ETV Bharat / politics

ఏపీలో కూటమి జోరు - రాజమండ్రి గ్రామీణంలో తొలి విజయం - NDA CANDIDATES WINNING IN AP

NDA CANDIDATES WINNING IN AP: ఆంధ్రప్రదేశ్​ ఎన్నికల్లో కూటమి దూసుకుపోతోంది. అసెంబ్లీ ఫలితాల్లో టీడీపీకి తొలి విజయం నమోదు చేసింది. రాజమండ్రి గ్రామీణంలో బుచ్చయ్యచౌదరి ఘనవిజయం సాధించారు. 50 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో బుచ్చయ్యచౌదరి కొనసాగుతున్నారు. ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతుండటంతో బుచ్చయ్యచౌదరి మెజారిటీ మరింత పెరగనుంది. మరోవైపు రాజమహేంద్రవరం నగరంలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు 55 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

nda candidates win
nda candidates win (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 4, 2024, 12:30 PM IST

Updated : Jun 4, 2024, 1:33 PM IST

NDA CANDIDATES WINNING IN AP: ఆంధ్రప్రదేశ్​ ఎన్నికల్లో తెలుగుదేశం విజయపరంపరం మొదలైంది. రాజమండ్రి గ్రామీణంలో తొలి విజయం నమోదు చేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. రాజమండ్రి గ్రామీణంలో బుచ్చయ్యచౌదరి ఘనవిజయం సాధించారు. 50 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో బుచ్చయ్యచౌదరి కొనసాగుతున్నారు. ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతుండటంతో బుచ్చయ్యచౌదరి మెజారిటీ మరింత పెరగనుంది.

55 వేల ఓట్ల మెజారిటీతో ఆదిరెడ్డి వాసు విజయం: రాజమహేంద్రవరం నగరంలో తెలుగుదేశం అభ్యర్థి ఆదిరెడ్డి వాసు విజయం సాధించారు. 55 వేల ఓట్ల మెజారిటీతో ఆదిరెడ్డి వాసు విజయం నమోదైంది. అనపర్తిలో బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కొవ్వూరులో టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు విజయం సాధించారు. గాజువాకలో టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి నిమ్మల 69 వేల ఓట్ల ఆధిక్యంతో, ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ గెలుపొందారు.

జిల్లాలకు జిల్లాలే క్లీన్ స్వీప్‌ - భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోన్న కూటమి - Hello AP Bye Bye YCP

కూటమి నేతల జోరు: మాచర్లలో 8వ రౌండ్‌ ముగిసేసరికి జూలకంటి బ్రహ్మారెడ్డి 18,737 ఓట్ల ఆధిక్యంలో పిన్నెల్లిపై ముందంజలో ఉన్నారు. బాపట్లలో తొమ్మిదో రౌండ్‌ ముగిసేసరికి టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మకు 16,397 ఓట్ల ఆధిక్యత ఉంది. సత్తెనపల్లిలో ఎనిమిదో రౌండ్‌లో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణకు 16,417 ఓట్ల ఆధిక్యం లభించింది. మంగళగిరిలో నాలుగో రౌండ్‌ పూర్తయ్యేసరికి లోకేశ్​కు 15,114 ఓట్ల ఆధిక్యం, విజయనగరం లోక్‌సభ టీడీపీ అభ్యర్థి అప్పలనాయుడికి 35,116 ఓట్ల ఆధిక్యం కొనసాగుతోంది.

కుప్పంలో చంద్రబాబుకు 5 రౌండ్లు ముగిసేసరికి 9,088 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పూతలపట్టులో టీడీపీ అభ్యర్థి మురళీమోహన్‌కు 6 రౌండ్లలో 9,160 ఓట్ల ఆధిక్యం, గన్నవరంలో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు 6 రౌండ్లలో 20 వేల మెజార్టీ, రాప్తాడులో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత 10 రౌండ్లలో 9,460 ఓట్ల ఆధిక్యం, ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ 10 రౌండ్లలో 12,206 ఓట్ల ఆధిక్యం, సంతనూతలపాడులో టీడీపీ అభ్యర్థి విజయ్‌కుమార్‌కు 8 రౌండ్లలో 13,897 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.

ఏపీలో కూటమి సునామీ - 150కు పైగా స్థానాల్లో దూసుకుపోతున్న అభ్యర్థులు - AP Election Result

Last Updated : Jun 4, 2024, 1:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.