ETV Bharat / politics

'లోకేశ్​ను గెలిపించండి'- మంగళగిరిలో ఎన్టీఆర్ కుటుంబం ఎన్నికల ప్రచారం - NTR Family Campaign for Nara Lokesh - NTR FAMILY CAMPAIGN FOR NARA LOKESH

NTR Family Campaign for Nara Lokesh: టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్​కు మద్దతుగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు. మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న లోకేశ్​కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

NTR_Family_Campaign_for_Nara_Lokesh
NTR_Family_Campaign_for_Nara_Lokesh (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 7, 2024, 12:37 PM IST

Updated : May 7, 2024, 1:29 PM IST

NTR Family Campaign for Nara Lokesh: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా లోకేశ్​కు మద్దతుగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు దాదాపు 15 మంది లోకేశ్​కు మద్దతుగా నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు విడుదల చేసిన సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ఇంటింటా ప్రచారం చేపట్టారు. లోకేశ్​ గెలిస్తేనే మంగళగిరి అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ప్రజలకు వివరించారు. స్థానికులతో కలిసిపోయి వారి సమస్యలను వింటూ ముందుకు సాగారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే సమస్యలన్నీ త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

'లోకేశ్​ను గెలిపించండి'- మంగళగిరిలో ఎన్టీఆర్ కుటుంబం ఎన్నికల ప్రచారం (ETV Bharat)

"లోకేశ్ ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చారు. నియోజకవర్గంలో పలు సంక్షేమ కార్యక్రమాలను వ్యక్తిగత నిధులతో చేపట్టారు. మంగళగిరి ఓ మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చెందాలంటే లోకేశ్​ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం." - గారపాటి శ్రీనివాస్, ఎన్టీఆర్ మనవడు

జనం కోసం జనసైనికుడు - మీ కోసం ఎందాకైనా పోరాడతాడు: చిరంజీవి - chiranjeevi support to pawan kalyan

గత ఎన్నికల్లో ఓడినప్పటికీ నియోజకవర్గంలో లోకేశ్ విస్తృతంగా పర్యటిస్తూ వచ్చారు. మంగళగిరిలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ కార్యకర్తలకు, ప్రజలకు ఏం కావాలో కనుక్కుని ఆ అవసరాలు తీర్చుతున్నారు. దీంతోపాటు తన వ్యక్తిగత నిధులతో నియోజకవర్గంలో 27 రంగాల సంక్షేమ కార్యక్రమాలు లోకేశ్ చేపట్టారు. తోపుడుబండ్లు ఉచితంగా అందించి చిరు వ్యాపారులకు తోడుగా నిలిచారు. స్త్రీ శక్తి పేరుతో నియోజకవర్గంలో మహిళల కోసం కార్యక్రమాలు చేపట్టారు. వారికి నైపుణ్య శిక్షణ ఇవ్వటంతో పాటు ఉపాధి మార్గాలు చూపించారు. అందుకు అవసరమైన ఆర్థిక సాయం అందించారు. లోకేశ్​తో పాటు నారా బ్రాహ్మణి కూడా నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. వివిధ వర్గాల వారితో సమావేశాలు నిర్వహించారు.

నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి ఎదురుగాలి వీస్తోంది. వైఎస్సార్సీపీ నుంచి బరిలో దిగిన మురుగుడు లావణ్యకు ఆ పార్టీ మాజీ ఇంఛార్జి గంజి చిరంజీవి సహాయ నిరాకరణ పెద్ద మైనస్​గా మారింది. దీనికితోడు వైఎస్సార్సీపీ దుష్ట పాలనపై విసిగిపోయిన ప్రజలు సంక్షేమం ముందుడుగు పడాలన్నా, రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు పోవాలన్నా కూటమి విజయం తప్పనిసరనే అభిప్రాయంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి అధికారం పట్టం కట్టే సూచనలు కన్పిస్తున్నాయి.

న్యాయానికి, నేరానికి జరుగుతున్న పోరాటం - కడపలో గెలిచేది నేనే: షర్మిల - YS Sharmila Interview

Last Updated : May 7, 2024, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.