YSRCP MLA Pinnelli Ramakrishna Reddy: నరసరావుపేట కోర్టు ఆవరణలో పోలీసుల పహారా కాస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి లొంగిపోతాడని భావించి అప్రమత్తమైన పోలీసులు, కోర్టు ఆవరణలో పహారా కాస్తున్నారు. పాల్వాయిగేటు ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని ఏ-1గా పేర్కొన్న పోలీసులు, ఆయన కోసం నిన్నటి నుంచి గాలిస్తున్నారు. నిన్న హైదరాబాద్‌లో పిన్నెల్లి డ్రైవర్, గన్‌మెన్‌ను అదుపులోకి తీసుకున్నారు. పిన్నెల్లి కోసం 8 ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ రామకృష్ణ రెడ్డిని పట్టుకోలేకపోయారు.
అరెస్ట్ అయ్యారన్న వార్తలు ఈవీఎం విధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిని, నిన్న అరెస్టు చేసినట్లు వార్తలు వినిపించాయి. తెలంగాణలోని సంగారెడ్డి సమీపంలో ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్టు చేసినట్లు పుకార్లు వెలువడ్డాయి. ఇస్నాపూర్ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్‌హౌస్‌లో అరెస్టు చేసినట్లు, ఇస్నాపూర్ లొకేషన్ గురించి పటాన్‌చెరు పోలీసులను అడిగిన ఏపీ పోలీసులు ఇస్నాపూర్ వరకు తెలంగాణ పోలీసుల సహకారం తీసుకొని పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్నారనే వార్తలు వ్యాప్తిలోకి వచ్చాయి. కానీ, పిన్నెల్లిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు."
పలు సెక్షన్లపై కేసులు: మాచర్ల ఈవీఎం ధ్వంసం ఘటనపై ఆగ్రహంగా ఉన్న ఈసీ, పిన్నెల్లిని తక్షణమే అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు హెదరబాద్ సహా పలు ప్రాంతాల్లో ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పిన్నెల్లిపై పది సెక్షన్లతో కేసులు నమోదు చేసినట్లు, ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. మొత్తం 3 చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లిపై కేసులు పెట్టినట్లు పేర్కొన్నారు. ఐపీసీ, ఆర్పీ, పీడీపీపీ చట్టాల పరిధిలో పది సెక్షన్లు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఐపీసీ కింద 143, 147, 448, 427, 353, 452, 120బి సెక్షన్ల కింద కేసులు చేమన్నారు. ఇక పిన్నెల్లిపై పీడీ పీపీ చట్టం కింద మరో కేసు నమోదు నమోదు చేశారు. ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లతో కేసులు నమోదు చేశారు.