ETV Bharat / politics

ఏపీలో ఎన్డీఏ సభపై ప్రధాని మోదీ ట్వీట్లు - ఏమన్నారంటే? - PM Narendra Modi Tweet

PM Narendra Modi Tweets: పల్నాడు జిల్లా బొప్పూడిలో టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభపై ప్రధాని మోదీ ట్వీట్లు చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తరువాత జరిగిన తొలి ఎన్నికల ప్రచార సభ సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..?

PM Narendra Modi Tweet
PM Narendra Modi Tweet
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 17, 2024, 10:50 PM IST

Updated : Mar 17, 2024, 10:57 PM IST

PM Narendra Modi Tweets: పల్నాడు జిల్లా బొప్పూడిలో టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభపై మోదీ ఆసక్తికరమైన ట్వీట్లు చేశారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తరువాత ఏపీలో జరిగిన తొలి ఎన్నికల ప్రచార సభ తనకు సంతృప్తినిచ్చిందని మోదీ ట్వీట్ చేశారు. సభ ప్రారంభానికి ముందు చేసిన ట్వీట్​లో ఎన్డీఏ కూటమిని ఏపీ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. సభ అనంతరం చేసిన ట్వీట్​లో ఏపీలో జరిగిన సభపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. పల్నాడులో భారీ బహిరంగ సభలో తాను పాల్గొన్నానని ప్రధాని మోదీ ట్వీట్​లో తెలిపారు. ఏపీ ప్రజలు ఎన్డీఏ కూటమికి ఓటేయాలని నిర్ణయించుకున్నారని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి అజెండాతో వెళ్తోన్న ఎన్డీఏకు ఏపీ ప్రజలు ఓటు వేస్తారని ఆకాక్షించారు.

పల్నాడులోని బహిరంగ సభకు వచ్చిన విశేష స్పందన చూస్తుంటే ఎన్డీఏ కూటమికి ప్రజలు మద్దతు తెలుపుతున్నారని తెలుస్తోందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్​కు అభివృద్ధిని అందించగలవని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. అదే విధంగా వైఎస్సార్‌సీపీ అవినీతి, దుష్టపాలనకు మరోపేరని విమర్శించారు.

అయితే సభలో పాల్గొనడానికి ముందు కూడా మోదీ ట్వీట్ చేశారు. చిలకలూరి పేట బహిరంగ సభలో పాల్గొంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. చంద్రబాబు, పవన్​తో కలిసి పల్నాడు బహిరంగ సభలో పాల్గొంటున్నట్టు ట్వీట్​లో పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ఏపీ ప్రజల ఆశీర్వాదం కోరుకుంటోందన్నారు. ఏపీ అభివృద్ధికి కూటమి పని చేస్తుందని స్పష్టం చేశారు. ఏపీ ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తామని తెలిపారు.

ట్రెండింగ్​లో టీడీపీ, జనసేన, బీజేపీ: మరోవైపు ప్రజాగళం సభతో టీడీపీ, జనసేన, బీజేపీ విన్నింగ్ (TDPJSPBJPWinning) అనే హ్యాష్ ట్యాగ్ సామాజిక మాధ్యమం ఎక్స్​లో ట్రెండింగ్​లో ఉంది. అదే విధంగా ఏపీ వెల్​కమ్స్ నరేంద్ర మోదీ (APWelcomesNamo) అనే హ్యాష్ ట్యాగ్, పవన్ కల్యాణ్​ (Pawan Kalyan) పేరు​ కూడా ట్రెండ్ అవుతోంది.

అభివృద్ధి చెందిన ఏపీ కావాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలి: ప్రధాని మోదీ

PM Modi Meeting With Chandrababu and Pawan Kalyan: సభ అనంతరం ప్రధాని మోదీతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్​లు భేటీ అయ్యారు. సభ బాగా జరిగిందని, ప్రజల్లో చాలా ఉత్సాహం ఉందని ప్రధాని వ్యాఖ్యానించారని నేతలు తెలిపారు. ఎన్డిఏ కూటమి గ్రాండ్ సక్సెస్ అవుతుందని మోదీ అభిప్రాయ పడ్డారు. చంద్రబాబు అరెస్టు ఘటనపైనా, ఆయన ఆరోగ్యం పైనా తెలుగుదేశం అధినేతతో మోదీ మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను ప్రధానికి ఇరువురు నేతలు వివరించారు. రాష్ట్రంలో వ్యవస్థల విధ్వంసంపై పలు అంశాలు ఉదహరిస్తూ ప్రధాని దృష్టికి చంద్రబాబు, పవన్ తీసుకువెళ్లారు.

రాష్ట్రంలో రామరాజ్య స్థాపన జరుగుతుంది: పవన్ కల్యాణ్‌

శాండ్‌, ల్యాండ్‌, వైన్‌, మైన్‌, అన్ని రంగాల్లో సీఎం జగన్ దోపిడీ: చంద్రబాబు

Last Updated : Mar 17, 2024, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.