ETV Bharat / politics

వేమిరెడ్డి ఇంట తెలుగు తమ్ముళ్ల సందడి- స్వయంగా ఆహ్వానించిన తెలుగుదేశం నేతలు - ysrcp MP

MP Vemireddy Prabhakar Reddy resigned : తెలుగు దేశం పార్టీ నాయకులతో వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి నివాసం కోలాహలంగా మారింది. వైసీపీకి రాజీనామా చేసిన వేమిరెడ్డిని కలిసేందుకు రెండో రోజు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ysrcp_mp_vemireddy_resigned
ysrcp_mp_vemireddy_resigned
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2024, 8:14 PM IST

MP Vemireddy Prabhakar Reddy resigned : రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్సార్​ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవినీ వదులుకున్నారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా సమర్పిస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. పార్టీకి తాను చేసిన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని సీఎం జగన్​ను వేమిరెడ్డి కోరారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి కలిసేందుకు ఆయన అనుచరులు పెద్దఎత్తున తరలివచ్చారు. తనకు మద్దతుగా నిలిచిని వారందరికీ వేమిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. వేమిరెడ్డిని కలిసేందుకు వచ్చిన తెలుగు దేశం పార్టీ నేతలతో తన నివాసంలో సందడి వాతావరణం నెలకొంది. మాజీ మంత్రులు నారాయణ, సోమిరెడ్డి, బీద రవిచంద్ర యాదవ్ సహా ప్రముఖులు ఎంపీ నివాసానికి చేరుకుని పుష్పగుచ్ఛాలు అందజేశారు. శాలువాతో సత్కరించారు.

అజ్ఞాతంలోకి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి - జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా యోచన !

వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసం రెండో కోలాహలంగా మారింది. పలు జిల్లాల నుంచి ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలుగు దేశం పార్టీ నాయకులు ఆయన ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. రాత్రి వరకు వేమిరెడ్డితో చర్చలు జరిపారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని వైఎస్సార్సీపీ కార్పోరేటర్లు కొందరు వచ్చి ఆయనను కలిసి మద్దతు తెలిపారు.

వైసీపీకి మరో షాక్ - పార్టీకి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజీనామా

నెల్లూరు నగరంలోని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసం సందడిగా మారింది. రెండో ఉమ్మడి నెల్లూరు (Nellor) జిల్లా తెలుగు దేశం పార్టీ నాయకులు ఆయనను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ మంత్రి నారాయ‌ణ, జాతీయ ప్రధాన కార్యదర్శి బీద ర‌విచంద్ర యాద‌వ్‌, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ పార్లమెంట్, జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్‌, రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి (Kotamreddy Sridhar redddy), టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి, కావ‌లి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ కావ్య కృష్ణారెడ్డి, గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్‌ కుమార్, కోవూరు ఇన్‌చార్జ్ పోలంరెడ్డి దినేష్‌రెడ్డి, కందుకూరు ఇన్‌చార్జ్ ఇంటూరు నాగేశ్వర‌రావు పాల్గొన్నారు.

జ‌గన్ మోహన్‌ రెడ్డి నిరంకుశ పాల‌నవల్ల అనేక మంది వైఎస్సార్సీపీని వీడి తెలుగు దేశం పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. ఈ రాష్ట్రంలో రాక్షస ప‌రిపాల‌న సాగుతోంద‌ని విమ‌ర్శించారు. డ‌బ్బుల కోసం రాజ‌కీయాల్లోకి రార‌ని, గౌర‌వం కోసం వ‌స్తార‌ని చెప్తూ అలాంటి గౌర‌వం లేని దగ్గర ఎందుకు ఉండ‌డం అన్న ఉద్దేశంతోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బ‌య‌ట‌కు వ‌చ్చేశార‌న్నారు.

రాజీనామా అనంతరం వేమిరెడ్డి ఇంటికి క్యూ కడుతున్న నేతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.