TDP Janasena BJP Leaders Meeting in Chandrababu House : తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతలు సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. సమావేశం దాదాపు రెండు గంటల పాటు సాగింది. చంద్రబాబుతో జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, మాజీమంత్రి సిద్ధార్థ నాథ్ సింగ్ సమావేశమై పలు కీలక అంశాలు చర్చించారు.
ఉమ్మడి మేనిఫెస్టో, తదుపరి ఎన్నికల ప్రచార శైలి, భవిష్యత్తు కార్యాచరణ, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించన్నట్లు సమాచారం. పరస్పర మార్పు కోరుకుంటున్న వివిధ స్థానాలపైనా కూటమి నేతల మధ్య చర్చ సాగిన్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభల నిర్వహణ పైన చర్చించినట్లు సమాచారం. అధికార పార్టీ అండతో చేపడుతున్న ఫోన్ ట్యాపింగ్, కొందరు ఉన్నతాధికారుల ఏకపక్ష వైఖరి తదితర అంశాలపైనా చర్చ జరిగిన్నట్లు నేతలు తెలుస్తోంది.
బూత్, అసెంబ్లీ, పార్లమెంట్ పరిధిలో సమావేశాలు జరపాలని ఎన్డీఏ నేతల నిర్ణయించారు. ప్రచారం, ఎన్నికల నిర్వహణ పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేయాలని. ప్రచార వ్యూహం తయారీకి రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఓట్ల బదిలీపై క్షేత్రస్థాయిలో ఫలితాలు వచ్చేలా తీసుకోవాల్సిన చర్యలపై నేతలు చర్చించారు. గోదావరి జిల్లాల్లో కూటమి సభల విజయంపై నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో సాధ్యమైనన్ని ఎక్కువ చోట్ల ఉమ్మడి సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వ అధికార దుర్వినియోగంపై ఎప్పటికప్పుడు ఈసీకి ఫిర్యాదు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కూటమి తరఫున మోదీ, అమిత్ షా, నడ్డా, రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించాలని, 25 లోక్‌సభ, 160కు పైగా అసెంబ్లీ సీట్లలో గెలుపే లక్ష్యంగా ప్రచారం చేయాలని కూటమి నేతలు నిర్ణయించారు.
16, 17 తేదీల్లో చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం - CHANDRABABU PAWAN KALYAN MEETINGS
కోయంబత్తూరు పర్యటన ముగించుకుని ఉండవల్లి చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా ఎన్డీఏ నేతల సమావేశంలో పాల్గొన్నారు. తదుపరి ఎన్నికల ప్రచార శైలి, భవిష్యత్తు కార్యాచరణ, క్షేత్రస్థాయి పరిస్థితులపై నేతలు చర్చించారు. అనపర్తి, ఉండి తదితర స్థానాలపై చర్చ జరిగినట్లు సమాచారం. పరస్పర మార్పు కోరుకుంటున్న వివిధ స్థానాలపైనా కూటమి నేతల చర్చించినట్లు తెలుస్తోంది.
కోనసీమలో జనజాతర - చంద్రబాబు, పవన్ సభలో జనాలే జనాలు - Prajagalam Meeting
Chandrababu, Pawan Kalyan Joint Public Meetigs : ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ ప్రచారాలు జోరందుకున్నాయి. రాజకీయ పార్టీల వారు ప్రజల్లోకి వెళ్లడానికి వ్యూహాలు రచిస్తున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ తొలి దశ ఉమ్మడి ప్రచారం సక్సెస్ జోష్‌తో మలి విడత పర్యటన ఖరారు అయ్యింది. ఈ నెల 16, 17వ తేదీల్లో ఇరువురు నేతలు కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 16వ తేదీన విజయనగరరం, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో ఉమ్మడిగా రోడ్ షో నిర్వహించి బహిరంగ సభలో పాల్గొంటారు. 17న పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో ప్రజాగళం ఉమ్మడి సభలు నిర్వహిస్తారు.