ETV Bharat / politics

వేములవాడ రాజన్న సన్నిధిలో ప్రధాని - కోడె మొక్కులు చెల్లించుకున్న మోదీ - PM MODI VISITS VEMULAWADA TEMPLE - PM MODI VISITS VEMULAWADA TEMPLE

PM Modi At Vemulawada Rajanna Temple : రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ ప్రచారం సాగిస్తోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ మరోసారి తెలంగాణకు ఎన్నికల ప్రచారాన్ని విచ్చేశారు. మొదటగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేములవాడలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు.

PM Modi Telangana Election Campaign
PM Modi Telangana Election Campaign (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 8, 2024, 10:33 AM IST

Updated : May 8, 2024, 1:32 PM IST

వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయంలో ప్రధాని మోదీ పూజలు (ETV Bharat)

PM Modi Visits Vemulawada Rajanna Temple : తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ప్రధాని మోదీ పర్యటించారు. ఈరోజు (మే 8వ తేదీ) ఉదయం ప్రధాని మోదీ వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు. మొదటగా రాజన్న ఆలయంలో కోడె మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్నకు కోడె మొక్కులు చెల్లిస్తే కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం.

భక్తులు అత్యంతంగా విశ్వసించే కోడె మొక్కులను మోదీ కూడా చెల్లించుకున్నారు. అనంతరం రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలను నిర్వహించారు. మోదీకి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు, వేద ఆశీర్వచనాన్ని ఇచ్చారు. రాజన్న ఆలయ ఆవరణలో భక్తులకు పీఎం మోదీ అభివాదం చేశారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. వేములవాడ, వరంగల్​లో జరిగే బహిరంగ సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.

Last Updated : May 8, 2024, 1:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.