ETV Bharat / politics

'జగన్ హ్యాండ్సప్, వైసీపీ ప్యాకప్' - వైరల్ అవుతున్న నారా లోకేశ్ ట్వీట్

Nara Lokesh Satirical Tweet on CM YS Jagan Comments: ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్​లో సీఎం జగన్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ వ్యాఖ్యలపై నారా లోకేశ్ సెటైరికల్ ట్వీట్ చేశారు. జగన్ హ్యాండ్సప్, వైసీపీ ప్యాకప్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Nara_Lokesh_Satirical_Tweet_on_CM_YS_Jagan_Comments

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 25, 2024, 11:26 AM IST

Updated : Jan 25, 2024, 11:40 AM IST

Nara Lokesh Satirical Tweet on CM YS Jagan Comments: ఓడినా విచారం లేదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ హ్యాండ్సప్ వైసీపీ ప్యాకప్ అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్​లో పోస్ట్ చేశారు. 2024లో జగన్ ఇక ఉండడన్న లోకేశ్, ఈ ఏడాదికి బై బై జగన్ అంటూ ట్వీట్‌ చేశారు.

CM Jagan Comments at India Today Education Summit: కాగా తిరుపతిలో జరిగిన ఇండియా టుడే విద్యాసదస్సులో (India Today Education Summit 2024) పాల్గొన్న జగన్ ముఖాముఖిలో పలు ‌ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చినా తనకు ఎలాంటి విచారమూ లేదని సీఎం వైఎస్ జగన్‌ అన్నారు. ఇప్పటి వరకూ వై నాట్‌ 175 అని, కుప్పంలో కూడా గెలుస్తున్నాం అంటూ సీఎం జగన్ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడిలా ఒక్కసారిగా జగన్ మాట్లాడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది రోజుల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు వరుసగా పార్టీని వీడటం వలనే ఇలా ఓటమి మాట వచ్చిందనే చర్చ నడుస్తోంది.

అంతే కాకుండా ఈ సదస్సులో జగన్ మరిన్ని విషయాలు మాట్లాడారు. తమ కుటుంబాన్ని కాంగ్రెస్‌ పార్టీ చీల్చిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఎప్పుడూ చెత్త రాజకీయాలే చేస్తుందని, విభజించి పాలించడమే ఆ పార్టీ విధానమని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి తాను రాజీనామా చేసినప్పుడు తన బాబాయ్‌ వివేకానందరెడ్డికి మంత్రి పదవిచ్చి పోటీకి నిలిపిందని అన్నారు. ఇక ఇప్పుడు తన సోదరి షర్మిలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా నియమించి మరోసారి కుటుంబాన్ని విడదీసిందన్నారు.

ఎమ్మెల్యే, ఎంపీల ఝలక్​, మాట మార్చిన జగన్ - ఓడిపోయినా విచారం లేదని వెల్లడి!

Nara Lokesh about Amaravati Farmers Protest: కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులకు ఎదురొడ్డి అమరావతి నిలబడిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కొనియాడారు. ప్రజా రాజధాని అమరావతి కోసం 1500 రోజులుగా నియంతపై పోరాడుతున్న రైతులకు ఆయన ఉద్యమాభివందనాలు తెలిపారు. అమరావతి కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించిన లోకేశ్, వారి ఆశయం త్వరలోనే నేరవేరుతుందని అన్నారు. రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం భూమిని త్యాగం చేసిన రైతులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. అధర్మంపై ధర్మం విజయం సాధిస్తుందని లోకేశ్ పేర్కొన్నారు.

Amaravati Farmers Protest Reached 1500 Days: కాగా రాజధానిగా అమరావతే కొనసాగించాలని రైతులు చేస్తున్న పోరాటం 1500 రోజుల మైలురాయిని చేరుకుంది. మూడు రాజధానుల ప్రకటన నాటి నుంచి అమరావతి కోసం రైతుల పోరాటం చేస్తున్నారు. అమరావతి కోసం ప్రభుత్వానికి, పోలీసు బలగాలకు ఎదురొడ్డి పోరాడారు. 2019 డిసెంబర్ 17న అసెంబ్లీలో 3 రాజధానుల ప్రతిపాదించగా, అప్పటి నుంచి నేటి వరకూ నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. రైతుల ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం అనేత ప్రయత్నాలు చేసినా వెనుకడుగు వేయలేదు.

జగన్ మూడు ముక్కలాట - అన్నదాతల మహోద్యమానికి నేటితో 1500 రోజులు

Last Updated : Jan 25, 2024, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.