Nagababu Distributed Insurance Cheques to Janasena Activists Families: గత ప్రభుత్వంలో నేరాలకు పాల్పడిన వైఎస్సార్సీపీ నేతలు తప్పించుకోలేరని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. ఎన్నికల సమయంలో సీఎం స్థానంలో ఉన్న జగన్ పచ్చి ఆబద్దాలు చెప్పారని అందులో ఆయను పీహెచ్డీ పొందారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో తాము ఆ ప్రభుత్వం చేసే అప్రజాస్వామిక కార్యక్రమాలపై స్పందించేందుకు ఆరు నెలలు అవకాశం ఇచ్చామని ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఆ పార్టీ నేతలు రెచ్చిపోతున్నారని విమర్శలు గుప్పించారు.
వివిధ ప్రమాదాలలో మృతి చెందిన జనసేన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు నాగబాబు బీమా చెక్కులను (Active membership of Janasena) అందజేశారు. 2021 నుంచి 2024 వరకు 349 మంది కార్యకర్తలు మృతి చెందగా వీరికి సుమారు 17 కోట్ల 45 లక్షల రూపాయలు, గాయపడిన 443 మందికి 6 కోట్ల 74 లక్షలు అందించామని తెలిపారు. జనసేన కార్యకర్తలకు ఈ బీమా సదుపాయం ఒక వరంలాంటిదన్నారు. ఎవరైనా పేదలుంటే వారి తరఫున నేతలు సభ్యత్వ రుసుం కట్టాలని సూచించారు. తన అన్న, తమ్ముడు ఇచ్చిన ఈ జీవితం వారికే అంకితమని నాగబాబు చెప్పారు.
ఒక్క మెసేజ్‌తో గ్రామానికి ఆర్టీసీ బస్సు- లోకేశ్ స్పందనకు విద్యార్థి సంఘాల వందనం
జంగారెడ్డిగూడెంలో సారా తాగి మృతి చెందితే వైఎస్సార్సీపీ అధ్యక్షులు జగన్ వాటిని సహజ మరణాలుగా చూపించారని నాగబాబు ఆరోపించారు. వినుకొండలో గొడవను సాకుగా చూపి రాష్ట్రపతి పాలన విధించాలని అవాకులు చవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నేతల ధోరణి చూస్తుంటే రోజురోజుకు ఆ పార్టీ దిగజారిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో సీఎం స్థానంలో ఉన్న జగన్ పచ్చి ఆబద్దాలు చెప్పారు. అందులో జగన్ పీహెచ్డీ పొందారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో మేము ఆ ప్రభుత్వం చేసే అప్రజాస్వామిక కార్యక్రమాలపై స్పందించేందుకు ఆరు నెలలు అవకాశం ఇచ్చాం. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే ఆ పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. జగన్ ప్రభుత్వంలో నేరాలకు పాల్పడిన వైఎస్సార్సీపీ నేతలు తప్పించుకోలేరు. -నాగబాబు, జనసేన ప్రధాన కార్యదర్శి
కాల్వలను పట్టించుకోని గత ప్రభుత్వం- పంట నీట మునగడంతో అన్నదాతల ఆవేదన - Farmers Lost Crops