ETV Bharat / politics

ఆ రెండు స్థానాల్లో జనసేన పోటీ - ఉమ్మడి మేనిఫెస్టోతోనే ఎన్నికలకు : పవన్ కల్యాణ్

Pawan Kalyan's statement : 2024 ఎన్నికల్లో జగన్​ను ఓడించడమే లక్ష్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తెలుగుదేశంపై పొత్తుతో మాట్లాడుతూ ఎన్ని సీట్లు తీసుకోవాలో తనకు తెలుసని చెప్పారు. తెలుగుదేశం 2 స్థానాలు ప్రకటించినందున రాజోలు, రాజానగరం సీట్లలో జనసేన పోటీచేస్తుందని పవన్‌ ప్రకటించారు.

pawan_kalyan_mangalagiri
pawan_kalyan_mangalagiri
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 26, 2024, 12:47 PM IST

Pawan Kalyan's statement : ఒంటరిగా వెళ్తే కొన్ని సీట్లు గెలుస్తాం కానీ, ప్రభుత్వంలోకి వెళ్లలేం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్యాడర్​కు స్పష్టం చేశారు. టీడీపీతో కలిస్తే బలవంతులమవుతాం, రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తున్నాం, ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుంది అని పవన్‌ తెలిపారు. పొత్తుల్లో ఒక మాట అటూ ఇటూ ఉంటుంది, ఎన్ని స్థానాలు తీసుకోవాలో నాకు తెలుసు అని పేర్కొన్నారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ వైఎస్ జగన్‌కు ఊరంతా శత్రువులే, వైఎస్సార్సీపీ నేతలకు కష్టమొస్తే నా వద్దకు రండి అని అన్నారు.

సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధి ఖరారు - ధ్రువీకరించిన అధిష్టానం

ఒంటరిగా వెళ్తే కొన్ని సీట్లు గెలుస్తాం కానీ, ప్రభుత్వంలోకి వెళ్లలేం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్యాడర్​కు స్పష్టం చేశారు. టీడీపీతో కలిస్తే బలవంతులమవుతాం, రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తున్నాం, ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుంది అని పవన్‌ తెలిపారు. పొత్తుల్లో ఒక మాట అటూ ఇటూ ఉంటుంది, ఎన్ని స్థానాలు తీసుకోవాలో నాకు తెలుసు అని పేర్కొన్నారు. పొత్తు దెబ్బతినేలా కొందరు మాట్లాడడం సరికాదన్నారు. జగన్‌పై తనకు వ్యక్తిగత కక్ష లేదు కానీ, జగన్ ప్రభుత్వం 2024లో మళ్లీ అధికారంలోకి రాకూడదన్నదే తదుపరి కర్తవ్యమని పవన్‌ స్పష్టం చేశారు. తెలుగుదేశం 2 సీట్లు ప్రకటించినందున తాను కూడా 2 సీట్లు ప్రకటిస్తున్నానంటూ రాజోలు, రాజానగరం సీట్లలో జనసేన పోటీచేస్తుందని పవన్‌ ప్రకటించారు.

TDP Janasena Alliance First Meeting: టీడీపీ-జనసేన 'కీ'లక భేటీ.. విజయమే లక్ష్యంగా ఉమ్మడి కార్యాచరణ..!

వచ్చే ఎన్నికల్లో జనసేన రాజ్యాధికారం సాధించబోతోందన్న పవన్ మండపేట సీటుకు టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంపై జనసేన నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. ఇది పొత్తు ధర్మం కాదనేది నా అభిప్రాయం అని చెప్పారు. ఇలాంటివి భవిష్యత్తులో జరగనివ్వనని క్యాడర్​కు హామీ ఇస్తున్నానన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని, వాటిని దృష్టిలో ఉంచుకొని తాను మాట్లాడాలని పవన్‌ చెప్పారు.

సుపరిపాలన అందించడంలో జగన్‌ విఫలమయ్యాడని పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. మద్యపానం నిషేధిస్తామని చెప్పి సారా వ్యాపారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఇంటికి పంపిద్దామని పిలుపు నిచారు. కనీసం చెల్లిని కూడా లెక్కచేయని జగన్ లాంటి వ్యక్తితో పోరాడుతున్నామని గుర్తు చేశారు. ఎన్ని స్థానాలు తీసుకోవాలనేదానిపై జనసేనకు అవగాహన ఉందని, ఒంటరిగా వెళ్తే కొన్ని సీట్లు గెలుస్తాం కానీ ప్రభుత్వంలోకి వెళ్లలేం అని పేర్కొన్నారు. టీడీపీతో కలిస్తే బలవంతులమవుతాం, స్థానిక ఎన్నికల్లో మూడో వంతు సీట్లు సాధిస్తాం అని చెప్పారు. జగన్ ప్రభుత్వం 2024లో మళ్లీ అధికారంలోకి రాకూడదని స్పష్టం చేశారు.

టీడీపీ, జనసేన పొత్తు కొత్త శకానికి నాంది - రాష్ట్రం నేరస్థులు, హంతకుల చేతిలో ఉంది: బాలకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.