Police Notices YSRCP Leader Amzath Basha Brother: కడపకు చెందిన వైఎస్సార్సీపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా సోదరుడు అహ్మద్ భాషాకు కడప చిన్నచౌకు పోలీసులు శుక్రవారం 41A నోటీసులు అందజేశారు. ఇటీవల కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి పైన, హోం మంత్రి అనితపైన, స్పీకర్ అయ్యన్నపాత్రుడుపైన సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారనే అంశంపై అహ్మద్ భాషాపై ఇటీవల కేసు నమోదు అయింది.
అందులో భాగంగానే కడప చిన్నచౌకు పోలీసులు అహ్మద్ భాషకు 41 - A నోటీసులు జారీ చేశారు. నేడు కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్లో అహ్మద్ బాషా విచారణకు హాజరవుతారని భావించారు. అయితే తాను విచారణకు రాలేనని అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ భాష పోలీసులకు లేఖ పంపారు. 15 రోజులు సమయం కావాలని లేఖలో పేర్కొన్నారు. వ్యక్తిగత పనుల నిమిత్తం హాజరు కాలేకపోతున్నట్లు వెల్లడించారు.