ETV Bharat / politics

సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు కొనసాగాలంటే మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం రావాలి: లోకేశ్ - Lokesh Campaign at Coimbatore - LOKESH CAMPAIGN AT COIMBATORE

Nara Lokesh Election Campaign at Coimbatore: సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు కొనసాగాలంటే మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం రావాలని నారా లోకేశ్ అన్నారు. తమిళనాడులోని కోయంబత్తూర్​లో రెండోరోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Nara_Lokesh_Election_Campaign_at_Coimbatore

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 12, 2024, 1:03 PM IST

Updated : Apr 12, 2024, 1:47 PM IST

Nara Lokesh Election Campaign at Coimbatore: ఏపీలో ఎన్డీఏ కూటమి గెలుపు కోసం కృషి చేస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, తమిళనాడులోని కోయంబత్తూరు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు కొనసాగాలంటే మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం రావాలని ఆయన అన్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో బీజేపీ ఎంపీ అభ్యర్థి అన్నామలై కుప్పుస్వామికి మద్దతుగా ఆయన రెండోరోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

చేనేతపై జీఎస్టీ రద్దు - కార్మికుల సమస్యలకు శాశ్వత పరిష్కారం: లోకేశ్ - Lokesh meet handloom workers

ఇవాళ ఉదయం సింగనల్లూరులోని ఇందిరా గార్డెన్స్​లో లోకేశ్​ అక్కడి తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. కోయంబత్తూరులో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండటంతో వారి మద్దతు కోసం లోకేశ్ ప్రచారం నిర్వహించారు. ప్రజల కోసం నిస్వార్థంంగా పనిచేస్తున్న అన్నామలైని గెలిపించాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు.

కరెంట్ బిల్లు షాక్ కొట్టిందా?- #NakuShockKottindhi హ్యాష్ ట్యాగ్​తో షేర్ చేయండి: లోకేశ్ - Nara lokesh on Current Bills

పారిశ్రామికాభివృద్ధి జరగాలంటే విజనరీ లీడర్ షిప్ అవసరమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ స్పష్టం చేశారు. ఏపీని ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలన్నది చంద్రబాబు సంకల్పమని ఆయన పేర్కొన్నారు. కోయంబత్తూరు 2.0 అభివృద్ధికి అన్నామలైని గెలిపించుకోవాలని కోరారు. తెలుగు పారిశ్రామికవేత్తలతో యువనేత నారా లోకేశ్​ ప్రసంగించారు. హైదరాబాద్ తో పోలిస్తే అభివృద్ధి విస్తృతమైన అవకాశాలు ఉన్నప్పటికీ చెన్నై వెనకబడిపోవడానికి విజనరీ లీడర్ షిప్ లేకపోవడమే ప్రధాన కారణమని యువనేత నారా లోకేశ్​ తెలిపారు.

కోయంబత్తూరు పార్లమెంటు పరిధిలోని సింగనల్లూరు ఇందిరా గార్డెన్స్​లో బిజెపి అభ్యర్థి అన్నామలైకి మద్దతుగా తెలుగు పారిశ్రామికవేత్తలతో యువనేత సమావేశమయ్యారు. విజనరీ లీడర్ లేకపోవడంతో ఇక్కడ అభివృద్ధి కుంటుపడిందని లోకేశ్​ అభిప్రాయపడ్డారు. గతంలో ప్రఖ్యాతిగాంచిన అంబాసిడర్ కార్లు ఇక్కడ తయారయ్యేవని గుర్తు చేశారు. ఒక్క ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకురావడానికి ఎంత కష్టపడాలో తనకు తెలుసని అన్నారు. కియా విషయంలో తమిళనాడు పోటీపడి ఆనాడు తాము ఏపీకి ఆ పరిశ్రమను తీసుకొచ్చామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్​లో గత అయిదేళ్లుగా సరైన నాయకుడు లేని కారణంగా పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లాయని ఆరోపించారు. పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో ఏపీ కంటే తమిళనాడు, కర్నాటక, ఒరిస్సా రాష్ట్రాలు ప్రస్తుతం ముందున్నాయన్నారు. కోయంబత్తూరు అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ అవసరమని అన్నామలై తెలిపారు.

యువగళం పాదయాత్రకు అక్షరరూపం- "శకారంభం" పేరుతో పుస్తకం​ - Lokesh Launch Sakarambham Book

తమిళనాడు రాష్ట్రంలో 40 శాతం మంది తెలుగు మూలాలు ఉన్న ప్రజల ఉంటారని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఈ నేపథ్యంలో టీడీపీ ఎన్డీఏలో భాగస్వామి కావడంతో తమిళనాడుకు చెందిన బీజేపీ విభాగం అక్కడి తెలుగు వారి కోసం నారా లోకేశ్​ను ఆహ్వానించింది. రెండు రోజుల పాటు అక్కడ ఎన్నికల ప్రచార సభల్లో లోకేశ్​ పాల్గొన్నారు. తమిళనాడులో ఎక్కువగా తెలుగు వారు ఉండడం వల్ల ఆయా ప్రాంతాల్లో అభ్యర్థులకు మద్దతుగా నారా లోకేశ్​తో బీజేపీ ప్రచారం నిర్వహించింది.

అందుకోసం లోకేశ్ గురువారం సాయంత్రం కోయంబత్తూరుకు బయల్దేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో లోకేశ్ కోయంబత్తూరు చేరుకున్నారు. కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామికి మద్దతుగా ప్రచారం చేశారు. గురువారం రాత్రి 7 గంటలకు బీజేపీ ఆధ్వర్యంలో పీలమేడులో ఏర్పాటు చేసిన సభలో లోకేశ్ ప్రసంగించారు.

Last Updated : Apr 12, 2024, 1:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.