ETV Bharat / politics

రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక హీట్ - జోరందుకున్న ప్రధాన పార్టీల ప్రచారాలు - Telangana Graduate MLC By Election - TELANGANA GRADUATE MLC BY ELECTION

Political Parties Graduate MLC By Election Campaign 2024 : వరంగల్‌- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలు దృష్టి కేంద్రీకరించాయి. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు, ఆయా పార్టీల నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ ఉప ఎన్నికకు 11 మంది నామినేషనన్లు ఉపసంహరించుకోగా, 52 మంది బరిలో నిలిచారు. ఈ నెల 27న పోలింగ్‌ జరుగనున్న నేపథ్యంలో 25 సాయంత్రం 4 గంటల వరకే ప్రచారానికి గడువు మిగిలి ఉంది.

Telangana Graduate MLC By Election
Telangana Graduate MLC By Election (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 19, 2024, 7:31 AM IST

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ప్రచార జోరు (ETV Bharat)

Telangana Graduate MLC By Election Campaign 2024 : వరంగల్‌- ఖమ్మం- నల్గొండ ఈ 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం ముమ్మరం చేశారు. ఆయా పార్టీల నేతలు తమ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 2021లో ఎమ్మెల్సీగా గెలుపొందిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా గెలిచి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. మొత్తం 52 మంది ఈ స్థానానికి పోటీ పడుతుండగా, ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి తీన్మార్‌ మల్లన్న, బీఆర్ఎస్‌ నుంచి ఏనుగుల రాకేశ్‌ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి బరిలో నిలిచారు.

కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన సీపీఎం : ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో సీపీఎం పార్టీ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న గెలుపునకు కృషి చేస్తామని, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో లౌకిక విలువలు, ప్రజాస్వామ్యం కోసం ఇండియా బ్లాక్‌లో భాగస్వామ్యమైన హస్తం పార్టీకి మద్దతు ఇచ్చామని పేర్కొన్నారు. అలాగే ఇప్పుడు కూడా బీజేపీని ఓడించడం కోసం కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తామని తమ్మినేని వీరభద్రం వెల్లడించారు.

Telangana Graduate MLC Elections 2024 : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తీన్మార్ మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ, భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పాల్గొన్నారు. ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్నను గెలిపించి శాసన మండలికి పంపించాలని ఆయన కోరారు. సరైన నాయకులను ఎన్నుకున్నప్పుడే పట్టభద్రుల సమస్యలు పరిష్కారమవుతాయని ఎమ్మెల్యే అన్నారు.

ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకోవడంపై బీఆర్ఎస్ ఫోకస్ : వరంగల్‌- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు భారత్ రాష్ట్ర సమితి ప్రయత్నిస్తోంది. తెలంగాణలో శాసనమండలి పునరుద్ధరణ అయినప్పటి నుంచి అక్కడ గులాబీ పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. దీంతో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలోనూ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

ఇప్పటికే జిల్లాల్లో సమావేశాలు నిర్వహించడంతో పాటు మూడు ఉమ్మడి జిల్లాల నేతలతో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అయితే అభ్యర్థిత్వం విషయంలో కొంతమంది నాయకులు అసంతృప్తిగా ఉండటంతో ఆ భేటీకి రాలేదు. వారితో కేటీఆర్ ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. అందరూ కలిసికట్టుగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌ రెడ్డి గెలుపు కోసం పని చేయాలని వారికి స్పష్టం చేశారు. జిల్లాల్లోనూ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో కేటీఆర్ పాల్గొననున్నారు. నాలుగైదు రోజుల పాటు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఇవాళ భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో కేటీఆర్ ప్రచారం చేయనున్నారు.

ఉపఎన్నికపై బీజేపీ ఫోకస్ : ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. విజయమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. శాసనమండలిలో తమ బలం పెంచుకునేందుకు ఈ ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది. ఉద్యోగ, నిరుద్యోగ యువతకు కాంగ్రెస్, భారత్‌ రాష్ట్ర సమితి చేసిన మోసాలను వివరిస్తూ మండలిలో పట్టభద్రుల గళం వినిపించేందుకు భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కమలదళం ఓట్లు అభ్యర్థిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి విజయం కోసం అహర్నిశలు శ్రమిస్తోంది. ప్రేమేందర్‌ రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు ప్రచారాలు నిర్వహిస్తున్నారు.

లోక్​సభ స్ఫూర్తితో ఎమ్మెల్సీ స్థానంపై బీజేపీ గురి - ఇక్కడా మోదీ వేవ్​ను అందిపుచ్చుకునేలా ప్లాన్! - BJP Focus on MLC by Election

'ఆయ్‌అండీ, మావాడే గెలుస్తాడండి ' బెట్‌ ఎంతండీ? ఇదీ గోదావరి జిల్లాల పందెం రాయుళ్ల తీరు! - Betting on AP Results 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.