PCC Chief Sharmil fire on Jagan : ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం దిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్తను హత్య చేస్తే దిల్లీ వెళ్లి ధర్నా చేస్తానంటున్న జగన్ సొంత బాబాయి కేసులో న్యాయం కోసం దిల్లీలో ఎందుకు ఆందోళనకు దిగలేదని నిలదీశారు.
ఇంకా ఉచిత బస్సు పథకం ఎందుకు అమలు చేయలేదు: షర్మిల - YS Sharmila Question to Govt
ఏది విత్తుతారో అదే కోస్తారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, షర్మిల అన్నారు. జగన్ హత్యా రాజకీయాలు చేశారని, సొంత చెల్లెళ్లకు వెన్నుపోటు పొడిచారని ఆమె ఆరోపించారు. బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యకు గురైతే జగన్ ఎందుకు ఢిల్లీలో ధర్నా చేయలేదని ఆమె ప్రశ్నించారు. హత్య చేసిన వారితో జగన్ తిరుగుతున్నారని, ఏదీ పట్టించుకోని జగన్... ఇప్పుడు వైఎస్సార్సీపీ కార్యకర్తలు చంపుకొంటే దిల్లీలో ధర్నా చేస్తారా? అని నిలదీశారు. అసెంబ్లీలో ఉండకుండా మీరు ఏం చేస్తారని ప్రశ్నించారు. వినుకొండలో జరిగిన హత్య వ్యక్తిగత కారణాలతో జరిగిందే తప్ప పొలిటికల్ మర్డర్ కాదన్న షర్మిల... పోలీసులు ఇలాంటి హత్యలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని మండిపడ్డారు.
పోలవరానికి డబ్బులు ఇచ్చేసాం అంటే.. ఇక ఇవ్వరనుకోవాలా అని కేంద్రాన్నుద్దేశించి షర్మిల ప్రశ్నించారు. రాజధాని కట్టుకోవడానికి లక్ష కోట్ల రూపాయలు అవుతుందని, రాజధాని మాటేంటని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ లేదనీ నిన్న ఒక మంత్రి అన్నారని, విశాఖ ఉక్కు ఉద్యోగుల జీతాలు ఇవ్వాలన్నా భూములు అమ్ముకుంటున్నారన్నారని పేర్కొన్నారు. రైల్వే జోన్ భూముల విషయంలో బీజేపీ, వైఎస్సార్సీపీ టెన్నిస్ ఆడుకున్నాయని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీల మాటేంటని ప్రశ్నించారు. కడప స్టీలు ఫ్యాక్టరీ ఎడారిలా తయారైందని, రాష్ట్రానికి ప్రత్యేకహోదా తెచ్చే బాధ్యత చంద్రబాబు తీసుకోవాలని కోరారు. వర్షాలు ఏపీలో బీభత్సం సృష్టిస్తున్నాయని, లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని అన్నారు. చితికిపోయిన రైతుల మీద పిడుగు పడ్డట్టయిందన్నారు. గత ఐదేళ్లు జగన్ నిర్లక్ష్యంతో రైతులు చితికిపోయారన్నారు. రాజశేఖరరెడ్డి మొదలెట్టిన జలయజ్ఞాన్ని జగన్ విస్మరించారన్నారు. ప్రాజెక్టుల మెయింటెనెన్స్ లేక గేట్లు ఊడి నదుల్లో తేలడం చూశామతి షర్మిల తెలిపారు. రైతులు దారుణంగా నష్టపోయారని, రుణమాఫీ చేసి ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం రైతులకు నష్టరిహారం అందించాలని షర్మిల డిమాండ్ చేశారు.
తల్లికి వందనంపై మేం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వైఎస్సార్సీపీ నేతలకు కోపం ఎందుకు?: షర్మిల
'వైనాట్ కాంగ్రెస్'- పార్టీ పునరేకీకరణ దిశగా షర్మిల - Sharmila focus on YSRCP cadre