ETV Bharat / politics

మద్యం దోపిడీతో రూ.30 వేల కోట్లు దోపిడీ - అలాంటివాళ్లను వదిలేస్తే ఎలా?: పవన్ కల్యాణ్ - Pawan on Liquor Irregularities

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 25, 2024, 9:06 AM IST

Pawan Kalyan on Liquor Irregularities : గత ప్రభుత్వ మద్యం దోపిడీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. కోట్ల మంది జీవితాలతో మాజీ సీఎం జగన్, వారి బృందం ఆడుకుందని ఆరోపించారు. అలాంటి వాళ్లను స్వేచ్ఛగా వదిలేస్తే ఎలా అని ప్రశ్నించారు. దీనిపై సమాధానం చెప్పాల్సి వస్తుందనే వారు శాసనసభకు రాకుండా పారిపోయారని పవన్ విమర్శించారు.

Pawan Kalyan on Liquor Irregularities
Pawan Kalyan on Liquor Irregularities (ETV Bharat)

Pawan Kalyan Speech in Assembly : క్లాప్‌మిత్రలకు, పంచాయతీల్లో పనిచేసేవారికి జీతాల్లేవని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక విద్యార్థులు నలిగిపోతున్నారని చెప్పారు. రాష్ట్ర ఖజానాలో సొమ్ములేదని, కానీ నాసిరకం మద్యం ద్వారా కోట్లమంది జీవితాలతో ఆడుకున్న మాజీ సీఎం జగన్, ఆయన బృందం చేతుల్లోకి రూ.30,000ల కోట్లు వెళ్లిపోయాయని ఆరోపించారు. అలాంటివారిని స్వేచ్ఛగా వదిలేస్తే ఎలా అని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు.

White Paper on Excise Department : ఒక చిన్నపాటి ఉద్యోగి లంచం తీసుకుంటే ఏసీబీ కేసు, శాఖాపరమైన విచారణ చేయిస్తున్నామని పవన్ కల్యాణ్ అన్నారు. అలాంటిది రాష్ట్ర ఖజానాకు రూ.వేల కోట్ల నష్టం కలిగించిన జగన్, ఇతరులు శిక్ష పడకుండా ఎలా తప్పించుకుంటారని ప్రశ్నించారు. దాన్ని పగ, ప్రతీకారం అనే కోణంలో చూడకూడదని స్పష్టం చేశారు. రూ.వేల కోట్లు దోచుకున్నవాళ్లను వదిలేస్తే, ఉద్యోగులు, ప్రజలకు మనం నైతికంగా ఎలాంటి బలాన్ని ఇవ్వగలం? అని అన్నారు. పారదర్శక పాలన అందిస్తున్నామనే భావన వారికి కల్పించాలని పేర్కొన్నారు. మద్యం దోపిడీపై సమాధానం చెప్పాల్సి వస్తుందనే భయంతోనే వైఎస్సార్సీపీ సభ్యులు సభకు రాకుండా పారిపోయారని పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు.

దోపిడీ భారీగా ఉంది - లోతైన విచారణ చేయాలి : ప్రాథమికంగా మద్యం దోపిడీ రూ.18,861 కోట్లని చెబుతున్నా, సభ్యులు చెబుతున్నట్లు రూ.30,000ల కోట్లకు పైగానే ఉంటుందని పవన్‌ కల్యాణ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలకు చేరాల్సిన ఈ సొమ్మంతా ఎటు పోయిందో లోతైన విచారణ చేసి తేల్చాలన్నారు. బడ్జెట్లో కేంద్రం ఏపీకిి రూ.15,000ల కోట్లు ఇస్తే మనమంతా ఎంతో ఆనందపడ్డామని చెప్పారు. కానీ అక్రమ మద్యం అమ్మకాల ద్వారా దోచుకున్న వాటిలో రూ.15,000ల కోట్లు ప్రభుత్వ ఖజానాకు వచ్చి ఉంటే, అమరావతి రాజధానికి ఇబ్బంది ఉండేది కాదన్నారు. పోలవరం చాలావరకు పూర్తయ్యేదని పవన్ కల్యాణ్ వెల్లడించారు.

మద్యనిషేధం చాలా కష్టం : ఏపీలో మద్యనిషేధం చాలా కష్టమని పవన్ కల్యాణ్ అన్నారు. యానాం, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా సరిహద్దులు ఉన్నాయని చెప్పారు. అందుకే అమ్మకాలను క్రమబద్ధీకరించాలన్నారు. వ్యసనాన్ని తగ్గించేందుకు కొంత బడ్జెట్‌ కేటాయించాలని తెలిపారు. మద్యాన్ని ఆదాయంగానే చూడకుండా, 10 శాతం నిధుల్ని డీఅడిక్షన్‌ కేంద్రాలకు ఇవ్వాలని పవన్‌ కల్యాణ్ సూచించారు.

జగన్‌ ఎన్నేళ్లు జైలుకెళ్లాలి : జేబ్రాండ్‌ మద్యం తాగి అనారోగ్యం పాలై, నెల్లూరు ఆసుపత్రుల పడకలన్నీ నిండిపోయాయని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి పేర్కొన్నారు. దిల్లీలో రూ.200 కోట్ల అక్రమాలకే సీఎం, డిప్యూటీ నెలల తరబడి జైలులో ఉంటే, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ ఎన్నేళ్లు జైలుకు వెళ్లాలని ప్రశ్నించారు. గతంలో విశాఖ కేజీహెచ్‌లో పరిశీలిస్తే, గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో పడకలన్నీ చీప్‌లిక్కర్‌ తాగినవారితో నిండిపోయాయని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్​రాజు అన్నారు. గత సర్కార్ హయాంలో మద్యం అమ్మకాల ద్వారా రూ.30,000ల కోట్ల దోపిడీ జరిగిందని పురందేశ్వరి కేంద్రానికి లేఖ రాశారని చెప్పారు. శ్వేతపత్రంలో రూ.3,113 కోట్లుగా అంచనా వేయడం వాస్తవదూరమని ఆయన వ్యాఖ్యానించారు.

గత ప్రభుత్వ హయాంలో కొన్ని మద్యం నమూనాలను పరీక్ష చేయిస్తే, నాసిరకంగా తేలాయని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తెలిపారు. 54 శాతం కిడ్నీ, 53 శాతం లివర్‌ వ్యాధులకు కారణమనేది నిజమని చెప్పారు. లావాదేవీలన్నీ నగదు రూపంలో నడిపించడం వెనక పెద్దకుంభకోణం ఉందని, దీనిపైనా విచారణ చేయాలని ఆయన అన్నారు. ఆనాటి సర్కార్ హయాంలోని మద్యం బ్రాండ్లను ఇప్పటికీ అనుమతిస్తున్నారని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. వాటన్నింటినీ నిలిపేయాలని సూచించారు. అన్ని డిస్టిలరీలనూ మూసేసి, ఒక్క యూనిట్‌ నుంచే నాసిరకం సరకు సరఫరా చేశారని ఆరోపించారు. నాటి ముఖ్యమంత్రికి నాసిరకం మద్యం తాగి ఆరోగ్యం పాడైన కుటుంబాల ఉసురు తగులుతుందని బొలిశెట్టి వ్యాఖ్యానించారు.

"పాలకుడు ఎలా ఉండకూడదో గత ఐదేళ్లలో చూశాం- మద్యం సొమ్మంతా వైఎస్సార్సీపీ నేతల జేబుల్లోకి వెళ్లింది" - excise department white paper

లిక్కర్ స్కాంపై సీబీసీఐడీతో విచారణ చేయించి దోషులను కఠినంగా‌ శిక్షించాలి: బీజేపీ ఎమ్మెల్యేలు - BJP MLAs on Liquor Scam

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.