODI SLAMS CONGRESS IN WARANGAL - PM MODI SLAMS CONGRESS IN WARANGAL

PM Modi Attacks On Congress in Warangal Meeting : వికసిత భారత్​ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని పీఎం నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశ​ ప్రతిష్ఠ ప్రపంచవ్యాప్తం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఎక్కడ గెలుస్తుందో బూతద్దంలో వెతకాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. వరంగల్​లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

PM Modi Election Campaign in Warangal
PM Modi Lok Sabha Election 2024
author img

By ETV Bharat Telangana Team

Published : May 8, 2024, 1:08 PM IST

Updated : May 8, 2024, 2:40 PM IST

కాంగ్రెస్‌ పాలనలో రాజ్యాంగానికి రక్షణ లేదు - తెలంగాణలో అభివృద్ధి లేదు : ప్రధాని మోదీ

PM Modi Speech At Warangal Meeting Today : మూడో విడతలోనే ఎన్డీఏ విజయం వైపు పయనిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్​ ఎక్కడ గెలుస్తుందో బూతద్దంలో వెతకాల్సిన పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల క్రితం బీజేపీకి ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉండేవారని ఆ ఇద్దరు ఎంపీల్లో ఒకరు హనుమకొండ నుంచే గెలిచారని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలను తమ పార్టీని ఎన్నటికీ మరవలేదని వ్యాఖ్యానించారు.

వరంగల్​ ప్రజలు ఎప్పుడూ బీజేపీకి మద్దతుగా నిలిచారని ప్రధాని మోదీ అన్నారు. ఈ ప్రాంతం కాకతీయుల విజయ గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు వరంగల్​లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వరంగల్​ లోక్​సభ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్​కు మద్దతుగా ప్రచారం చేశారు. ఆరూరి రమేశ్​ను భారీ మెజార్టీతో గెలిపించాలని మోదీ కోరారు.

PM Modi Attacks On Congress in Warangal : వికసిత్​ భారత్​ కావాలని, భారతదేశ​ ప్రతిష్ఠ ప్రపంచవ్యాప్తం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అస్థిరత, అశాంతి, విపత్తులు నెలకొన్నాయని, భారత్​ తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ప్రమాదం పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మరోసారి బీజేపీకి ప్రజలు పట్టం కట్టాలని ప్రధాని మోదీ కోరారు.

'కాంగ్రెస్​ ప్రభుత్వ పాలనలో పాపాలను ప్రజలు చూశారు. కాంగ్రెస్​ హయాంలో రూ.వేల కోట్ల కుంభకోణాలు వెలుగుచూశాయి. కాంగ్రెస్​ హయాంలో బాంబు పేలుళ్లు వంటి ఘటనలు చూశాం. ఇండియా కూటమి ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులను తీసుకువస్తామని చెబుతోంది. ప్రతి పార్టీకి ఒక్కో ప్రధాని ఉంటే దేశం బాగుపడుతుందా? రైతుల రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్​ మోసగించింది. ఇప్పుడేమో ఆగస్టు 15 లోగా రైతు రుణాలు మాఫీ చేస్తామని చెబుతోంది. లోక్​సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్​ చేతులెత్తేయాలని చూస్తోంది. అమరవీరులకు పింఛన్ల హామీని కాంగ్రెస్​ నెరవేర్చిందా? మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్న హామీ నెరవేర్చిందా? విద్యుత్​ కోతలతో ప్రజలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. విశ్వాస ఘాతుకానికి పాల్పడిన కాంగ్రెస్​ ప్రజలకు మేలు చేస్తుందానని' ప్రధాని మోదీ ప్రశ్నించారు.

కాంగ్రెస్​ వచ్చాక ఖజానా ఖాళీ : కాంగ్రెస్​ వచ్చాక ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణ ప్రజల డబ్బులు ఎక్కడికి వెళ్తోందని ప్రశ్నించారు. ఆర్​ఆర్​ ట్సాక్స్​ పేరిట ప్రజల సొమ్ము దోపిడీకి గురవుతోందని ఆరోపించారు. కాంగ్రెస్​ పాలనలో రాజ్యాంగానికి ఎలాంటి రక్షణ లేదని అన్నారు. మతపరంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదని స్పష్టంగా ఉందన్న మోదీ, కర్ణాటకలో బీసీల రిజర్వేషన్లకు కోతపెట్టి ముస్లింలకు ఇచ్చారని మండిపడ్డారు. ఎస్సీలకు రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్​ వెనకడుగు వేసిందని, ఎస్సీలకు రిజర్వేషన్ల విషయంలో తాను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తానని మోదీ హామీ ఇచ్చారు. తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ మంజూరు చేశామని వెల్లడించారు. అభివృద్ధిని అడ్డుకోవడానికి కాంగ్రెస్​ ప్రయత్నిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు.

"బీజేపీ వచ్చాక ఎస్సీ వ్యక్తి రామ్​నాథ్​ కోవింద్​ను రాష్ట్రపతిగా చేశాం. రెండోసారి వచ్చాక ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేశాం. ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్మును కాంగ్రెస్​ వ్యతిరేకించింది. చాలా మంది ప్రజల శరీర రంగు నలుపు ఉంటుంది. శ్రీకృష్ణుడి రంగు కూడా నలుపు అని గుర్తించాలి. ద్రౌపది ముర్మును ఓడించాలని కాంగ్రెస్​ యత్నించింది. దేశాన్ని ఎటువైపు తీసుకెళ్లాలని కాంగ్రెస్​ చూస్తోంది. శరీర రంగు ఆధారంగా యోగ్యత నిర్ణయిస్తారా?. శరీర రంగు ఆధారంగా దేశ ప్రజలను అవమానించాలని అనుకుంటున్నారా?. శరీర రంగు ఆధారంగా అవమానించాలని చూస్తే నేను ఎన్నటికీ సహించను." - నరేంద్ర మోదీ, ప్రధాని

గోద్రా అల్లర్లపై మోదీ కీలక వ్యాఖ్యలు- మూడో విడత వేళ ప్రతిపక్షాలపై ఫుల్​ ఫైర్​! - lok sabha election 2024

'కాంగ్రెస్​ మ్యానిఫెస్టోలో ఏముందో ప్రజలకు బాగా తెలుసు- అందుకే మీలో ఆందోళన!' - Kharge Letter To Modi

Last Updated : May 8, 2024, 2:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.