Nara Lokesh Win in Mangalagiri: గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘన విజయం దిశగా దూసుకెళ్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై భారీ ఆదిక్యంగా కొనసాగుతున్నారు. దీంతో మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైనా కూడా మంగళగిరి ప్రజల కష్టాలను తీరుస్తూ వచ్చారు. సమస్యలు తీర్చాలంటూ వచ్చిన ప్రతి ఒక్కరికీ నారా లోకేశ్ భరోసాను ఇచ్చారు.
గత అయిదేళ్లుగా వేలాది మందికి చేయూతనిచ్చారు. మహిళలకు స్వయం ఉపాధి శిక్షణతో పాటు కుట్టుమిషన్లు అందించారు. తాగునీటికి ఇబ్బంది పడుతున్నామంటే ట్యాంకర్లు ఏర్పాటుచేశారు. 29 సంక్షేమ పథకాలను అయిదు సంవత్సరాలుగా సొంత నిధులతో అమలుచేశారు. ఐదేళ్లుగా మంగళగిరి ప్రజల కష్టసుఖాలన్నింటిలోనూ నారా లోకేశ్ పాలుపంచుకున్నారు. తన కుటుంబసభ్యుల్లా భావించి మంగళగిరి ప్రజలకు సేవలందించారు. అధికారంలో లేకపోయినా కూడా మంగళగిరి చేనేత కార్మికుల జీవితాల్లో మార్పుని తీసుకొచ్చారు. మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా చేసేందుకు అనునిత్యం తపించారు.
అమరావతిలో 39 సంవత్సరాల తర్వాత టీడీపీ మంగళగిరిలో విజయం దిశగా దూసుకెళ్తోంది. 1985లో టీడీపీ తరఫున కోటేశ్వరరావు గెలిచారు. 12వ రౌండ్ ముగిసే సరికి మంగళగిరిలో 51వేల ఓట్ల మెజార్టీతో లోకేశ్ కొనసాగుతున్నారు. లోకేశ్ పాత రికార్డులన్నీ తిరగరాస్తున్నారు.
ఏపీలో కూటమి సునామీ - 150కు పైగా స్థానాల్లో దూసుకుపోతున్న అభ్యర్థులు - AP Election Result
పేదరికం లేని మంగళగిరి కోసం: పేదరికం లేని మంగళగిరి కోసం యువనేత నారా లోకేశ్ నిత్యం కృషి చేశారు. తన సేవా హృదయంతో మంగళగిరి ప్రజల హృదయాలను నారా లోకేశ్ గెలుచుకున్నారు. మంగళగిరి ప్రజలు లోకేశ్‌పై ఎంతగానే ప్రేమ, అభిమానం చూపారు. ఈ ఎన్నికల్లో మరిచిపోలేని విజయాన్ని అందించారు.
లోకేశ్ ఎక్కడున్నా మనసంతా మంగళగిరిలోనే : అధికారంలో లేకపోయినా మంగళగిరి నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నారు. యువగళం పాదయాత్ర ప్రారంభించక ముందే నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పాదయాత్ర చేశారు. ప్రతి ఒక్క గడపకు వెళ్లి నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.
జిల్లాలకు జిల్లాలే క్లీన్ స్వీప్ - భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోన్న కూటమి - Hello AP Bye Bye YCP
మంగళగిరి ప్రజలను నారా లోకేశ్ నా కుటుంబసభ్యులుగా భావించారు. యువగళం పాదయాత్రలో ఉన్నప్పుడు కూడా నియోజకవర్గం నుంచి ఎవరు వచ్చినా వారి సమస్యలు తెసుకుని పరిష్కరించారు. ఒక వ్యక్తిగానే ఎంతో అభివృద్ధి చేసిన లోకేశ్‌ను శాసనసభకు పంపాలని మంగళగిరి నియోజకవర్గ ప్రజలు నిర్ణయించుకున్నారు. మంగళగిరిని దేశంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్ది, పేదరికం లేని మంగళగిరిని చూడాలన్నదే తన సంకల్పమని గతంలోనే లోకేశ్ స్పష్టం చేశారు.
తొలి రోజుల్లో ఇలా: స్టాన్‌ఫోర్డ్ వంటి విదేశీ యూనివర్సిటీల్లో చదువుకుని రాజకీయాల్లో ప్రవేశించిన లోకేశ్, తొలి రోజుల్లో కార్యకర్తల సంక్షేమానికి సంబంధించిన వ్యవహారాలకు ఎక్కువగా సమయం వెచ్చించారు. ఎమ్మెల్సీగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిత్యం ప్రజలని కలుస్తూ ఉండేవారు. తరువాత యువగళం ద్వారా ఎంతగానే మమేకమయ్యారు.
ఏపీలో ఎదురులేని కూటమి - విశ్వరూపం చూపించిన చంద్రబాబు - super hit combo