Nandamuri Balakrishna Election Campaign in Satyasai District : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ప్రచారం జోరును పెంచారు. 'స్వర్ణాంధ్ర సాకార యాత్ర' పేరుతో శ్రీ సత్యసాయి జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండో రోజు లేపాక్షి మండలంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనపై మహిళలు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. హిందూపురం టీడీపీ అభిమానులు, మహిళలు, కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపితూ హూషారుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. బాలకృష్ణ 'స్వర్ణాంధ్ర సాకార యాత్ర'- కదిరి నుంచి ఎన్నికల ప్రచారం షురూ - Nandamuri Balakrishna
Balakrishna Election Campaign in Lepakshi : ఎన్నికల ప్రచారంలో భాగంగా లేపాక్షి మండలంలోని కొండూరు, కల్లూరు, నాయనపల్లి గ్రామాల్లో బాలకృష్ణ పర్యటించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బాలయ్య ఎన్నికల ప్రచారంలో భాగంగా డప్పుకొట్టి ప్రజల్లో ఫుల్ జోష్‌ను నింపారు. ఈ నేపథ్యంలోనే పార్టీ అభిమానులు జై బాలయ్య అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఓ చిన్నారిని ఎత్తుకొని ఆప్యాయంగా మద్దాడి ' అఖండ' ప్రేమ చూపారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని నందమూరి బాలకృష్ణ ధ్వజమెత్తారు. అంబేడ్కర్ విదేశీ విద్యను జగన్ విదేశీ విద్యగా పేరు మార్చి గాలికి వదిలేశారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తిరిగి అంబేడ్కర్ విదేశీ విద్యను తీసుకువచ్చి పేద విద్యార్థులకు ఉన్నత చదువులను అందిస్తామని హామి ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే పేద రైతులకు రెండు ఎకరాల కొనుగోలు భూమిని అందిస్తామని పేర్కొన్నారు. అధికార పార్టీ హయాంలో రాష్ట్రంలో పరిశ్రమలు రాక యువత పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్తాన్నారు అని వ్యాఖ్యానించారు. టీడీపీ అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందేలా కార్యాచరణ రూపొందించామని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ఓటు అనే వజ్రాయుధంతో సుపరిపాలన అందించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు. హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీగా బీకే పార్థసారథిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.