ETV Bharat / politics

మేనిఫెస్టోలో యువత సంక్షేమానికి పెద్దపీట వేశాం - ఉద్యోగాలతో పాటు స్టార్ట్‌అప్స్‌ను ప్రోత్సహిస్తాం: లోకేశ్ - Nara Lokesh Face to Face with Youth - NARA LOKESH FACE TO FACE WITH YOUTH

Nara Lokesh Face to Face with Youth: జగన్ అనాలోచిత విధానాలతో పరిశ్రమలను తరిమేశారని నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో యువగళం సభలో పాల్గొన్న లోకేశ్ యువతతో ముఖాముఖి నిర్వహించారు. మేనిఫెస్టోలో యువత సంక్షేమానికి పెద్దపీట వేశామని 20 లక్షల ఉద్యోగాలిస్తామని భరోసా ఇచ్చారు. స్టార్ట్‌అప్స్‌ను ప్రోత్సహిస్తామన్నారు.

_nara_lokesh
_nara_lokesh
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 1, 2024, 9:24 PM IST

మేనిఫెస్టోలో యువత సంక్షేమానికి పెద్దపీట వేశాం - ఉద్యోగాలతో పాటు స్టార్ట్‌అప్స్‌ను ప్రోత్సహిస్తాం: లోకేశ్

Nara Lokesh Face to Face with Youth at Yuvagalam Sabha in Nellore: కూటమి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను తెరిపించి యువతకు శిక్షణ ఇస్తామని మంగళగిరి తెలుగుదేశం అభ్యర్థి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. నెల్లూరులో యువగళం సభలో పాల్గొన్న లోకేశ్ యువతతో ముఖాముఖి నిర్వహించారు. జగన్ అనాలోచిత విధానాలతో పరిశ్రమలను తరిమేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో యువత సంక్షేమానికి పెద్దపీట వేశామని 20 లక్షల ఉద్యోగాలిస్తామని భరోసా ఇచ్చారు. స్టార్ట్‌అప్స్‌ను ప్రోత్సహిస్తామన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ సమక్షంలో టీడీపీలో 20 కుటుంబాలు చేరాయి. వైసీపీ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని దోచుకున్నారు- కూటమి విజయంతోనే రాష్ట్రాభివృద్ధి: పవన్ కల్యాణ్ - Pawan Kalyan Varahi Bus Yatra

అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గడపకు తీసుకొస్తాం: కూటమి ప్రభుత్వం రాగానే ఆగిపోయిన అమరావతి పనులను పూర్తిచేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గడపకు చేర్చాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. వాలంటీర్‌ వ్యవస్థను కొనసాగిస్తామని వారి గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామని అన్నారు. వాలంటీర్లను ప్రజాప్రతినిధులతో అనుసంధానిస్తామని తెలిపారు. పీజీ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ అమలు చేస్తామని లోకేశ్ అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం బోర్డు ఉండేదని ఆ బోర్డులోని నిధులను వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని లోకేశ్ ఆరోపించారు. బోర్డులో నిధులు లేక కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల బోర్డును అధికారంలోకి రాగానే తిరిగి పునరుద్ధరిస్తాని తెలిపారు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా ఉద్యోగాల భర్తీ చేస్తామని లోకేశ్ తెలిపారు.

సూపర్ హిట్​ టాక్​తో దూసుకుపోతున్న కూటమి మేనిఫెస్టో - ప్రజల్లో విశేష ఆదరణ - Positive Responce to nda manifesto

కూటమి రాగానే పెట్టుబడులకు పరిశ్రమలు సిద్ధంగా ఉన్నాయ: నాడు ఒక్క అవకాశం అని జగన్​ మాయలో పడటంతో నేడు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందని లోకేశ్​ అన్నారు. టీడీపీ తెచ్చిన కంపెనీలు ఇప్పుడు పక్క రాష్ట్రానికి తరలిపోయాయని మండిపడ్డారు. పాదయాత్రలో ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకున్నానని లోకేశ్​ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారాలను మేనిఫెస్టోలో పొందుపరిచామన్నారు. టీడీపీ హయాంలో జిల్లాల వారీగా ప్రాధాన్యం కల్పించి నిలిచిపోయిన అమరావతి పనులు తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. కూటమి వచ్చిన వంద రోజుల్లో పెట్టుబడులకు పరిశ్రమలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. బ్యాండేజ్ బాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని జగన్​పై మండిపడ్డారు.

మంగళగిరికి మరిన్ని ఐటీ పరిశ్రమలు- మహిళా ఉద్యోగులతో బ్రహ్మణి సమావేశం - Nara Brahmani Meet IT Employees

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.