ETV Bharat / politics

అభ్యర్థుల ఎంపికపై పవన్ కసరత్తు - ఈనెల 30 నుంచి ఎన్నికల ప్రచారం - Pawan Kalyan Election Campaign - PAWAN KALYAN ELECTION CAMPAIGN

Pawan Kalyan to Start Election Campaign From March 30: సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో జనసేన పెండింగ్‌ స్థానాలపై ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ కసరత్తు ముమ్మరం చేశారు. అవనిగడ్డ, పాలకొండ, విశాఖ అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల ఖరారుపై దృష్టి సారించారు.

Pawan Kalyan to Start Election Campaign From March 30

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 27, 2024, 7:09 PM IST

Pawan Kalyan to Start Election Campaign From March 30: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల సన్నాహాలు ప్రారంభించారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయించిన 21 సీట్లలో 18 మంది అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన మూడు ఎమ్మెల్యే స్థానాలతో పాటుగా మచిలిపట్నం ఎంపీ స్థానానికి అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కసరత్తు ప్రారంభించారు.

ఎంపీ బాలశౌరితో పవన్‌ కల్యాణ్‌ భేటీ: పెండింగ్‌ స్థానాల అభ్యర్థలను ప్రకటించేందుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కసరత్తు ప్రారంభించారు. అవనిగడ్డ, పాలకొండ, విశాఖ అసెంబ్లీ స్థానాలతో పాటుగా మచిలీపట్నం పార్లమెంట్‌ స్థానానికి పెండింగ్​లో ఉంచారు. ఈ నేపథ్యంలో ఆయా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డారు. తాజాగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరితో పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. అలాగే విజయవాడ పశ్చిమ సీటును ఆశిస్తున్న పోతిన మహేష్‌ సైతం పవన్‌ను కలిశారు. వారితో పాటుగా వివిధ నియోజకవర్గాల నేతలతో సమావేశమై అక్కడి రాజకీయ పరిస్థితులపై చర్చించారు. మరో రెండు రోజుల్లో అభ్యర్థులను ఫైనల్‌ చేసేందుకు పవన్ కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థులను ప్రకటించిన అనంతరం ఈనెల 30న పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు.

పవన్ కల్యాణ్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం: వర్మ - SVSN Varma met Pawan Kalyan

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి భేటీ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి భేటీ అయ్యారు. ఎన్డీయే కూటమిలో భాగంగా ఆయన ఒంగోలు పార్లమెంటుకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ను మాగుంట మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు రియాజ్ తో కలిసి పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. జిల్లా రాజకీయాల గురించి కాసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత తిరుపతి లోక్ సభ స్థానం బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ పవన్ కళ్యాణ్ ను కలిశారు. పొత్తులో భాగంగా తిరుపతి లోక్ సభ స్థానాన్ని బీజేపీకి కేటాయించగా.. అక్కడ వరప్రసాద్ ను ఆ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. దీంతో ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
పవన్ కల్యాణ్​ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఫిక్స్ - పిఠాపురం నుంచే సమరశంఖం - Pawan Kalyan Election Campaign

టీడీపీ, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేయబోతున్న 21 శాసనసభ స్థానాలకు సంబంధించి ఇప్పటి వరకు 18 మంది అభ్యర్థుల పేర్లను జనసేన ప్రకటించింది. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, విశాఖ దక్షిణ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతుంది. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే.

జనసేనకు పార్టీకి రూ. 10 కోట్ల విరాళమిచ్చిన పవన్ కల్యాణ్ - Pawan Kalyan Donates Rs 10 Crores

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.