ETV Bharat / politics

జులై 4న విద్యా సంస్థల భారత్‌ బంద్‌ - విద్యార్థి సంఘాల పిలుపు - bharath bandh on july 4th

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 2, 2024, 3:00 PM IST

Updated : Jul 2, 2024, 3:33 PM IST

NSUI Calls For Educational Bharat Bandh : నీట్‌ పేపర్‌ లీకేజీ విషయంలో ఎన్‌ఎస్‌యూఐ జులై 4న విద్యా సంస్థల భారత్‌ బంద్‌ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ పిలుపునిచ్చారు. అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

NSUI Calls For Educational Bharat Bandh On July 4th
NSUI Calls For Educational Bharat Bandh On July 4th (ETV Bharat)

NSUI Calls For Bharat Bandh On July 4th : నీట్‌ పేపర్‌ లీకేజీకి నిరసనగా ఈ నెల 4న విద్యా సంస్థల భారత్‌ బంద్‌ నిర్వహిస్తున్నట్లు అందుకూ ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ పిలుపునిచ్చారు. నీట్‌ పేపర్‌ లీకేజీపై కేంద్రం ఇప్పటివరకు స్పందించలేదని మండిపడ్డారు. పేపర్ లీకేజీపైన కేంద్ర మంత్రులు కిషన్​రెడ్డి, బండి సంజయ్‌పైన బాధ్యత ఉందని తెలిపారు.

ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చి నీట్‌ పరీక్షను రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. కాగా కేంద్రం తీసుకువచ్చిన కొత్త చట్టాలను స్వాగతిస్తున్నాం అన్న ఆయన వాటిని కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. మిగతా పరీక్షలపై కూడా అనుమానం కలుగుతుందని వ్యాఖ్యానించారు.

"నీట్ పరీక్ష పేపర్ లీకేజితో కేంద్రం నిర్వహించే ప్రతి పరీక్షపైన అనుమానం కలుగుతోంది. నీట్ పేపర్ లీకేజీపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. చలో రాజ్​భవన్ వంటి అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాం. ఈ నెల 4న విద్యా సంస్థల భారత్ బంద్ నిర్వహిస్తున్నాం. బంద్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్​రెడ్డి, బండి సంజయ్​పైన బాధ్యత ఉంది. నరేంద్ర మోదీ మీద ఒత్తిడి తీసుకువచ్చి నీట్ పరీక్షను రద్దు చేయించి కొత్తగా నిర్వహించాలి. చట్టాలను తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నాం. చట్టాలను కూడా అమలు చేసేలా కేంద్రంపైన బాధ్యత ఉంది." - బల్మూరి వెంకట్‌, ఎమ్మెల్సీ

విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్​ వద్ద ఏబీవీపీ ఆందోళన - పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ - ABVP Leaders Protest

కేంద్ర మంత్రుల హస్తం : నీట్‌ పేపర్ లీకేజీపై ప్రధాని నరేంద్ర మోదీ నోరు మెదకపోవడం ఆశ్చర్యకరమని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ అన్నారు. నీట్‌ పరీక్ష లీకేజీ వెనుక కేంద్ర మంత్రుల ప్రమేయముందని ఆరోపించారు. పేపర్ లీకేజీ అవకతవకలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జులై 4న దేశ వ్యాప్తంగా కేజీ టూ పీజీ వరకు విద్యా సంస్థలను బంద్‌ చేస్తున్నామని విద్యా సంస్థలు వారి పోరాటానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

జాబ్ నోటిఫికేషన్ల కోసం ఆందోళన - టీజీపీఎస్సీ ఆఫీస్‌ను ముట్టడించిన నిరుద్యోగులు

నీట్‌ పరీక్ష రద్దుపై డిమాండ్‌ - నిర్వహణ బాధ్యత రాష్ట్రాలకు అప్పగించాలన్న విద్యార్థి సంఘాలు - Protest Against NEET in Telangana

Last Updated : Jul 2, 2024, 3:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.